Shashank Singh on Shreyas Iyer 97 Runs | GT vs PBKS మ్యాచ్ లో అయ్యర్ బ్యాటింగ్ పై శశాంక్ ప్రశంసలు
సెంచరీలు ఎవరైనా చేస్తారు కానీ టీమ్ కోసం తన సెంచరీ అయినా వదులుకోవటానికి సిద్ధపడతారు చూడు వాళ్లే సిసలైన క్రికెటర్స్ అంటున్నాడు పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్. ఈ మాటలు అతను అన్నది వాళ్ల టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురించి. గతేడాది కోల్ కతా నైట్ రైడర్స్ ను ఐపీఎల్ విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఈ ఏడాదికి పంజాబ్ కింగ్స్ కు మారాడు. అతనిపై నమ్మకంతో జట్టు యాజమాన్యం కెప్టెన్ గానూ బాధ్యతలు అప్పగించింది. అలాంటి అయ్యర్ తన ఫస్ట్ మ్యాచ్ లోనే మాస్ చూపించాడు. తొలుత ప్రియాంశ్ ఆర్యతో చివర్లో స్టాయినిస్, శశాంక్ సింగ్ లతో కలిసి విధ్వంసం సృష్టించాడు. అయ్యర్ 19వ ఓవర్ లోనే 97పరుగులకు చేరుకున్నాడు. అవతలి ఎండ్ లో శశాంక్ సింగ్ ఉన్నాడు. హార్డ్ హిట్టర్ గా పంజాబ్ కు గతేడాది ఎన్నో విజయాలు అందించిన శశాంక్ సింగ్ పై నమ్మకం ఉంచిన అయ్యర్ తననే బ్యాటింగ్ ఆడనిచ్చాడు. ఈ మధ్యలో శశాంక్ అయ్యర్ దగ్గరకు వెళ్లి నెక్ట్స్ బాల్ సింగిల్ తీసి ఇస్తా..సెంచరీ ఫినిష్ చేయ్ అన్నాడట. దానికి బదులుగా అయ్యర్ తొక్కలో సెంచరీ రేపైనా చేస్తా. ముందు నీకు దొరికిన బ్రతీ బంతినీ చావబాదు. ఏ బాల్ కూడా సింగిల్ తీయాలని ట్రై చేయకు అన్నాడట. కెప్టెన్ అయ్యిండి..కళ్ల ముందు ఐపీఎల్ లో అరుదుగా సెంచరీ సాధించే అవకాశం ఉన్నా...అప్పటికే 97పరుగులు చేసేసినా తనను స్ట్రైక్ అడగకుండా ప్రతీ బంతినీ కొట్టమన్న అయ్యర్ నిస్వార్థానికి, అతని ఆలోచనా పరిణితికి ముగ్ధడైపోయాడంట శశాంక్ సింగ్. అయ్యర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో సిరాజ్ వేసిన చివర్లో 5ఫోర్లు, ఓ డబుల్ తో 22 పరుగులు రాబట్టాడు శశాంక్. ఫలితంగా గుజరాత్ ముందు 244 పరుగుల భారీ టార్గెట్ పెట్టడంతో పాటు మ్యాచ్ ను జస్ట్ 11 పరుగుల తేడాతో గెలుచుకుంది పంజాబ్. అయ్యర్ సెంచరీ కోసం చూసుకుని ఉంటే రెండు మూడు బంతులు వేస్ట్ అయ్యి ఉండేవి..అయ్యర్ కి సెంచరీ వచ్చి ఉండేదేమో కానీ ఆ 10-11 పరుగుల గెలుపు ఓటమికి తేడా అయ్యిండేవి అంటున్నాడు శశాంక్ సింగ్. ఎంతైనా అయ్యర్ ఆలోచనా తీరుకు సెల్ఫ్ లెస్ బ్యాటింగ్ కి అయితే సోషల్ మీడియాలో విపరీతమైన అప్లాజ్ వస్తోంది





















