అన్వేషించండి
Robinhood Pre Release Event Photos: డేవిడ్ వార్నర్ వస్తే మినిమమ్ ఆ మాత్రం ఉంటుంది మరి... 'రాబిన్‌హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోస్
Robinhood Trailer Launch Photos: నితిన్ 'రాబిన్ హుడ్'లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయన గెస్టుగా వచ్చారు. ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ఫోటోస్ చూడండి.

'రాబిన్‌హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోస్
1/8

David Warner at Nithiin and Sreeleela's Robinhood pre release event: నితిన్, శ్రీ లీల జంటగా నటించిన 'రాబిన్ హుడ్' సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ చేశారు. ఆ సంగతి అందరికీ తెలుసు. హైదరాబాద్ సిటీలో ఆదివారం రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేవిడ్ వార్నర్ గెస్టుగా వచ్చారు. ఆ ఈవెంట్ ఫోటోలు చూడండి. (Image Courtesy: MythriOfficial / x.com)
2/8

'భీష్మ' తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటించిన సినిమా 'రాబిన్ హుడ్'. రీసెంట్ ప్రమోషన్లలో వెంకీ నటనకు ఆస్కార్ వస్తుందని నితిన్ సరదాగా వ్యాఖ్యానించారు. (Image Courtesy: MythriOfficial / x.com)
3/8

పదిహేనేళ్లుగా తన మీద తెలుగు ప్రజలు చూపిస్తున్న ప్రేమ, అభిమానులకు థాంక్స్ చెప్పారు డేవిడ్ వార్నర్. (Image Courtesy: MythriOfficial / x.com)
4/8

'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' తర్వాత నితిన్, శ్రీ లీల జంటగా నటించిన చిత్రమిది. తొలుత ఈ సినిమాలో రష్మిక నటించాల్సి ఉంది. డేట్స్ కారణంగా ఆవిడ తప్పుకోగా శ్రీలీల వచ్చారు. చివరి నిమిషంలో సినిమాలోకి వచ్చినా చాలా బాగా వచ్చిన సినిమా అని ఆవిడ చెప్పారు. (Image Courtesy: MythriOfficial / x.com)
5/8

నితిన్, శ్రీలీలతో పాటు దర్శకుడు వెంకీ కుడుముల, డేవిడ్ వార్నర్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు. (Image Courtesy: MythriOfficial / x.com)
6/8

'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన ఏవీ చూసి నితిన్ ఎమోషనల్ అయ్యారు. (Image Courtesy: MythriOfficial / x.com)
7/8

నితిన్ బాస్ అని, అవకాశం ఇస్తే మరొక సినిమాలో నటిస్తానని డేవిడ్ వార్నర్ చెప్పారు. అప్పుడు నితిన్ డేవిడ్ ని బిగ్ బాస్ అని అన్నారు. (Image Courtesy: MythriOfficial / x.com)
8/8

మార్చి 28న 'రాబిన్ హుడ్' సినిమా థియేటర్లోకి వస్తోంది. (Image Courtesy: MythriOfficial / x.com)
Published at : 23 Mar 2025 11:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion