Bandi sanjay Letter: టీటీడీ ఛైర్మన్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ, అందులో ఏముందంటే..
Karimnagar TTD Temple | కరీంనగర్ లో ప్రకటించిన టీటీడీ ఆలయం నిర్మాణానికి కృషి చేయాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు.

కరీంనగర్: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణ అభివృద్దికి టీటీడీ చేస్తున్న కృషిని బండి సంజయ్ మెచ్చుకున్నారు. ధూప-దీప నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలను ఆదుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. ఇదే క్రమంలో కరీంనగర్ లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరించాలని తన లేఖలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయును బండి సంజయ్ కోరారు.
2023లోనే కరీంనగర్ లోని టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించింది. అదే ఏడాది మే 31న కరీంనగర్ లోని 10 ఎకరాల స్థలంలో భూమి పూజ జరిగింది. అప్పటినుంచి నేటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. టీటీడీ ఆలయ నిర్మాణం కోసం కరీంనగర్ సహా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. కనుక టీటీడీ నిర్మాణ పనులు యుద్ద ప్రాతిపదికన కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని’ టీటీడీ ఛైర్మన్ క రాసిన లేఖలో బండి సంజయ్ కోరారు.
కరీంనగర్ కేంద్రంగా ఆధ్యాత్మిక శోభతో శ్రీవారు ఆలయ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి లేఖ వ్రాయడం జరిగింది.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 5, 2025
గతంలో 2023 సంవత్సరంలో మే 31న కరీంనగర్ లోని పద్మానగర్ ప్రాంతంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ… pic.twitter.com/UecjISFw7S






















