అన్వేషించండి

Ghiblify: ChatGPT మాయ.. AI ఇమేజెస్​ను ఇప్పుడు ఫ్రీగా చేసుకోవచ్చు

ChatGPT ఫ్రీ-టైర్ వినియోగదారులకు శుభవార్త. ఇప్పటివరకు సబ్‌స్క్రిప్షన్​ ద్వారా జనరేట్​ చేసుకునే AI ఇమేజెస్​ను ఇప్పుడు ఫ్రీగా చేసుకునే వెసులుబాటు కల్పించింది.

ChatGPT ఫ్రీ-టైర్ వినియోగదారులకు శుభవార్త. ఇప్పటివరకు సబ్‌స్క్రిప్షన్​ ద్వారా జనరేట్​ చేసుకునే AI ఇమేజెస్​ను ఇప్పుడు ఫ్రీగా చేసుకునే వెసులుబాటు కల్పించింది. AI ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను  మొదట తమ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందించిన సంస్థ.. ఇప్పుడు ఫ్రీ టైర్​ వినియోగదారులకు కూడా అందిస్తోంది. అయితే ఒక్క కండీషన్​ పెట్టింది. భారీ డిమాండ్ నేపథ్యంలో ఉచిత వినియోగదారులు రోజులు కేవలం మూడు ఇమేజ్​లు మాత్రమే  జనరేట్​ చేసుకునే పరిమితిని విధించింది.

అయితే దీనిపై OpenAI ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. పలు ఫ్రీ ChatGPT ఖాతాల్లో గిబ్లి శైలి ఫొటోలు సక్సెస్​ఫుల్​గా రూపొందుతున్నాయి. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్లస్, ప్రో, టీమ్ యూజర్లకు OpenAI ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 
ఆ తర్వాత సోషల్ మీడియా స్టూడియో గిబ్లి క్లాసిక్ యానిమేటెడ్​ చిత్రాల సిగ్నేచర్​ను అనుకరిస్తూ అద్భుతమైన AI-జనరేటెడ్ ఫొటోలను రూపొందించింది. ప్రస్తుతం వినియోగదారులు తమ రియల్​ లైఫ్​ ఫొటోలను ఏఐ సాయంతో గిబ్లిఫై చేసుకొని వాటిని చూసి మురిసిపోతున్నారు.

ఇప్పటి వరకు, ఫ్రీ-టైర్ వినియోగదారులు ఇలాంటి కళాకృతులను సృష్టించడానికి xAI  గ్రోక్ లేదా గూగుల్ జెమిని వంటి ప్రత్యామ్నాయ AI సాధనాలపై ఆధారపడేవారు. అయితే వీటి నాణ్యత OpenAI అధునాతన మోడల్ కంటే తక్కువగా ఉంటుంది.  OpenAI మరింత వివరణాత్మక, ఎక్స్​ప్రెసివ్​ ఫొటోలను అందిస్తుండడంతో ఔత్సాహికులు దీనిపై మొగ్గు చూపుతున్నారు. ఈ ఫీచర్ ఇప్పుడు క్రమంగా ఉచిత వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. పరిమితులు ఉన్నప్పటికీ.. ఎక్కువ మంది AI-జనరేటెడ్ ఆర్ట్‌తో ప్రయోగాలు చేయడానికి వీలుగా అవకాశం కల్పిస్తోంది.

ChatGPTలో ఘిబ్లి-స్టైల్ AI చిత్రాలను ఇలా క్రియేట్ చేసుకోండి..

* ChatGPT వెబ్‌సైట్‌ లేదా యాప్‌ను ఓపెన్​ చేయండి

* మీ ఫొటోను అప్‌లోడ్ చేసేందుకు కింద లెఫ్ట్​ సైడ్​లో ఉన్న ‘+’ గుర్తుపై క్లిక్ చేయండి.

* ‘Ghiblify this’ లేదా ‘Turn this image into a Studio Ghibli theme’ లాంటి ప్రాంప్ట్‌ను టైప్ చేయండి.

* అంటే ChatGPT మీ యానిమేటెడ్​ ప్రేరేపిత చిత్రాన్ని రూపొందిస్తుంది. దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
 IPL 2025 KKR VS CSK Result Update: సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs KKR Match Highlights IPL 2025 | చెన్నై పై 8వికెట్ల తేడాతో కేకేఆర్ గ్రాండ్ విక్టరీ | ABP DesamCSK vs KKR Match Preview IPL 2025 | KKR తో మ్యాచ్ నుంచి CSK కెప్టెన్ గా ధోని | ABP DesamRCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
 IPL 2025 KKR VS CSK Result Update: సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
AP Intermediate Results 2025: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
Vontimitta SeetharRama Kalyanam: ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
Fact Check :తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దు : రైల్వే క్లారిటీ
తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దు : రైల్వే క్లారిటీ
TG TET Schdule: తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
Embed widget