Viral News: పెళ్లి చేసుకుంటాం కదా అని లవర్స్ శోభనం చేసేసుకున్నారు - కానీ ఈ పెద్దోళ్లున్నారే?
UP Couple: యూపీలో ఓ ప్రేమ జంట చెట్టూ, పుట్టలు తిరగడం అయిపోయిన తర్వాత ఓ సారి తొందరపడ్డారు. కానీ పెద్దలకు దొరికిపోయారు. గంటలో వాళ్ల పెళ్లి చేసేశారు పెద్దలు.

UP Lovers Instant marriage: లవర్స్ అంటే లవర్స్ గానే ఉండాలి.. భార్యభర్తల్లా ఉండకూడదు. కాదు మేము త్వరలో భార్యభర్తలం అవుతాం కాబట్టి ఇప్పుడే తొందరపడతాం అంటే చాలా పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కావాలంటే ఈ ఉత్తరప్రదేశ్ జంటను చూసి తెలుసుకోవచ్చు.
ఉత్తరప్రదేశ్ లోని హమీర్ పూర్‌లో అభ్యంతరక స్థితిలో పట్టుబడిన ప్రేమ జంట
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ ఓ ప్రేమ జంట ఉంది. మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట, తరచుగా ఒకరినొకరు కలుసుకునేవారు. ఊరందరికీ వారిద్దరూ ప్రేమికులని తెలుసు. వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ మామూలేగా అని అందరూ అనుకుంటూ ఉండేవారు. కానీ వారు ఎప్పుడు లైన్ క్రాస్ చేస్తారా అని చూసేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే పెళ్లి చేసేయడానికి. ఇలాంటి సందర్భంలో పెళ్లి అంటే రెండు అర్థాలు వస్తాయి.. వాళ్లు మంచి మూమెంట్ లో ఉన్నప్పుడు పట్టుకుని చితక్కొట్టేయడాన్ని కూడా పెళ్లి అంటారు. అయితే ఆ గ్రామస్తులు వారికి అలా చితక్కొట్టే పెళ్లి చేయాలనుకోలేదు. నిజమైన పెళ్లే చేయాలనుకున్నారు.అందు కోసం కాచుకుని కూర్చున్నారు.
గ్రామంలో పంచాయతీ పెట్టి అప్పటికప్పుడు పెళ్లి చేయాలని అమ్మాయి తండ్రి డిమాండ్
ఓ రోజు అమ్మాయి ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లారు. ఇదే మంచి సమయం అని ఆ యువకుడు తన లవర్ ఇంట్లో దూరిపోయాడు. అమ్మాయి తండ్రి అనుకోకుండా పొలాల నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వారు కలిసి ఉన్నట్లు గుర్తించారు. వారు చేయకూడని పనులు చేస్తున్నట్లుగా గుర్తించారు. అతను వారిని గదిలోనే ఉంచి బయట గడి పెట్టి ఊరందర్నీ పిలిచాడు. ప్రేమికులుగా ఉంటే పర్వాలేదు కానీ.. భార్యభర్తలుగా పనులు చేస్తే.. నిజంగానే వారిని భార్యభరతులుగా మార్చాలని డిసైడయ్యారు. గ్రామంలో ఇలాంటి పనులు చేయడం మంచిది కాదని.. ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.
పోలీసులు జోక్యం చేసుకోవడంతో అప్పటికప్పుడు పెళ్లి
అయితే పెళ్లి అంటే.. చాలా చర్చలు జరగాలి. కట్న కానకలు..ఇతర మర్యాదల గురించి మాట్లాడుకోవాలి. వీటిపై మాట్లాడుకుని సుదీర్ఘ చర్చల తర్వాత, రెండు కుటుంబాలు జంట వివాహానికి అంగీకరించాయి. వారేమీ టైమ్ పాస్ లవ్ చేసుకోవడం లేదని పైగా శోభనం కూడా పూర్తి చేసుకున్నారు కాబట్టి పెళ్లిచేయాలని డిసైడయ్యారు. ఊళ్లో గలాటా జరుగుతుందని తెలియడంతో పోలీసులు కూడా వచ్చారు. పెళ్లితో ఆ రెండు కుటుంబాల వివాదం సమసిపోతుందని పత్రం రాయించుకుని వెళ్లిపోయారు. పెద్దలు అదే రోజు రాత్రి పెళ్లి ఏర్పాట్లు చేసేసి..పెళ్లి కూడా చేసేశారు.
అయితే వారిద్దరి మధ్య ఉన్నది నిజమైన ప్రేమ అయితే .. పర్వాలేదు కానీ ఆకర్షణ అయితే.. మాత్రం కలిసి ఉండటం కష్టమని చెప్పుకోవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

