అన్వేషించండి

Revanth Reddy: 2029లో మళ్లీ తొక్కకపోతే చూడు! అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌కు రేవంత్ రెడ్డి సవాల్!

గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నెత్తిన కాలు పెట్టి తొక్కి అధికారంలోకి వచ్చానని 2029లో కూడా మళ్లూ చూసుకుందామని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మళ్లీ తొక్కకపోతే చూడండి అంటూ బీఆర్‌ఎస్‌కు వార్నింగ్ ఇచ్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రేవంత్ రెడ్డి 2029 ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడిస్తానని సవాల్ చేశారు.
  • ప్రతిపక్ష నేత కేసీఆర్‌ అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకోవడంపై విమర్శించారు.
  • 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు.
  • 80 వేలకు పైగా ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశామని వివరించారు.

Revanth Reddy: తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ సమరశంఖం పూరించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు. 2029 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని రాజకీయంగా తొక్కబోతున్నానని సవాల్ చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి రాజకీయ హెచ్చరికలు, అభివృద్ధి విజన్, గత ప్రభుత్వ వైఫల్యాల చిట్టాను సభ ముందు ఉంచారు. 

నెత్తిపై కాలు పెట్టి తొక్కే వచ్చాను, 2029లో తొక్కబోతున్నాను: రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పొలిటికల్ హిస్టరీని గుర్తు చేసుకున్నారు. తాను వారసత్వంగానో లేదా ఎవరో పెట్టిన భిక్షతోనే ముఖ్యమంత్రి స్థాయికి రాలేదని అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నెత్తిన కాలు పెట్టి తొక్కి అధికారంలోకి వచ్చానని 2029లో కూడా మళ్లూ చూసుకుందామని సవాల్ చేశారు. మళ్లీ తొక్కకపోతే చూడండి అంటూ బీఆర్‌ఎస్‌కు సవాల్ చేశారు. 

"సభకు రాకపోవడంపై చర్చ జరగాలి"

ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గత 15 నెలలుగా సభకు రాకుండానే కేసీఆర్ రూ. 1.06 కోట్ల జీతభత్యాలు తీసుకున్నారని, దీనిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. "తండ్రి బతికి ఉండగానే తద్దినం పెట్టడం అంటే కేటీఆర్, హరీష్ రావుల తీరును చూస్తే అర్థమవుతోంది" ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడానికి  వీళ్లే ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికైనా కేసీఆర్ సభకు వచ్చి సలహాలు ఇవ్వాలని కోరారు. 

ముఖ్యమంత్రి విజన్ ఇదే 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. రాష్ట్ర భవిష్యత్తుపై ఉన్న స్పష్టమైన విజన్‌ను సభకు వివరించారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్లు,  2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే పాలన సాగిస్తున్నట్టు వెల్లడించారు. అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగం అక్షరాలు కావని అది తెలంగాణ అభివృద్ధికి దిక్సూచి అని కొనియాడారు. 

పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన 2014లో కేవలం రూ. 69 వేల కోట్లు అప్పులు ఉండేవని తాము అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబర్ నాటికి రూ. 6,71,757 కోట్లకు చేరిందని గుర్తు చేశారు. మిగతా బకాయిలు కలుపుకుంటే ఆ మొత్తం రూ. 8.11 లక్షల కోట్లు అయ్యిందని, ఆ భారాన్ని తమ ప్రభుత్వం మోస్తోందని వివరించారు

అప్పులపై వివరణ 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చన తర్వాత కేవలం 17 వేల కోట్ల రూపాయల నికర అప్పు మాత్రమే చేశామని వెల్లడించారు. గత అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ఎక్కువ ఖర్చు అవుతుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హెల్ప్‌తో వడ్డీ భారాన్ని తగ్గించుకున్నామని పేర్కొన్నారు. దీనికి కేంద్రానికి కూడా రేవంత్ రెడ్డి థాంక్స్ చెప్పారు.  

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేశామని రేవంత్ వివరించారు. ఎలాంటి లీకేజీలు, ఇతర ఇబ్బందులు లేకుండా 80 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు. గత పాలకులు లీకేజీలతో ప్రభుత్వ వ్యవస్థలపైనే అపనమ్మకాన్ని కలిగించారని మండిపడ్డారు.  

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత , మూసీ పునరుజ్జీవనంపై ప్రతిపక్షాల విమర్శలను రేవంత్ రెడ్డి డైరెక్ట్‌గా ఎటాక్ చేశారు. హైదరాబాద్‌లో ఉన్న అక్రమ కట్టడాలు కూల్చి వేయాలని గతంలో కేసీఆర్, కేటీఆర్ మాట్లాడిన వీడియోలను సభలో చూపించారు. వాళ్లు చేస్తే సక్రమం తాము చేస్తే అక్రమమా అని ప్రశ్నించారు. మూసీ కాలుష్యం కంటే కొందరి కడుపుల్లోనే విషయం ఎక్కువ ఉందని ఎద్దేవా చేశారు. సబర్మతీ నదీ ప్రక్షాళనను పరిశీలించడానికి ఎమ్మెల్యేలతో నిజనిర్దారణ కమిటీ వేస్తామని రేవంత్ ప్రకటించారు.  

హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో శంషాబాద్ విమానాశ్రయం దగ్గర్లో 500-600 ఎకరాల్లో బుల్లెట్ రైలు హబ్ ఏర్పాటు చేయబోతున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది ఏర్పాటు అయితే బెంగళూరు, చెన్నై, పుణె వంటి నగరాలకు 2-3 గంటల్లోనే చేరుకోవచ్చని చెప్పారు. రూ. 25 వేల కోట్ల మెట్రో విస్తరణ పనులను రూ. 15 వేల కోట్లకే పూర్తి చేసేలా ప్లాన్‌ రెడీ చేసినట్టు తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి ఏప్రిల్ తర్వాత అనుమతులు వస్తాయన్నారు. కొంగరకలాన్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టడానికి నిర్ణయించినట్లు వెల్లడించారు.

Frequently Asked Questions

2029 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు?

2029 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని రాజకీయంగా తొక్కబోతున్నానని, గతంలో నెత్తిన కాలు పెట్టి తొక్కి అధికారంలోకి వచ్చానని సవాల్ చేశారు.

ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై ముఖ్యమంత్రి ఏమన్నారు?

గత 15 నెలలుగా సభకు రాకుండానే కేసీఆర్ రూ. 1.06 కోట్ల జీతభత్యాలు తీసుకున్నారని, దీనిపై చర్చ జరగాలని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.

రాష్ట్ర భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ ఏమిటి?

2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీసిందని ముఖ్యమంత్రి ఆరోపించారు?

2014లో రూ. 69 వేల కోట్లు ఉన్న అప్పులు, 2023 డిసెంబర్ నాటికి రూ. 6,71,757 కోట్లకు పెరిగాయని, ఇది ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు.

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతపై ముఖ్యమంత్రి ఏమన్నారు?

గతంలో కేసీఆర్, కేటీఆర్ కూడా అక్రమ కట్టడాలను కూల్చివేయాలని మాట్లాడిన వీడియోలను చూపించి, వారు చేస్తే సక్రమం తాము చేస్తే అక్రమమా అని ప్రశ్నించారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget