Vaishnavi Chaitanya: నిర్మాత ఎస్కేఎన్‌తో గొడవల్లేవ్... ఆయన నన్నేమీ అనలేదు - 'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య
SKN Comments On Telugu Heroines: తెలుగు వచ్చిన అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తనకు తెలిసి వచ్చిందని నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు పట్ల వైష్ణవి చైతన్య స్పందించారు.

తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)కు కథానాయికగా క్రేజ్ తీసుకు వచ్చిన సినిమా 'బేబీ'. ఆ చిత్ర నిర్మాత ఎస్కేఎన్ (Producer SKN), తనకు మధ్య ఎటువంటి గొడవలు లేవని, తనను ఆయన ఏమీ అనలేదని ఆవిడ స్పష్టం చేశారు. సిద్దు జొన్నలగడ్డ సరసన నటించిన 'జాక్... కొంచెం క్రాక్' సినిమాలోని 'కిస్' సాంగ్ విడుదల కార్యక్రమంలో ప్రచారంలో ఉన్న విమర్శల గురించి ఆవిడ స్పందించారు.
ఎస్కేఎన్ ఏమన్నారు?
వివాదం ఎక్కడ మొదలైంది?
ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ సిటీలో జరిగింది. దానికి ఓ అతిథిగా ఎస్కేఎన్ హాజరు అయ్యారు. ఆ మూవీలోని హీరోయిన్ కయాదు లోహర్ గురించి మాట్లాడుతూ... ''తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలను మేం ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం. తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు తెలిసి వచ్చింది. అందుకని తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, మా 'కల్ట్' దర్శకుడు సాయి రాజేష్ కోరుకుంటున్నాం'' అని చెప్పారు.
'బేబీ' చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తే... ఎస్కేఎన్ ప్రొడ్యూస్ చేశారు. దాంతో ఆ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి నిర్మాత కామెంట్ చేశారని ప్రచారం బలంగా జరిగింది. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని గంటల్లో వివరణ ఇచ్చారు. తెలుగు వచ్చిన అమ్మాయిలను తన సినిమాలలో కథానాయిక పాత్రలకు తీసుకున్నామని, 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' ఈవెంట్‌లో సరదాగా ఆ వ్యాఖ్యలు చేశానని ఎస్కేఎన్ వివరించారు.
ఎస్కేఎన్ నన్ను ఏమీ అనలేదు
ఎస్కేఎన్ గారు ఎవరిని అన్నారో తనకు తెలియదని, వైరల్ అయిన వీడియో పట్ల తర్వాత ఆయన వివరణ ఇచ్చారని వైష్ణవి చైతన్య గుర్తు చేశారు. 'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండ, తనతో ఆ సినిమా దర్శక నిర్మాతలు మరొక సినిమా ప్లాన్ చేసినప్పటికీ అనుకోని కారణాల వల్ల అది ముందుకు వెళ్లలేదని వివరించారు. దర్శక నిర్మాతలతో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తే వాళ్లతో సినిమా చేస్తానని చెప్పారు. దాంతో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యింది.
Also Read: 'అదిదా సర్‌ప్రైజ్'లో ఆ స్టెప్ తీసేయండి... 'రాబిన్‌హుడ్'కు తెలంగాణ మహిళా కమిషన్ షాక్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

