By: Arun Kumar Veera | Updated at : 21 Mar 2025 12:39 PM (IST)
పన్ను ఆదా చేసే అద్భుత మార్గం ( Image Source : Other )
Income Tax Exemption on LTA: ఆదాయ పన్ను ఆదా చేయడానికి పన్ను చెల్లింపుదార్లు (Taxpayers) వివిధ పద్ధతులను అవలంబిస్తారు & వివిధ రకాల సాధనాల్లో పెట్టుబడులు పెడతారు. వీటిలో ఉత్తమమైన మార్గాలలో ఒకటి "లీవ్ ట్రావెల్ అలవెన్స్" (LTA). ఉద్యోగులు సద్వినియోగం చేసుకోగల ఆదాయ పన్ను ఆదా (Saving income tax) మార్గాల్లో ఇది ఒకటి. LTA కింద ఖర్చు చేసే మొత్తం పన్ను రహితం.
ప్రయాణ ఖర్చులను భరించనున్న కంపెనీలు
LTA అంటే, కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే ఒక రకమైన భత్యం. ఈ భత్యం ఉద్యోగితో పాటు అతని/ఆమె జీవిత భాగస్వామి, పిల్లలు, ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల ప్రయాణ ఖర్చులను కవర్ చేస్తుంది. 'ఇంటి అద్దె భత్యం' (HRA) తరహాలోనే 'సెలవు ప్రయాణ భత్యం' (LTA) కూడా ఉద్యోగి జీతంలో ఒక భాగం. ఇది జీతం ప్యాకేజీలో కలిసి ఉంటుంది.
దేశంలోని ప్రయాణాలకు క్లెయిమ్ చేయవచ్చు
1961 ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 10(5) ప్రకారం, సెలవు ప్రయాణ భత్యాన్ని మినహాయింపుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, లీవ్ ట్రావెల్ అలవెన్స్ ప్రయోజనాన్ని దేశం లోపల జరిగిన ప్రయాణాలకు మాత్రమే పొందవచ్చు. విదేశాలకు చేసే ప్రయాణాలపై LTA క్లెయిమ్ చేయలేరు. దీంతో పాటు, కంపెనీ మీకు ఇచ్చే మొత్తంపై మాత్రమే మీరు LTAపై పన్ను మినహాయింపు (Income tax exemption on LTA)ను క్లెయిమ్ చేయవచ్చు. మీ ప్రయాణానికి అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే, ఆ అదనపు మొత్తంపై పన్ను మినహాయింపు లభించదు.
నాలుగు సంవత్సరాల బ్లాక్‌లో రెండుసార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు
ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం, నాలుగు సంవత్సరాల కాలంలో రెండుసార్లు LTA క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం 2022-25 బ్లాక్ పీరియడ్ కొనసాగుతోంది. అంటే.. మీరు 1 జనవరి 2022 నుంచి 31 డిసెంబర్ 2025 మధ్య చేసిన రెండు ప్రయాణాలకు LTA క్లెయిమ్ చేసుకోవచ్చు. LTA క్లెయిమ్ చేసుకోవడానికి మీ ప్రయాణ సంబంధిత ఖర్చుల బిల్లులన్నింటినీ మీ వద్ద ఉంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే, పన్ను మినహాయింపు కోసం ఆ బిల్లులను రుజువులుగా సమర్పించాలి. బిల్లులు లేకుండా మీరు పన్ను మినహాయింపు పొందలేరు.
ఈ విధంగా క్లెయిమ్ చేయండి
LTA పై ఆదాయ పన్ను మినహాయింపు పొందేందుకు టిక్కెట్లు, బోర్డింగ్ పాస్‌లు, హోటల్ బిల్లులు, స్థానిక రవాణా ఖర్చుల వివరాలను LTA క్లెయిమ్ ఫారమ్‌తో పాటు కంపెనీ యాజమాన్యానికి సమర్పించాలి. దీనికి చివరి తేదీ 2025 మార్చి 31. అంటే, ఈ నెలాఖరు వరకే సమయం ఉంది. LTA క్లెయిమ్ చేసుకోవడానికి మీరు మీ పాన్ కార్డ్ & బ్యాంక్ ఖాతా వివరాలను కూడా అందించాలి, తద్వారా రీయింబర్స్‌మెంట్ పొందడంలో ఎటువంటి సమస్య ఉండదు.
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Husband Seek Divorce : LB నగర్లో భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. షాకింగ్ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
MaghMela 2026: అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!