IPL 2025 SRH VS DC Toss Update: సన్ రైజర్స్ బ్యాటింగ్, విజయంపై కన్నేసిన ఆరెంజ్ ఆర్మీ, సూపర్ టచ్ లో ఢిల్లీ
ఐపీఎల్లో ఆదివారం రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్, ఢిల్లీ మధ్య తలపడుతుండగా, రెండో మ్యాచ్ లో రాజస్థాన్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

IPL 2025 Sunrisers Hyderabad Updates: ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం డబుల్ హెడర్ లో భాగంగా వీసీఏ- వీడీసీఏ స్టేడియంలో తొలి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో విజయమే లక్ష్యంగా సన్ రైజర్స్ బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించిన సన్ కు.. రెండో మ్యాచ్ లో ఎదురుదెబ్బ తగిలింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 5 వికెట్లతో పరాజయం పాలైంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ తోజరిగిన మ్యాచ్ లో ఉత్కంఠ భరిత విజయం సాధించిన ఢిల్లీ మంచి జోష్ లో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ ను దక్కించుకోవాలని భావిస్తోంది.
2⃣ games, 2⃣ cities, 1⃣ action-packed day of cricket 🤩
— IndianPremierLeague (@IPL) March 30, 2025
Which contest are you most hyped for? 🤔#TATAIPL | #DCvSRH | #RRvCSK | @DelhiCapitals | @SunRisers | @rajasthanroyals | @ChennaiIPL pic.twitter.com/7hhaCpX1r0
ఇరు జట్లు చెరో మార్పు..
ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఒక మార్పు చేసింది. సిమర్జిత్ సింగ్ స్థానంలో జీషాన్ అన్సారీని జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్ లో భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని చిత్తు చేస్తామని సన్ కెప్టెన్ పాట్ కమిన్స్ పేర్కొన్నాడు. గతేడాది జరిగిన ప్రదర్శననే పునరావృతం చేస్తామని తెలిపాడు. ఇక ఈ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేస్తే అడ్వాంటేజీ ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఢిల్లీ జట్టులో కూడా ఒక మార్పు జరిగింది. సమీర్ రిజ్వీ స్థానంలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టులకి వచ్చాడు.
🚨 Toss 🚨@SunRisers won the toss and elected to bat first against @DelhiCapitals in Match 1⃣0⃣
— IndianPremierLeague (@IPL) March 30, 2025
Updates ▶️ https://t.co/L4vEDKyVsb#TATAIPL | #DCvSRH pic.twitter.com/VuIzoiYCjf
అడ్వాంటేజీ ఉంది..
ఇక తొలి మ్యాచ్ లో ఇక్కడి అనుభవం తనకు ఉపకరిస్తుందని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. తొలి మ్యాచ్ లో లక్నోపై గెలిచిన ఉత్సాహంతో ఈ మ్యాచ్ లోనూ సత్తా చాటుతామని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే, తాము కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేద్దామని భావించినట్లు తెలిపాడు. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేస్తే గెలుపు సొంతమవుతుందని, అయితే ఈసారి తమ ప్రత్యర్థి సన్ అని, చాలా ధైర్యంతో ఆడాల్సి అవసరముందని వ్యాఖ్యానించాడు. ఇక ఈ స్డేడియం బ్యాటింగ్ కు స్వర్గధామంగా ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్యాట్ పైకి బంతి బాగా వస్తుండటంతో భారీ స్కోర్లు సాధ్యమని పేర్కొంటున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ లో ఈజీగా 220+ పరుగుల మార్కును దాటుతుందని అంచనా.




















