Actor : మొదటి సినిమాకే నేషనల్ అవార్డు, 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న మహేష్ బాబు విలన్... ఇప్పుడు అవకాశాలు లేక యూట్యూబ్ వీడియోలు
Actor : మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమాతో విలన్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న ఓ సీనియర్ నటుడు 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు చేస్తూ జీవిస్తున్నాడు. ఆయన ఎవరంటే?

Actor Ashish Vidyarthi: సినిమా ఇండస్ట్రీలో నటీనటుల పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొంతమందికి అసలు అదృష్టమే కలిసి రాకపోతే, మరి కొంతమందికి గుర్తింపు రావడానికి ఏళ్ల తరబడి టైం పడుతుంది. తీరా ఆ గుర్తింపు వచ్చాక ఎక్కువ కాలం ఉండదు. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీతో విలన్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న ఓ సీనియర్ నటుడి పరిస్థితి కూడా ఇలాగే మారింది. మొదటి సినిమాతోనే నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఒకప్పటి ఈ మోస్ట్ వాంటెడ్ విలన్ ఇప్పుడు మాత్రం యూట్యూబ్ వీడియోలు చేస్తూ జీవిస్తున్నారు. పైగా 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. ఆ నటుడు ఎవరు గుర్తుపట్టారా? ఆయన మరెవరో కాదు ఆశిష్ విద్యార్థి.
పోకిరి సినిమాతో విలన్ గా గుర్తింపు
ఆశిష్ విద్యార్థి అనడం కన్నా 'పోకిరి' సినిమాలో క్రూరమైన పోలీస్ ఆఫీసర్ అంటేనే తెలుగు ప్రేక్షకులు బాగా గుర్తుపడతారు ఈ నటుడిని. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన 'పోకిరి' మూవీలో ఆయన ఇన్స్పెక్టర్ పశుపతి పాత్రలో నటించాడు. ఇలియానా పట్ల పశువులా ప్రవర్తించిన ఆయన నటన అప్పట్లో చాలామందికి కోపం తెప్పించింది. చివరికి హీరో ఇతనికి ఇచ్చే దమ్కీ చూసి, వీడికి ఇలాగే కావాలి అనుకునేలా నటించారు ఆశిష్. నటించారు అనడం కంటే ఆయన ఆ పాత్రలో జీవించారు అని చెప్పాలి. ఈ మూవీ తర్వాత ఆశిష్ విద్యార్థి వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు.
ఆయన 1965 జూన్ 19న ఢిల్లీలో జన్మించారు. తండ్రి కేరళలోని కన్నూర్ కు చెందిన వారు కాగా, తల్లి రాజస్థాన్ బెంగాలీ ఫ్యామిలీకి చెందినవారు. 1990లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో తన చదువును పూర్తి చేసిన ఆశిష్ 'సర్దార్' అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మూవీ కంటే ముందే ఆయన నటించిన మరో మూవీ 'ద్రోహ్ కాల్' రిలీజ్ అయింది. ఇక 1995లో ఈ మూవీ ఆయనకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును సంపాదించి పెట్టింది. అప్పటినుంచి నటుడిగా రాణిస్తున్న ఆశిష్ ఏకంగా 11 భాషల్లో 300 సినిమాలకు పైగా నటించారు. ఇప్పుడు మాత్రం అవకాశాలు తగ్గడంతో ఆయన మిలియన్ కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌ని నడుపుతున్నారు. అందులో ఆశిష్ ఫుడ్ వ్లాగ్స్ చేస్తుంటారు. ఒకానొక సందర్భంలో యూట్యూబ్ వీడియోలో ఆశిష్ మాట్లాడుతూ.. తనకు కష్ట సమయం వచ్చినప్పుడు లైఫ్ ఎండ్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని వివరించారు. కానీ చస్తే వచ్చేదేమీ లేదు కాబట్టి, బ్రతికి సాధించాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.
60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి
'పాపే నా ప్రాణం' అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆశిష్ విద్యార్థి ఆ తర్వాత శ్రీరామ్, విజయేంద్ర వర్మ, గుడుంబా శంకర్, ఛత్రపతి, పోకిరి, నరసింహుడు, రానా నాయుడు, రైటర్ పద్మభూషణ్ వంటి సినిమాల్లో నటించారు. 'పోకిరి' సినిమాలో ఈయన విలనిజంతోనే మహేష్ బాబు హీరోయిజం బాగా ఎలివేట్ అయిందని చెప్పాలి. 2001లో ఆశిష్ విద్యార్థి రాజోషి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఆర్ద్ అనే కొడుకు కూడా ఉన్నాడు. 2022లో ఆమెతో డివోర్స్ తీసుకొని, 2023లో 60 ఏళ్ల వయసులో ఆశిష్ రూపాలి బార్వా అనే ఫ్యాషన్ డిజైనర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి పెళ్లిపై దారుణంగా ట్రోలింగ్ కూడా నడిచింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

