By: Arun Kumar Veera | Updated at : 05 Apr 2025 12:55 PM (IST)
ఈ మూడింటినీ ఆధార్‌తో లింక్ చేయండి ( Image Source : Other )
Linking Aadhaar With PAN, Bank Account, Mobile Number: భారతదేశంలో నివశిస్తున్న భారతీయుల ప్రజల దగ్గర ఆధార్ సహా చాలా రకాల గుర్తింపు పత్రాలు ఉంటాయి. ఈ లిస్ట్‌లో ఆధార్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ వంటివి ఉన్నాయి. ఈ పత్రాలు ప్రతిరోజూ ఏదో ఒక పనికి అవసరం అవుతాయి. వీటన్నింటిలో, భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే పత్రం ఆధార్ కార్డు. పసితనంలో ప్రి-స్కూల్‌లో అడ్మిషన్ నుంచి యవ్వనంలో ఉద్యోగం సంపాదించడానికి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి, చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికెట్ తీసుకోవడం వరకు ప్రతి పనికీ, ప్రతి అవసరంలో ఆధార్ అవసరం.
మన దేశంలో ఇంతటి కీలకమైన ఆధార్‌ను మరికొన్ని పత్రాలకు తప్పనిసరిగా జత చేయాలి, లేకపోతే పని జరగదు. ముఖ్యంగా, మూడు అంశాలకు ఆధార్ కార్డు లింక్ చేయకపోతే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు.
ఆధార్‌ను లింక్ చేయాల్సిన 3 ముఖ్యమైన అంశాలు:
ఆధార్ నంబర్ - పాన్ అనుసంధానం (Aadhaar Number - PAN linking)
భారతదేశంలో, ఆర్థిక సంబంధ పనుల్లో పాన్ కార్డ్‌ది చాలా ముఖ్యమైన పాత్ర. బ్యాంక్ లావాదేవీల నుంచి ఆదాయ పన్ను పత్రాల సమర్పణ (ITR Filing) వరకు అన్ని పనులకు పాన్ కార్డ్ అవసరం. మన దేశంలో పాన్ కార్డును ఆదాయ పన్ను విభాగం జారీ చేస్తుంది. పాన్ కార్డ్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేయడం అవసరం. మీ ఆధార్ కార్డును మీ పాన్ కార్డుకు లింక్ చేయకపోతే ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అంతే కాదు, మీ పాన్ కార్డ్ నిష్క్రియం (PAN card inactive) కావచ్చు. ఇప్పుడు, ఆధార్ - పాన్ అనుసంధానం కోసం కొంత రుసుము చెల్లించాలి, గతంలో ఈ పని ఉచితంగా జరిగేది.
ఆధార్ నంబర్ - బ్యాంకు ఖాతా అనుసంధానం (Aadhaar Number - Bank Account Linking)
భారతదేశంలో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉంది. ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వం జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్స్‌ను తీసుకొచ్చిన తర్వాత పొదుపు ఖాతాల సంఖ్య విపరీతంగా పెరిగింది. బ్యాంక్ ఖాతాల్లో పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా, రికరింగ్ డిపాజిట్ ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా వంటివి ఉన్నాయి. ఈ ఖాతాలన్నింటిలోనూ ఒక కామన్ విషయం ఉంది, అదే ఆధార్ కార్డ్. మీకు కరెంట్ ఖాతా ఉన్నా లేదా సేవింగ్స్ అకౌంట్ లేదా మరే బ్యాంక్ అకౌంట్ ఉన్నా మీ ఆధార్ నంబర్‌ను ఆ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి. మీ ఆధార్ మీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం కాకపోతే ఆ ఖాతా పని చేయదు. అంటే, మీరు దానిలో లావాదేవీలు చేయలేరు. ఈ ఇబ్బంది తలెత్తకుండా ఆధార్ నంబర్‌ను బ్యాంకు ఖాతాకు లింక్ చేయడం అవసరం.
ఆధార్ నంబర్ - మొబైల్ నంబర్ అనుసంధానం (Aadhaar Number - Mobile Number Linking)
మీరు కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ నంబర్ - మొబైల్ నంబర్ అనుసంధానం పూర్తి కావాలి. దీనివల్ల ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం కూడా ఉంటుంది. ధృవీకరణలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు & బ్యాంకింగ్ సంబంధిత పనులన్నీ చేయగలుగుతారు. అంతేకాదు, విద్రోహ & అసాంఘిక పనుల నిరోధం కోసం కూడా ఆధార్ నంబర్‌తో మొబైల్ నంబర్‌ను జత చేయాలి.
RBI Key Decisions: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
IndiGo Flight Crisis : ఈ తేదీ వరకు ఇండిగో టికెట్ రద్దు చేస్తే పూర్తి రీఫండ్! పూర్తి వివరాలు తెలుసుకోండి!
Airtel Recharge Plan: ఎయిర్టెల్ వినియోగదారులకు బిగ్ షాక్ ! రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్లను సైలెంట్‌గా క్లోజ్!
Gold Price: బంగారం ధర 15నుంచి 30 శాతం వరకు పెరిగే ఛాన్స్! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడి!
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Kadapa Mayor Election: కడప మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ
Suriya 47 Movie: మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
Harish Rao Challenges Revanth Reddy: రేవంత్ రెడ్డికి బండ కట్టి రంగనాయక సాగర్‌లో పడేస్తా - హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు