Viral News: కాపురం చేయాలంటే రోజుకు రూ.5వేలు అడిగిందని భర్త ఫిర్యాదు - అసలు నిజమేంటో చెప్పిన భార్య
Techie Family: బెంగళూరులో ఓ వ్యక్తి తన భార్య కాపురం చేయాలంటే రోజుకు ఐదు వేలు అడుగుతుందని .. విడాకుల కోసం లక్షలు డిమాండ్ చేస్తోందని ఫిర్యాదు చేశాడు. ఈ న్యూస్ వైరల్ అయింది. అయితే ఆ భార్య కూడా స్పందించింది.

Techie husband And Wife: కుటుంబంలో వచ్చే వివాదాల కారణంగా ఏర్పడే కలహాలు భార్యభర్తల మధ్య పరిష్కరించలేనంత సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో భార్యలు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసేవారు పెరిగిపోయారు. చట్టాలు కూడా మహిళలకు అనుకూలంగా ఉండటంతో మగవాళ్లకు సానుభూతి ఎక్కువగా వస్తోంది. ఇటీవల బెంగళూరులో అతుల్ సుభాష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ అంశంపై ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతోంది.
తాజాగా బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఒకరు తన భార్యపై సంచలన ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజుకు రూ.5000 ఇస్తేనే కాపురం చేస్తానని, లేదంటే చనిపోతానని తన భార్య వేధిస్తుందని పోలీసులకు సాప్ట్‌వేర్ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. బెంగళూరు వయ్యాలికావల్ పీఎస్ పరిధిలో శ్రీకాంత్ అనే సాప్ట్‌వేర్ ఉద్యోగికి యువతితో 2022లో పెళ్లైంది.. శ్రీకాంత్‌కు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడంతో ఇంటి నుండే పని చేస్తున్నాడు. అయితే ఆ యువతి కాపురం చేయాలంటే రోజు రూ.5000 ఇవ్వాలని, లేదంటే రూ.45 లక్షలు ఇచ్చి విడాకులు తీసుకోవాలని నిత్యం వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. జూమ్ ద్వారా విధులకు హాజరయ్యే సమయంలో మధ్యలో వచ్చి డ్యాన్స్‌లు చేస్తూ అకారణంగా తిడుతుందని.. ఏమైనా అంటే చనిపోతానని బెదిరిస్తుందని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 60 ఏళ్ల వయసులో పిల్లలను దత్తత తీసుకోవచ్చని చెబుతూ ఆమె పిల్లలను కనడానికి నిరాకరించిందని పోలీసులకు చెప్పాడు.
శ్రీకాంత్ ఫిర్యాదు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అయితే ఈ అంశంపై అతని భార్య కూడా స్పందించింది. అసలు శ్రీకాంత్ కట్నం కోసం వేధిస్తూండటంతో ఇప్పటికే కేసు కూడా పెట్టానని రివర్స్ లో తనపై ఆరోపణలు చేసి పరువు తీయాలనుకుంటున్నాడని ఆమె అంటోంది. ఇంటిని నడపడానికి లేదా విడాకులు తీసుకోవడానికి తన భర్త నుండి డబ్బు డిమాండ్ చేయలేదని స్పష్టం చేసింది. తన తండ్రి తమ వివాహానికి రూ.40 లక్షలు ఖర్చు చేశాడని, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని మాత్రమే తాము కోరుతున్నామని స్పష్టం చేసింది.
తన భర్త తనను శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీకాంత్ భార్య బిందు ఆరోపించింది. తన భర్త ఇంట్లో ప్రతి క్షణం రికార్డ్ చేసేవాడని, అతనికి అనుమానం ఎక్కువ అని తెలిపింది. వేధింపులకు సంబంధించిన ఆడియో మరియు వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని పోలీసులకు అందజేస్తానని ఆమె ప్రకటించారు.
భార్యభర్తల మధ్య వివాదాలు ఇటీవలి కాలంలో జాతీయ స్తాయి సమస్యలుగా మారుతున్నాయి. కొంత మంది తీవ్ర వేధింపులు తట్టుకోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటూండటంతో ఇవి వైరల్ అవుతున్నాయి. ఎవరు నిజాలు చెబుతున్నారో.. ఎవరు అవాస్తవాలు చెబుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉంటోంది. సాధారణంగా కుటంబ విషయాల్లో ఎక్కువగా మహిళకు గృహహింసకు గురవుతూ ఉంటారు కాబట్టి .. వారికే ఎక్కువ మద్దతు లభిస్తోంది. కానీ పురుషులకు కూడా ఇటీవలి కాలంలో మద్దతు లభిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

