Viral News: అమెరికా మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు ఇండియాలో పట్టివేత - ఏకంగా 8 లక్షల కోట్ ఫ్రాడ్ మరి !
Crypto Fraud: భారత్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ చాలా మంది అమెరికా పోయి దాక్కుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అమెరికా నుంచి ఇండియాకు వచ్చి దాక్కున్నాడు. కానీ సీబీఐ పట్టేసుకుంది.

US Most Wanted: అమెరికాలో భారీ క్రిప్టోకరెన్సీ మోసం కేసులో వాంటెడ్ గా ఉన్న లిథువేనియన్ వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అలెక్సేజ్ బెస్సియోకోవ్ 'గ్యారంటెక్స్' అనే క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్‌ను ఏర్పాటు చేసి, రాన్సమ్‌వేర్, కంప్యూటర్ హ్యాకింగ్ మాదకద్రవ్యాల అమ్మకాలు చేసేవాడు. వీటి ద్వారా ద్వారా వచ్చిన ఆదాయాన్ని లాండరింగ్ చేసేవాడు.
In a coordinated action with CBI, Kerala Police arrests wanted criminal of USA from Thiruvananthapuram pic.twitter.com/bVJZr1YEg2
— Central Bureau of Investigation (India) (@CBIHeadquarters) March 12, 2025
అమెరికా సీక్రెట్ సర్వీస్ చెప్పిన దాని ప్రకారం బెస్సియోకోవ్ దాదాపు ఆరు సంవత్సరాల కాలంలో గారంటెక్స్‌ను నియంత్రించి లక్షల కోట్ల రూపాయల ఫ్రాడ్ చేశాడు. అంతర్జాతీయ నేర సంస్థలు, ఉగ్రవాద సంస్థళు రూ. 8 లక్షల కోట్లకు పైగా విలువైన క్రిప్టోకరెన్సీ లావాదేవీలను నిర్వహించడానికి అలెక్సేజ్ కారణం అయ్యాడు. "గ్యారంటెక్స్ ద్వారా వందల మిలియన్ల నేరపూరిత ఆదాయాన్ని పొందిందని అమెరికాలో కేసు నమోదు అయింది.
CBI, Kerala police arrest Lithuanian wanted by US in crypto fraud worth billions
— Trutherbotchief (@Trutherbotchief) March 12, 2025
Alexsej Besciokov, 46, a Lithuanian national, was arrested from Thiruvananthapuram in Kerala. pic.twitter.com/zzWtL2xLMO
హ్యాకింగ్, రాన్సమ్‌వేర్, ఉగ్రవాదం , డ్రగ్స్ మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి వివిధ నేరాలను సులభతరం చేయడానికి తన కంపెనీని అలెక్సేజ్ ఉపయోగించాడు. యూఎస్ కోడ్ టైటిల్ 18ని ఉల్లంఘించి మనీలాండరింగ్‌కు కుట్ర, యుఎస్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్‌ను ఉల్లంఘించడానికి కుట్ర, మరియు లైసెన్స్ లేని మనీ సర్వీసెస్ వ్యాపారాన్ని నిర్వహించడానికి కుట్ర వంటి అనేక ఆరోపణలపై అమెరికాలోకేసులు నమోదయ్యాయి. ఇతన్ని మోస్ట్ వాటెండ్ గా ప్రకటించారు.
💰Alexsej Besciokov, a wanted criminal in the US was arrested by the Kerala police, a statement from the Central Bureau of Intelligence said on Wednesday.
— Mint (@livemint) March 13, 2025
👤 Who is Alexsej Besciokov, the crypto kingpin arrested in India at the US request?
🔗 Read here 👇… pic.twitter.com/JGKTXlsJm4
ఇతను ఇండియాలో ఉన్నాడన్న సమాచారం తెలియడంతో అమెరికా అధికారులు విదేశాంగ మంత్రిత్వ శాఖకు తాత్కాలిక అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అతను ఎక్కడ ఉన్నారో ట్రాక్ చేశారు. కేరళలోని తిరువనంతపురంలో ఉన్నట్లుగా గుర్తించారు. వేరే దేశం వెళ్లేందుకు సిద్దమవుతున్న సమయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , కేరళ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి బెస్సియోకోవ్‌ను అరెస్టు చేశారు. అతన్ని అమెరికాకు అప్పగించనున్నారు.
అమెరికాతో భారత్ కు నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం కిందట ఇటీవల ముంబై పేలుళ్లు సూత్రధారిని భారత్ కు అప్పగించేందుకు ట్రంప్ అంగీకరించారు.



















