SRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP Desam
లాస్ట్ ఇయర్ ఏదో మిస్సైంది కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని కసి మీదున్న కాటేరమ్మ కొడుకులు ఫస్ట్ మ్యాచ్ లోనే విశ్వరూపం చూపించారు. బట్లర్ లేక..శాంసన్ గ్రౌండ్ లో ఉండక బలహీన పడిపోయినట్లు కనిపించిన రాజస్థాన్ రాయల్స్ ను తనివితీరా బాదింది ఆరెంజ్ ఆర్మీ. దెబ్బకు ఉప్పల్ లో హయ్యెస్ట్ రన్స్ స్కోర్ రికార్డును తనే బ్రేక్ చేసుకోవటంతో పాటు ఫస్ట్ మ్యాచ్ లో విక్టరీతో టోర్నీని కాన్ఫిడెంట్ గా ప్రారంభించింది సన్ రైజర్స్. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. ఈడ్చి కొట్టిన ఇషాన్ కిషన్
టాస్ ఓడి బ్యాటింగ్ అప్పగించిన రాజస్థాన్ ను పశ్చాత్తాప పడేలా ఈడ్చి కొట్టాడు ఇషాన్ కిషన్. అభిషేక్ శర్మ అవుటయ్యాక క్రీజులో అడుగుపెట్టి హెడ్ తోడుగా పింక్ ఆర్మీని పూనకాలొచ్చినట్లు బాదాడు. 47 బాల్స్ లో 11 ఫోర్లు 6 సిక్సర్లతో 106 పరుగులు చేసి నాటౌట్ గా నిలవటంతో పాటు సన్ రైజర్స్ 286 పరుగులు చేసేలా చేసి తన పేరు మీదే ఉప్పల్ లో ఉన్న 277 పరుగుల హయ్యెస్ట్ టీమ్ స్కోర్ రికార్డును బ్రేక్ చేసేలా చేయటంతో పాటు టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
2. హెడ్ మాస్టర్ ట్రావియెస్ హెడ్
ఓ వైపు ఇషాన్ కిషన్ విరుచుకుపడతుంటే మరో వైపు తను కూడా ఓ చేయి వేసి ఆర్ ఆర్ బౌలర్లకు పీడకల మిగిల్చాడు ట్రావియెస్ హెడ్. 31 బాల్స్ లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 67 పరుగులు చేసి ఆరెంజ్ ఆర్మీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు హెడ్.
3. బ్యాటర్లంతా 200+ - బౌలర్లంతా 50+
సన్ రైజర్స్ బ్యాటింగ్ రికార్డ్స్ USP నే ఇది. ఏ బ్యాటర్ కూడా బంతులను వేస్ట్ చేయడు. వచ్చామా బాదామా వెళ్లామా అన్నట్లు కొడుతూనే ఉంటారు. ఇవాళ్టి మ్యాచ్ నే చూడండి. ఓపెనర్ అభిషేక్ శర్మ తో మొదలు పెడితే హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ అందరూ 200లకు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశారు. అదే స్కోరు బోర్డు మీద అంత భారీ పరుగులను సన్ రైజర్స్ పెట్టేలా చేసింది. పనిలో పనిగా ఆర్ ఆర్ బౌలర్లను 4 ఓవర్లలో 50 పరుగులు సమర్పించుకునేలా చేశారు. ఆర్చర్ అయితే ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు.
4. సంజూ ధృవ్ జురేల్ పోరాటం
కళ్ల ముందు 287 పరుగుల టార్గెట్ అంటే..ఆ స్కోరు కొడితే ఐపీఎల్ హయ్యెస్ట్ టీమ్ స్కోరు రికార్డు కూడా బద్ధలు కొట్టాలి. మరి అంతటి టఫ్ టార్గెట్ ఉన్నప్పుడు ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 1పరుగుకే అవుటైపోయాడు. కెప్టెన్ పరాగ్ 4, నితీశ్ రానా 11 పరుగులే చేశారు. ఇలాంటి టైమ్ లో సంజూతో కలిసిన ధృవ్ జురేల్ బీభత్సంగా పోరాటం చేశాడు. 35 బాల్స్ లోనే 5ఫోర్లు, 6 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు జురేల్. తనకు సపోర్ట్ గా సంజూ 37 బాల్స్ లోనే 7ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేసి లక్ష్యం పైన ఆశలు కల్పించారు. నాలుగో వికెట్ కు 111 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పినా ఒక్క పరుగు తేడాతో ఇద్దరి వికెట్లు కోల్పోవటంతో RR కథ సగం ముగిసిపోయింది.
5. హెట్మెయర్, శుభం దూబే ధనా ధన్
సంజూ, ధృవ్ అయిపోయినా హెట్మెయిర్, శుభం దూబే పోరాటం ఆపలేదు. కొట్టాల్సిన లక్ష్యం చాలా ఉన్నా మెరుపులు మెరిపించారు. హెట్మెయర్ 42పరుగులు చేయగా...శుభం దూబే 11 బాల్స్ లోనే 34పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. లక్ష్యం చాలా పెద్దదైనా బాగానే పోరాడిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 242 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్ రైజర్స్ కు 44 పరుగుల విక్టరీని అందించింది.





















