Crime News: రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ మృతి, మార్నింగ్ వాక్ వెళితే తీవ్ర విషాదం

Road accident at Vijayawada High way | హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ మృతిచెందారు. మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన నందీశ్వర బాబ్జీని బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం వద్ద జాతీయ రహదారిపై శనివారం ఈ ఘటన జరిగింది.
అడిషనల్ డీసీపీ నందీశ్వర బాబ్జీ లక్ష్మారెడ్డిపాలెంలోని మైత్రి కుటీర్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం 4.30 గంటలకి వాకింగ్ వెళ్ళడానికి విజయవాడ జాతీయ రహదారి దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఆయనను ఢీకొట్టింది. కిందపడిన ఆయనపై వెనకాల వస్తున్న నూజివీడు డిపోకు చెందిన బస్సు ఢీకొట్టడంతో నందీశ్వర బాబ్జీ అక్కడిక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు.
గత మూడు రోజుల కిందటే బాబ్జీకి ఏసీపీ నుండి అడిషనల్ ఎస్పీ గా ప్రమోషన్ వచ్చింది. ఆయన ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ లో కంట్రోల్ రూమ్ లో సేవలు అందిస్తున్నారు. మరో 3 రోజుల్లో బాబ్జీ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చెయ్యాల్సి ఉంది. కానీ ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో ఆయన మృతిచెందడంతో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

