Shreyas Iyer 97 Runs vs GT IPL 2025 | గుజరాత్ బౌలర్లను చెండాడిన శ్రేయస్ అయ్యర్ | GT vs PBKS | ABP
గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పరుగుల వరద పారించింది. గతేడాది కోల్ కతా నైట్ రైడర్స్ ను కెప్టెన్ గా విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ మారినా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టినా అదే విన్నింగ్ స్ట్రీక్ ను కొనసాగించాడు. టాస్ గెలిచినా బ్యాటింగ్ ను తమకే అప్పగించిన గుజరాత్ నిర్ణయం తప్పని తేలేలా అయ్యర్ అదరగొట్టేశాడు. తొలుత ప్రియాంశ్ ఆర్యతో కలిసి చివర్లో స్టాయినిస్, శశాంక్ సింగ్ తో కలిసి గుజరాత్ బౌలర్లను చీల్చి చెండాడాడు. 42 బాల్స్ లో 5 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 97పరుగులు చేశాడు. సెంచరీ చేసేవాడే మాట్లాడుకుంటే అయిపోయేది కూడా కానీ టీమ్ కోసం ఆలోచించాడు. నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉండిపోయి పవర్ ఫుల్ హిట్టింగ్ చేస్తున్న శశాంక్ సింగ్ కి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చి గో హెడ్ అన్నాడు అయ్యర్. శ్రేయస్ అయ్యర్ సెల్ఫ్ లెస్ బ్యాటింగ్ తోనే పంజాబ్ 243 పరుగుల భారీ స్కోరు చేసి గుజరాత్ ముందు 244పరుగుల భారీ టార్గెట్ పెట్టగలిగింది. లక్ష్య ఛేధనలో గుజరాత్ సైతం భీకరంగానే పోరాడిన అయ్యర్ సెంచరీ కోసం చూసుకోకుండా శశాంక్ ను కొట్టేయమని చెప్పి తీసుకున్న డెసిషనే నిస్సందేహంగా ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలిచేలా చేసింది. ఆ రకంగా అటు బ్యాటింగ్ తోనూ, ఇటు నిస్వార్థపు ఆలోచనతోనూ పంజాబ్ ను ముందుండి గెలిపించాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. 11పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించేలా చేసి ఐపీఎల్ టోర్నీ గెలుపుతో ప్రారంభించాడు.



















