Shreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP Desam
ఐపీఎల్ అంటేనే అంత అన్ ప్రెడిక్టబుల్ డెసిషన్స్ ఉంటాయి ఒక్కోసారి. దానికి చాలా రీజన్స్ ఉండి ఉంటాయి. చాలా ఈక్వేషన్స్ అండ్ బిజినెస్ ఆధారపడి ఉంటాయి కానీ అవుట్ కమ్ ఒక్కోసారి ఒక్కోలా వస్తుంది. రీసెంట్ ఎగ్జాంపుల్ అశుతోష్ శర్మ అండ్ శ్రేయస్ అయ్యారు. వీళ్లిద్దరినీ వదులుకుని వాళ్ల పాత టీమ్ ఓనర్స్ అయిన ప్రీతి జింతా, షారూఖ్ ఖాన్ ఎంత బాధపడి ఉంటారు. ఎందుకంటే టీమ్ మారిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ లోనే అంతటి విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడారు అశుతోష్ అండ్ అయ్యర్. అశుతోష్ శర్మ లాస్ట్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కి ఆడాడు. శశాంక్ సింగ్ తో కలిసి కొన్ని అద్భుతమైన నాక్స్ ఆడాడు అశుతోష్ శర్మ. ప్రధానంగా అశుతోష్ రఫ్పాడి గెలిపించిన ముంబై, సన్ రైజర్స్ మ్యాచ్ అయితే లాస్ట్ ఇయర్ హైలెట్ అసలు. అలాంటి ఆటగాడిని మొన్న ఆక్షన్ కి ముందు పంజాబ్ వదిలేసుకుంది. శశాంక్ ను అట్టిపెట్టుకుంది కానీ అశుతోష్ వదిలేయటం ఎంత తప్పో మొన్న ప్రీతిజింతా తెలుసుకుని ఉంటుంది. ఆక్షన్ లోకి వచ్చిన అశుతోష్ ను 3 కోట్లకే చీప్ గా కొట్టేశామంటూ మొన్నటి మ్యాచ్ లో LSG మీద 61పరుగులు చేసి మ్యాచ్ గెలిపించిన తర్వాత ఢిల్లీ కోచింగ్ స్టాఫ్ వేణుగోపాల్ రావు తెగ సంతోషం వ్యక్తం చేశాడు. అంతటి విధ్వంసకర ప్లేయర్ ను వదులుకుని పంజాబ్ చాలా తప్పు చేసిందని చాలా మంది పోస్టులు పెట్టారు సోషల్ మీడియాలో. నిన్న అయ్యర్ కూడా అంతే. గతేడాది కెప్టెన్ గా ఐపీఎల్ ట్రోఫీనే అందించిన అయ్యర్ ను అవసరం లేదు పొమ్మని సాగనంపింది కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు. ఆక్షన్ లో అయ్యర్ ను పంజాబ్ కొనుక్కుని కెప్టెన్సీ కూడా ఇచ్చింది. మెరుపు వేగంతో 9 సిక్సర్లు బాది 97పరుగులు చేసిన అయ్యర్ పంజాబ్ ముందుండి నడిపించాడు గెలిపించాడు. మరి కప్పు తెచ్చి పెట్టిన అయ్యర్ ను వదులుకుని షారూఖ్ ఖాన్ కూడా ఫీలవుతున్నారా. సినిమాల్లో షారూఖ్, ప్రీతిజింతా హిట్ పెయిర్. కానీ క్రికెట్ జట్టు ఓనర్లుగా ఆ ఇద్దరూ విడివిడిగా తీసుకున్న నిర్ణయాలు రెండు తప్పవటం..అవి తప్పని మొదటి మ్యాచ్ లోనే ఆ బ్యాటర్లు పూర్తి చేయటం చూస్తుంటే కత్తి లాంటి ఆటగాళ్లను వదిలేసుకుని నిజంగానే ప్రీతి జింతా షారూఖ్ ఖాన్ దిల్ సే ఏడుస్తున్నారేమో.





















