Hyderabad Metro Latest Timings: మారిన హైదరాబాద్ మెట్రో టైమింగ్స్- ఏప్రిల్ 1 నుంచి అమలు!
Hyderabad Metro Latest Timings: హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్చేసింది. ఆఖరి మెట్రో ఇకపై 11.45 నిమిషాలకు బయల్దేరనుంది. ఫస్ట్ ట్రైన్ ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది.

Hyderabad Metro Latest Timings: హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆఖరి ట్రైన్ టైమింగ్స్ మార్చేశారు. ఇప్పటి వరకు ఆఖరి ట్రైన్ రాత్రి 11 గంటలకు చివరి టెర్మినల్స్ నుంచి బయల్దేరేవి. ఇప్పుడు మారిన టైమింగ్స్‌తో ఆఖరి ట్రైన్ 11.45 నిమిషాలకు బయల్దేరనుంది.
మారిన మెట్రో టైమింగ్స్ ఏప్రిల్ 1నుంచి అమలులోకి రానున్నాయి. హైదరాబాద్ మెట్రోకు రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. మొదట్లో అటుగా వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపని ప్రజలు క్రమంగా మెట్రోపై ఆధారపడుతున్నారు. ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా ప్రశాంతంగా గమ్యస్థానాలకు వెళ్లేందుకు మెట్రోయే ప్రధాన రవాణా సర్వీస్ అవుతోంది.
లేట్ నైట్‌లో ట్రైన్స్ నడపాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నప్పటికీ అక్యుపెన్సీ వస్తుందా రాదా అనే ఆలోచనతో ఆలస్యం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆఖరిగా బయల్దేరే ట్రైన్‌కు మంచి డిమాండ్ ఉన్నట్టు గ్రహించిన మెట్రో ట్రైన్ ఇప్పుడు టైం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ టైమింగ్స్ సోమవారం నుంచి శుక్రవారం వరకే రాత్రి 11.45 నిమిషాలకు ఆఖరి ట్రైన్ బయల్దేరుతుంది. మిగతా రెండు రోజులు మాత్రం రాత్రి 11 గంటలకు ఆఖరి ట్రైన్ ఉంటుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం ఆరు గంటలకు మొదటి ట్రైన్ ఉంటే... ఆదివారం, శనివారం మాత్రం ఉదయం ఏడు గంటలకు ఫస్ట్ ట్రైన్ బయల్దేరుతుంది.





















