Mohammed Shami Latest News:ఉపాధి హామీ పథకంలో కూలీ డబ్బులు తీసుకుంటున్న క్రికెటర్ షమీ సోదరి, బావ
Mohammed Shami Latest News: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉపాధి హామీ కూలీ పథకంలో చేరిన మహమ్మద్ షమీ సోదరి, బావ. లక్ష రూపాయలకు పైగానే ఖాతాల్లో చేరినట్టు తేలింది.

Mohammed Shami Latest News: పేదలను ఉద్దేశించి తీసుకొచ్చే ప్రభుత్వ పథకాలు పక్కదారి పడుతున్నాయి. ఎన్ని విధాలుగా ఫిల్టర్స్ వేస్తున్నా అనర్హులకు పథకాలు చేరుతూనే ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘటన ఇందుకు సాక్ష్యాంగా నిలించింది. పేదలకు ఉపాధి భరోసా ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకంలో ప్రముఖ క్రికెటర్ మహమ్మద్ షమీ సోదరి పేరు చేరింది. ఇదేదో పొరపాటును చేరలేదు. ఆమె అత్తగారు గ్రామ పెద్దకావడంతో ఇలా జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన ఫ్యామిలీలో ముగ్గురు పేర్లను ఈ జాబితాలో చేర్చారామె.
ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ ఘటన వైరల్ అవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని జోయా బ్లాక్‌లోని పలోలా గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీల జాబితాలో క్రికెటర్ మహమ్మద్ షమీ సోదరిషబీనా, ఆమె భర్త ఘజ్నవి పేరు ఉండటం వైరల్ అవుతోంది. నిరు పేదలకు ఉపాధి కల్పించేందుకు అమలు చేసే MGNREGA పథకంలో వీళ్లిద్దరు పని చేసి డబ్బులు కూడా తీసుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ABP న్యూస్ సేకరించిన పత్రాల ప్రకారం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీ పథకం కార్మికురాలిగా షబీనా పేరు ఉంది. ఆమె 2021 నుంచి 2024 వరకు నిరంతరంగా పనులు చేసి కూలీ డబ్బులు తీసుకున్నట్టు తేలింది. ఆమెతోపాటు ఆమె భర్త పేరు కూడా లిస్ట్‌లో ఉంది. షబీనా అత్త గులే ఐషా గ్రామాధికారి అయినందునే అక్రమాలు జరిగాయని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
MNREGA పథకం కింద ఆ ఊరిలో 657 మందికి జాబ్ కార్డులు ఇచ్చారు. అందులో 473 నంబర్‌లో షబీనా పేరు చేర్చారు. ఆమె బ్యాంకు ఖాతాలోకి దాదాపు 70 వేల రూపాయలు వచ్చాయి. షబీనా భర్త ఘజ్నవి పేరు ఉండటంతో దాదాపు 66 వేల రూపాయలు ఆయన ఖాతాలోకి వచ్చి చేరాయి.
షబీనా వదిన నేహా పేరు కూడా ఈలిస్ట్‌లో ఉంది. నేహా 2019లో వివాహం చేసుకున్న తర్వాత, ఆమె తన అత్తమామల ఇంట్లో ఉంటోంది. ఆమె పేరు మీద కూడా MNREGA లేబర్ కార్డ్ తీసుకున్నారు. గ్రామంలో ఉండే బడా కాంట్రాక్టర్ జుల్ఫికర్ పేరు కూడా ఈ లిస్ట్‌లో ఉంది. అతనికి అదే గ్రామంలో రెండంతస్తుల ఇల్లు ఉంది.
మొన్నీ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో షమి తల్లీ, అతని సోదరి గ్రౌండ్‌లో కనిపించారు. భారత్ విజయం తర్వాత వాళ్లంతా వచ్చి సంబరాల్లో పాల్గొన్నారు. విజయం సాధించిన జట్టుకు శుభాకాంక్షలు చెప్పారు. టీమ్ సభ్యులు కూడా వాళ్లతో మాట్లాడారు. షమీ తల్లికి విరాట్ కోహ్లీ పాదాభివందనం చేశఆరు. షమీ, ఆయన కుటుంబంతో కోహ్లీ ఫోటోలు కూడా దిగారు.
2023 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత షమీ ఆటకు ఏడాదిపాటు దూరమయ్యాడు. మోచేయి గాయం కారణంగా చికిత్స తీసుకున్నాడు. జనవరిలో జరిగిన భారత్-ఇంగ్లాండ్ T20I సిరీస్‌లో మళ్లీ ఆడటం మొదలు పెట్టాడు. దుబాయ్‌లో జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చోటు దక్కించుకున్నాడు. అక్కడ అద్భుతంగా రాణించాడు. ఐదు మ్యాచ్‌లలో 9 వికెట్లు తీసి భఆరత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

