అన్వేషించండి

Nara Lokesh Latest News:Jr NTR ఫోటోతో ఫోజులిచ్చారు, తిట్టిన పవన్‌ను పొగిడారు- లోకేష్‌ చర్యల వెనుక రీజన్ ఇదేనా.!

Nara Lokesh Latest News:పవన్ కల్యాణ్ కామెంట్స్‌ను చాలా ఈజీగా తీసుకున్నారు. ఎన్టీఆర్ ఫొటోతో వచ్చిన అభిమానులను కలిసి ఫొటోలు దిగారు. ఇలా చేస్తున్న లోకేష్ ప్లాన్ ఏంటీ?

Nara Lokesh Latest News:ఓపెన్‌గా కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, సినిమాల సంగతి పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో ఎందుకు యాక్టివ్‌గా లేరు. ఆయనేమన్నా టీడీపీకి శత్రువా కాదే. కోస్తే పసుపు రక్తం. కట్టె కాలే వరకూ మా తాత స్థాపించిన టీడీపీతోనే ఉంటానన్నారు. 2009లో పార్టీ కోసం ఖాకీ చొక్కా వేసి ప్రచారం చేశారు. మరి అలాంటాయన 2014, 2019, 2024 ఎన్నికల్లో ఎక్కడికెళ్లి పోయారు. 

అదే టైంలో వైసీపీ వాళ్లు జూనియర్‌ను ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు. కొడాలి నాని వైసీపీ కాబట్టి..వల్లభనేని వంశీ దోస్త్ కాబట్టా.. పోనీ టీడీపీ సీనియర్ నేతలు జూనియర్ ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడే మాటలు ఎప్పుడైనా విన్నారా. జూనియర్ ఉన్నా లేకున్నా నష్టం లేదన్న మాటలు వచ్చాయా. లేదు.

బుధవారం లోకేష్‌ చేసిన ఓ పని ఆయన మెచ్యూరిటీకి పొలిటికల్ ఐడియాలజీని చెబుతోందని అంటున్నారు విశ్లేషకులు. తెలిసో తెలియకో తన చుట్టూ ఉన్న కోటరీ ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చేలా లోకేష్‌ మెచ్యూర్ గెస్చర్ ప్రొజెక్ట్ చేసిందా వీడియో.

బుధవారం మల్లవల్లి మోడల్ ఇండస్ట్రీయల్ పార్క్‌లో అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ఓపెనింగ్ ఉంటే వెళ్లారు లోకేశ్. అక్కడికి వెళ్లేప్పుడు టీడీపీ అభిమానులు ఓ చిన్నపాటి ర్యాలీ లాంటిది నిర్వహించారు. జూనియర్‌కు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆ ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఉన్నారు. వాళ్లంతా ఎన్టీఆర్ మీసం తిప్పుతున్నట్లుగా ఉండే జైఎన్టీఆర్ బ్యానర్లతో వచ్చేశారు. 

ఇలాంటి పరిస్థితిని చాలా నైస్‌గా డీల్ చేశారు లోకేశ్. ఆ ఎన్టీఆర్ ఫోటోను తనే తీసుకుని జై ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీని ఎత్తి అభిమానులకు చూపించారు. ఇది అసలు ఊహించని ఫ్యాన్స్ ఒక్కసారిగా జై ఎన్టీఆర్, లోకేష్ అంటూ నినాదాలు చేశారు. 

చంద్రబాబు తర్వాత టీడీపీ బాధ్యతలు ఎన్టీఆరే తీసుకుంటారని తారక్ అభిమానులు ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యారు. కానీ లోకేష్ పాలిటికల్‌ ఎంట్రీతో వాళ్ల ఆశలకు గండి పడింది. అప్పటి నుంచి పార్టీలో చంద్రబాబు తర్వాత లోకేష్ పేరు మాత్రమే వినిపిస్తూ వచ్చింది. మరోవైపు ఎన్టీఆర్ కూడా 2009 తర్వాత రాజకీయల వైపు చూడలేదు.  

ఎన్టీఆర్ సైలెంట్‌గా ఉన్నప్పటికీ తరచూ ప్రత్యర్థులు మాత్రం టీడీపీపై రాళ్లు వేస్తూనే ఉన్నారు.2009 తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. ఎప్పుడు కూడా ఎన్టీఆర్ వాటిపై స్పందించింది లేదు. గత ఐదేళ్లలో ఇంకా అనేక ఘటనలు జరిగినా ఎన్టీఆర్ రియాక్ట్ కాలేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి తన సన్నిహితులు టీడీపీకి దూరమై వైసీపీలో చేరినప్పుడు కూడా మాట్లాడలేదు. చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్‌పై విమర్శలు చేసినా, చంద్రబాబును జైల్లో పెట్టినా ఎన్టీఆర్‌ పట్టనట్టు ఉండిపోయారు. లోకేశ్ కోసమే ఎన్టీఆర్‌ను చంద్రబాబు తొక్కేశారు అందుకే ఈ మౌనం అని చాలా డిబేట్స్ నడిచాయి. కానీ ఎందుకిలా జరుగుతుందంటే మాత్రం ఎవ్వరి దగ్గరా ఆన్సర్ లేదు. 

ఇలాంటి హాట్‌ సిచ్చుయేషన్‌లో ఎన్టీఆర్ పోస్టర్‌ను లోకేష్‌ పైకి ఎత్తి ఎందుకు చూపించారు. దీనికో రీజన్ ఉంది అది మాట్లాడుకునే ముందు ఇంకో ఇన్సిడెంట్ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

రీసెంట్‌గా జనసేన ఆవిర్భావ సభ జరిగింది. కూటమిలో భాగంగా జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి ఆవిర్భావ సభ అది. పదేళ్లపాటు అనుభవించిన కష్టాలు, అవమానాలు దాటుకుని ఓ పార్టీగా నిలబడటంతో పాటు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న టీడీపీని కూడా నిలబెట్టామని ఆ సభలో పవన్ ప్రకటించారు. వేరే ఎవరైనా ఆ మాట అంటే అదేంటీ 40 ఏళ్ల పార్టీని 10ఏళ్లలో ఒక్కసారి కూడా గెలవని వాళ్లు ఫస్ట్ టైమ్ అధికారం అంటే ఏంటో చూస్తున్న పార్టీ నిలబెట్టిందా అని టీడీపీ ఆడేసుకునేది. కానీ ఆ మాట అన్నది స్వయానా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కావడంతో సైలెంట్ అయిపోయింది. 

ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి సీఎం చంద్రబాబే 2029లో మీతో కలిసే అధికారంలోకి రావాలనుందని బాహాటంగా ప్రకటనలు చేసిన పవన్ 40 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీని నిలబెట్టామనే మాటలకు టీడీపీ శ్రేణులు ఇబ్బంది పడ్డారు. కానీ చంద్రబాబు చాలా సైలెంట్‌గా ఉండాలని పార్టీ నాయకులకి ఆదేశాలు ఇచ్చారట. ఎవ్వరూ ఒక్క మాట కూడా అనలేదు. 

కానీ లోకేశ్ మాత్రం ఆ తర్వాత రోజు ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించారు. వాళ్లతో మాట్లాడుతూ టీ ఇప్పించారు. అలా టీ ఇచ్చే సందర్భంలో మా పవనన్న గాజు గ్లాసు లేదా పేపర్ కప్పుల్లో ఇస్తున్నావ్ అని ప్రశ్నించారు. అందరూ నవ్వుకున్నారు. మా అన్న గ్లాస్ ఉంటే ఎంత హీటైనా ఆపేస్తాడు అన్నారు లోకేశ్. 

పార్టీ అధినాయకుడి మాటను పాటిస్తూనే పవన్ మాటలను తను అస్సలు సీరియస్‌గా తీసుకోలేదని చెప్పటానికే అన్నట్టు లోకేశ్ చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అయ్యింది. ఇక్కడ కూడా లోకేశ్ మెచ్యూర్డ్‌గా మాట్లాడటానికి రీజన్ ఒకటి ఉంది. 

ఎన్టీఆర్ బ్యానర్ ఇన్సిడెంట్...పవన్ కళ్యాణ్ టీ గ్లాస్ సన్నివేశాన్ని కలిపి చూస్తే శత్రువులు వద్దు అనే లోకేష్‌ ఐడియాలజీ అర్థం అవుతోందంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇంట్లో వాళ్లైనా.. బయట వాళ్లైనా శత్రుత్వం వద్దు అని, అందరూ కావాలి, అందరి అభిప్రాయానికి గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తంది. మంచి మైక్‌లో చెబుదాం, చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం అన్న మాటలు లోకేశ్ ఫాలో అవుతున్నారట. రెచ్చిపోవాల్సిన చోట కూడా సైలెంట్‌గా ఉంటున్నారు. మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తున్నారు.  

మే 28,29న కడపలో మహానాడు నిర్వహించాలని టీడీపీ ఆలోచన. జగన్ అడ్డా అని చెప్పుకునే వైఎస్సాఆర్ కడపలో పసుపు పండుగ నిర్వహించి అక్కడే పార్టీ భవిష్యత్తు లీడర్‌గా లోకేశ్‌కు ప్రమోషన్ ఇవ్వబోతున్నారని టాక్. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్‌ను తీర్మానించుకుని ప్రకటన చేస్తారని తెలుస్తోంది. 

2029 ఎలక్షన్స్ వరకూ చంద్రబాబే టీడీపీని లీడ్ చేస్తారు. కానీ 2034 నాటికి వయస్సు రీత్యా చంద్రబాబు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమవుతుంది. సో పార్టీని అధినేతగా నడిపించాల్సిన లోకేశ్ ఏ వర్గాన్ని దూరం చేసుకోకూడదనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. 

ఎన్టీఆర్ లాంటి మాస్ అప్పీల్ ఉన్న వ్యక్తిని తన కోసం దూరం పెట్టి ఉండొచ్చనే అభిప్రాయం ఉంది. కానీ అలాంటి ఇన్‌సెక్యూరిటీని ఫీలవ్వాలని లోకేష్‌ మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేశారేమో అంటున్నారు విశ్లేషకులు. పవన్ ఇష్యూలోనూ అంతే... పవన్ చెప్పుకున్నంత స్థాయిలో 40 ఏళ్ల పార్టీని నిజంగా నిలబెట్టకపోయినా...చంద్రబాబు అరెస్ట్ అనే టఫ్ సిచ్యుయేషన్‌లో అండగా నిలబడిన అన్న లాంటి వ్యక్తి ఓ మాట అంటే పడితే తప్పేముంది అన్నట్టు ఊరుకున్నారేమో. ఆ మాటన్న వ్యక్తిపై తనకెంత గౌరవం ఉందో చెప్పాలనకున్నాడు ఏమో అందుకే గ్లాసు ప్రస్తావన తీసుకొచ్చారేమో అంటున్నారు. మాటల కంటే చేతలు గొప్పవి. ఆ చేతల్లో మెచ్యూరిటీ, నిజాయితీ ఉంటే లోకేశే 40 ఏళ్ల పార్టీకి ఫ్యూచర్ కావొచ్చు. అందుకే తనకు శత్రువులు ఉండొద్దు అనుకుంటున్నారో తను ఎవ్వరికీ శత్రువు కాకూడదు అనుకుంటున్నారేమో. టైమ్ డిసైడ్స్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Latest News:కేటీఆర్ రాష్ట్రవ్యాప్త టూర్ ప్రారంభం-మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?
కేటీఆర్ రాష్ట్రవ్యాప్త టూర్ ప్రారంభం-మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?
Nara Lokesh Latest News:Jr NTR ఫోటోతో ఫోజులిచ్చారు, తిట్టిన పవన్‌ను పొగిడారు- లోకేష్‌ చర్యల వెనుక రీజన్ ఇదేనా.!
Jr NTR ఫోటోతో ఫోజులిచ్చారు, తిట్టిన పవన్‌ను పొగిడారు- లోకేష్‌ చర్యల వెనుక రీజన్ ఇదేనా.!
Harish Rao Latest News:ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు ఊరట- FIR కొట్టేసిన హైకోర్టు 
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు ఊరట- FIR కొట్టేసిన హైకోర్టు 
Vishnupriya Latest News: నిమిషానికి 90 వేలు- బెట్టింగ్ యాప్‌ గుట్టు విప్పిన యాంకర్ విష్ణుప్రియ 
నిమిషానికి 90 వేలు- బెట్టింగ్ యాప్‌ గుట్టు విప్పిన యాంకర్ విష్ణుప్రియ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Latest News:కేటీఆర్ రాష్ట్రవ్యాప్త టూర్ ప్రారంభం-మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?
కేటీఆర్ రాష్ట్రవ్యాప్త టూర్ ప్రారంభం-మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?
Nara Lokesh Latest News:Jr NTR ఫోటోతో ఫోజులిచ్చారు, తిట్టిన పవన్‌ను పొగిడారు- లోకేష్‌ చర్యల వెనుక రీజన్ ఇదేనా.!
Jr NTR ఫోటోతో ఫోజులిచ్చారు, తిట్టిన పవన్‌ను పొగిడారు- లోకేష్‌ చర్యల వెనుక రీజన్ ఇదేనా.!
Harish Rao Latest News:ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు ఊరట- FIR కొట్టేసిన హైకోర్టు 
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు ఊరట- FIR కొట్టేసిన హైకోర్టు 
Vishnupriya Latest News: నిమిషానికి 90 వేలు- బెట్టింగ్ యాప్‌ గుట్టు విప్పిన యాంకర్ విష్ణుప్రియ 
నిమిషానికి 90 వేలు- బెట్టింగ్ యాప్‌ గుట్టు విప్పిన యాంకర్ విష్ణుప్రియ 
Vaishnavi Chaitanya: నిర్మాత ఎస్కేఎన్‌తో గొడవల్లేవ్... ఆయన నన్నేమీ అనలేదు - 'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య
నిర్మాత ఎస్కేఎన్‌తో గొడవల్లేవ్... ఆయన నన్నేమీ అనలేదు - 'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య
Betting Apps Case Scam: ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
Viral News: కాపురం చేయాలంటే రోజుకు రూ.5వేలు అడిగిందని భర్త ఫిర్యాదు - అసలు నిజమేంటో చెప్పిన భార్య
కాపురం చేయాలంటే రోజుకు రూ.5వేలు అడిగిందని భర్త ఫిర్యాదు - అసలు నిజమేంటో చెప్పిన భార్య
Bihar Crime News: నీళ్ల కోసం కేంద్రమంత్రి ఇంట్లో రక్తపాతం- ఒక మేనల్లుడు మృతి, మరొకరి పరిస్థితి విషమం
నీళ్ల కోసం కేంద్రమంత్రి ఇంట్లో రక్తపాతం- ఒక మేనల్లుడు మృతి, మరొకరి పరిస్థితి విషమం
Embed widget