Sai Pallavi: రామాయణం కాదు... సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఇదే - రిలీజ్ డేట్ ఫిక్స్, హీరో బ్యాగ్రౌండ్ తెలుసా?
ఒక రోజు విడుదల తేదీ: జునైద్ ఖాన్, సాయి పల్లవి చిత్రం 'ఏక్ దిన్' పోస్టర్ విడుదల. ఆమిర్ ఖాన్ నిర్మించిన సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించారు.

బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan) కథానాయకుడిగా పరిచయమైన తొలి చిత్రం 'లవ్ యాపా'. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు జునైద్ రెండో సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఆ సినిమా పేరు 'ఏక్ దిన్' (Ek Din Movie). ఈ సినిమాలో అతనికి జంటగా సౌత్ హీరోయిన్ సాయి పల్లవి నటించారు. ఆమె బాలీవుడ్ డెబ్యూ ఇది.
'ఏక్ దిన్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అందులో జునైద్ ఖాన్, సాయి పల్లవి కనిపించారు. పోస్టర్‌లో ఇద్దరూ మంచులో ఐస్ క్రీమ్ తింటూ నడుస్తున్నట్లుగా ఉంది. జునైద్ బ్లాక్ జాకెట్, బ్రౌన్ మఫ్లర్, బ్లూ కలర్ డెనిమ్ ధరించారు. సాయి పల్లవి బ్లాక్ ఓవర్ కోట్, ఊదా టోపీ ధరించి కనిపించారు.
View this post on Instagram
'ఏక్ దిన్' విడుదల తేదీ ఖరారు
Ek Din Movie Release Date: 'ఏక్ దిన్' సినిమాలో జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాతో సాయి పల్లవి తన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. 'ఏక్ దిన్' సినిమా ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై రూపొందుతోంది. ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. మే 1, 2026న థియేటర్లలో 'ఏక్ దిన్' విడుదల కానుంది. జనవరి 16, 2026న సినిమా టీజర్ విడుదల కానుంది. ప్రస్తుతానికి సినిమాలోని ఇతర నటీనటుల వివరాలు ఇంకా వెల్లడించలేదు.
Also Read: 52 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్... ట్రోల్స్‌కు బాలీవుడ్ భామ ఆన్సర్
జునైద్ ఖాన్ తొలి సినిమా ఏదో తెలుసా?
జునైద్ ఖాన్ 2024లో 'మహారాజ్' సినిమాతో నటనలోకి అడుగు పెట్టారు. ఆ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అందులో శర్వరి వాఘ్ హీరోయిన్. ఆ తర్వాత జునైద్ 2025లో 'లవ్ యాపా' సినిమాతో వెండితెరపై అడుగు పెట్టారు. ఆ సినిమాలో అతని సరసన శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్ హీరోయిన్‌గా నటించారు. ఇప్పుడు 'ఏక్ దిన్' సినిమాతో జునైద్ తన లుక్ టెస్ట్ చేసుకుంటున్నారు.
'రామాయణం'లో సీతగా సాయి పల్లవి
సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే... 'ఏక్ దిన్' తర్వాత నటి 'రామాయణం'లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆమె సీత పాత్ర పోషిస్తున్నారు. దీపావళి 2026న 'రామాయణం' థియేటర్లలో విడుదల కానుంది. అదీ సంగతి.




















