By: Arun Kumar Veera | Updated at : 20 Mar 2025 01:29 PM (IST)
Twitter ( Image Source : Other )
Tips To Identify Growth Stocks: గత మూడు రోజులుగా స్టాక్ మార్కెట్ తన పెట్టుబడిదారులకు లాభాలు ఇస్తోంది. మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పుడు ఎగ్జిట్ తీసుకున్న చాలామంది ఇన్వెస్టర్లు, ఇప్పుడు మళ్లీ మార్కెట్ వైపు ఆకర్షితులవుతున్నారు & గ్రోత్ స్టాక్స్ కోసం వెదుకుతున్నారు.
గ్రోత్ స్టాక్స్ అంటే ఏంటి?
భవిష్యత్తులో వేగంగా వృద్ధి చెందుతుందని ఆశిస్తున్న కంపెనీల స్టాక్స్‌ను గ్రోత్ స్టాక్స్ అంటారు. ఆ కంపెనీల ఆశాజనక పనితీరుతో భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయన్న అంచనాలతో పెట్టుబడిదారులు అలాంటి కంపెనీలలో షేర్లు కొంటారు. వాస్తవానికి, ఇది గ్రోత్ స్టాక్ అని చెప్పడానికి నిర్దిష్టలంటూ ఏవీ ప్రమాణాలు లేవు. అయినప్పటికీ, కొన్ని లక్షణాల ద్వారా వాటిని గుర్తించవచ్చు.
గ్రోత్ స్టాక్స్‌ను ఎలా గుర్తించాలి?
వృద్ధి స్టాక్స్‌ను గుర్తించడానికి వ్యాపారం, ఆదాయం & లాభాల పెరుగుదల, ఖర్చుల తగ్గుదల వంటి కొన్ని ప్రత్యేక విషయాలపై పెట్టుబడిదారులు ఫోకస్ పెట్టాలి. ఆదాయం, లాభాలు నిరంతరం పెరుగుతున్న కంపెనీలను ఎంచుకోవచ్చు. లాభాల మార్జిన్‌ను జాగ్రత్తగా చూసుకోండి. నిర్వహణ లాభం, నికర లాభం మార్జిన్లు ఎప్పటికప్పుడు వృద్ధి చెందాలి. ఈ మార్జిన్లు.. ఖర్చులను నిర్వహించడంలో ఆ కంపెనీ సమర్థవంతంగా పని చేస్తుందో, లేదో చెబుతాయి.
ఆర్థిక నిష్పత్తులు (Financial ratios) చూడండి
సాధారణంగా, 15 నుంచి 25 మధ్య P/E నిష్పత్తి ఉన్న స్టాక్ మంచిదని స్టాక్ మార్కెట్ వర్గాలు భావిస్తాయి.
1 నుండి 3 మధ్య P/B నిష్పత్తి అనువైనదని భావిస్తారు.
10-20 శాతం మధ్య 'రిటర్న్ ఆన్ ఈక్విటీ' (RoE) మంచిదని భావిస్తారు.
డెట్-ఈక్విటీ నిష్పత్తి (Debt-Equity Ratio) 1 లేదా అంతకంటే తక్కువ ఉండడం కంపెనీ ఆర్థిక స్థిరత్వాన్ని చూపుతుంది.
ఈ విషయాలపైనా ఫోకస్
టెక్నాలజీ, హెల్త్‌కేర్ లేదా కన్జ్యూమర్ గూడ్స్ వంటి వర్ధమాన రంగాలలోని కంపెనీలను, ముఖ్యంగా.. ప్రత్యేక ఉత్పత్తులు, పేటెంట్లు లేదా బలమైన బ్రాండ్ విధేయత కలిగిన కంపెనీలను పరిగణనలోకి తీసుకోవచ్చన్నది మార్కెట్ నిపుణుల సూచన. స్టాక్ అంతర్గత విలువ - మార్కెట్ ధరను సరిపోల్చండి. మార్కెట్ ప్రైజ్ కంటే తక్కువ ఇంటర్నల్ వాల్యూ (మార్కెట్ ధర < అంతర్గత విలువ) కలిగిన స్టాక్స్ భవిష్యత్తులో మంచి రాబడిని ఇవ్వగలవు. సాధారంగా, DIIs & FIIs ఇలాంటి స్టాక్స్ కోసమే వెదుకుతుంటాయి. ఇది కాకుండా, స్థిరంగా డివిడెండ్ చెల్లించే కంపెనీల స్టాక్స్‌ను ఎంచుకోండి. ఎందుకంటే, క్రమం తప్పకుండా డివిడెండ్ చెల్లించే కంపెనీలు ఆర్థికంగా స్థిరంగా ఉంటాయి.
టెక్నికల్, ఫండమెంటల్స్‌పై శ్రద్ధ
ట్రేడింగ్ వాల్యూమ్, 50-డేస్ & 200-డేస్ వంటి మూవింగ్ యావరేజ్‌లు, ప్రైస్ ట్రెండ్స్ వంటి టెక్నికల్ ఇండికేటర్లను విశ్లేషించండి. ఫండమెంటల్స్ విషయానికి వస్తే... ఆ కంపెనీ ఉన్న రంగం వృద్ధి, దేశ ఆర్థిక వృద్ధి లేదా మాంద్యం వంటి స్థూల ఆర్థిక విషయాలను పరిగణనలోకి తీసుకోండి. అధిక అప్పు, తగ్గుతున్న లాభాలు లేదా అస్థిర మార్కెట్‌లో అల్లాడిపోయే స్టాక్స్‌కు దూరంగా ఉండండి. కంపెనీ యాజమాన్య విధానాలు, నిర్వహణ సామర్థ్యాన్ని తెలుసుకోండి. బలమైన యాజమాన్యం, అనుభవజ్ఞులైన నాయకత్వం మంచి సంకేతాలు అవుతాయి.
గ్రోత్ స్టాక్స్ - ఇతర స్టాక్స్ మధ్య తేడా ఏమిటి?
గ్రోత్ స్టాక్స్ మట్టిలో మాణిక్యాల వంటివి. వీటిలో ఇన్వెస్ట్ చేయడంలో దాదాపుగా రిస్క్ ఉండదు, మార్కెట్ ఒడుదొడుకులకు లోనైనప్పటికీ, దీర్ఘకాలంలో అప్‌ట్రెండ్‌లో మూవ్ అవుతాయి. ఇతర స్టాక్స్‌లో అధిక రిస్క్ ఉంటుంది, మార్కెట్ హెచ్చుతగ్గులకు త్వరగా ప్రభావితం అవుతాయి. ఈ స్టాక్స్ దీర్ఘకాలంలోనూ రికవర్ కాలేకపోవచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. "abp దేశం" ఎవరికీ, ఎప్పుడూ పెట్టుబడి సలహాలు ఇవ్వదు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.
ITR filing: ఐటీఆర్ ఫైల్ చేసినవాళ్లు 9 కోట్ల మంది - కోటీశ్వరుల సంఖ్య తెలిస్తే ఆశ్చర్యపోతారు
TDS New Rules: ఏప్రిల్ నుంచి కొత్త టీడీఎస్ రూల్స్, తగ్గనున్న పన్నుల మోత - ఏ విషయాలు మారతాయి?
Gold-Silver Prices Today 20 Mar: 10 గ్రాములు కొనేందుకు 1000 సార్లు ఆలోచించాలి- ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
UPI Payments: యూపీఐలో 'పేమెంట్ రిక్వెస్ట్' పద్ధతికి చెల్లుచీటీ! - ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట
Home Loan Refinancing: EMIల భారం తగ్గించి లక్షలు మిగిల్చే 'హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్' - మీరూ ట్రై చేయొచ్చు
Betting Apps Case Scam: ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
Bihar Crime News: నీళ్ల కోసం కేంద్రమంత్రి ఇంట్లో రక్తపాతం- ఒక మేనల్లుడు మృతి, మరొకరి పరిస్థితి విషమం
Andhra Pradesh News: సంతకాలు పెడుతున్నారు సభకు రావడం లేదు- వైసీపీ నేతల తీరుపై అయ్యన్న అసహనం
Betting App Cases:రానా, విజయ్‌దేవరకొండ, మంచులక్ష్మి, ప్రకాశ్ రాజ్ సహా 25 మందిపై బెట్టింగ్ యాప్స్ కేసులు