Adhi Dha Surprisu Controversy: 'అదిదా సర్‌ప్రైజ్'లో ఆ స్టెప్ తీసేయండి... 'రాబిన్‌హుడ్'కు తెలంగాణ మహిళా కమిషన్ షాక్
నితిన్ 'రాబిన్‌హుడ్'లో కేతికా శర్మ చేసిన ప్రత్యేక గీతం 'అదిదా సర్‌ప్రైజ్'లోని హుక్ స్టెప్ మీద విడుదలైనప్పటి నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు దీనిపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది.

ఆడియన్స్ అందరికీ సర్‌ప్రైజ్ అవుతుందని 'రాబిన్‌హుడ్' (Robinhood) టీం అనుకుంది. కానీ, వ్యతిరేకత వస్తుందని మాత్రం అసలు ఊహించినట్టు లేదు. రొమాంటిక్ హీరోయిన్ కేతికా శర్మ చేసిన ప్రత్యేక గీతం 'అదిదా సర్‌ప్రైజ్' (Adhi Dha Surprise Song) లోని హుక్ స్టెప్ మీద సాంగ్ విడుదల అయినప్పటి నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు దాని మీద తెలంగాణ మహిళా కమిషన్ సైతం స్పందించింది.
మహిళలను అసభ్యకరంగా చూపిస్తున్నారు...
ఆ స్టెప్స్ తీసేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం!
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ (Telangana State Women's Commission) గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. మహిళా కమిషన్ అధ్యక్షురాలు శారదా నేరెళ్ల కూడా ట్వీట్ చేశారు.
''ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి'' అని మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది.
దర్శక నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరించింది. మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలని, ఒకవేళ ఆ హెచ్చరికను పాటించకపోతే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ మహిళా కమిషన్ పేర్కొంది.
బాలకృష్ణ 'డాకు మహారాజ్'లోని 'దబిడి దిబిడి' పాటలో స్టెప్స్ మీద విమర్శలు వచ్చాయి. థియేటర్లలో సినిమా విడుదలైనప్పుడు స్టెప్స్ చూస్తే విమర్శలకు కారణమైన స్టెప్ లేదు. ఇప్పుడు నితిన్ 'రాబిన్‌హుడ్'లో 'అదిదా సర్‌ప్రైజ్' సాంగ్ స్టెప్స్ మీద విమర్శలు వచ్చాయి. ఆ పాటలోని మహిళల మనోభావాలు కించపరిచేలా ఉన్న హుక్ స్టెప్ తీసేయాలని దర్శక నిర్మాతలకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సూచించినట్లు తెలిసింది.
సమాజానికి సానుకూల సందేశాలు అందించడం, మహిళల గౌరవాన్ని కాపాడటం సినిమాల నైతిక బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ గుర్తు చేసింది. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని చిత్ర పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
Also Read: ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్
— Sharada Nerella (@sharadanerella) March 20, 2025
పత్రికా ప్రకటన
తేదీ: మార్చి 20, 2025
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది…
ఇప్పుడు నితిన్ 'రాబిన్‌హుడ్' ఏం చేస్తుంది?
'రాబిన్‌హుడ్' సినిమాకు కావాల్సిన బజ్ తీసుకు రావడంలో 'అదిదా సర్‌ప్రైజ్' సాంగ్ సక్సెస్ అయ్యింది. ఆల్రెడీ ఆ హుక్ స్టెప్ ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. అయితే మహిళా కమిషన్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయిన నేపథ్యంలో సినిమా యూనిట్ ఏం చేస్తుందో చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

