Andhra Pradesh Weather: ఏపీలో 22 జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు- ఆదివారం తీవ్ర వడగాల్పులు
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 22 జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆదివారం ఇంతకు మించిన ఉక్కపోత ఉంటుందని హెచ్చరిస్తున్నారు అధికారులు

Andhra Pradesh Weather: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. శనివారం నాడు ఏకంగా 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం నాడు చాలా చోట్ల తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
ఇవేం ఎండలు బాబోయ్ !
ఆదివారం (30-03-25) అల్లూరి సీతరామరాజు చింతూరు మండలంలో తీవ్రవడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శనివారం 22 జిల్లాల్లో 40°Cకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు మొత్తం 126 అవి శ్రీకాకుళం జిల్లా -20, విజయనగరం జిల్లా-23, పార్వతీపురంమన్యం జిల్లా-13, అల్లూరి సీతారామరాజు జిల్లా-7, విశాఖ-1, అనకాపల్లి-11, కాకినాడ-7, కోనసీమ-7, తూర్పుగోదావరి-19, పశ్చిమగోదావరి-2, ఏలూరు-7, ఎన్టీఆర్-5, గుంటూరు-2, పల్నాడు-2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. సోమవారం 2 మండలాల్లో తీవ్రవడగాలులు, 15 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందన్నారు.
శనివారం వైఎస్సార్ జిల్లా అట్లూరులో 43.7°C, నంద్యాల జిల్లా రుద్రవరం, ప్రకాశం జిల్లా పెద్దారవీడులో 43.5°C, అన్నమయ్య జిల్లా వతలూరులో 42. 7°C, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 42.4°C, అనకాపల్లి జిల్లా రావికమతంలో 42.2°C, విజయనగరం జిల్లా గుర్లలో 42.1°C, తిరుపతి జిల్లా గూడూరులో 41.8°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. అలాగే *96 ప్రాంతాల్లో 41°C కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు* అయినట్లు ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. 27 మండలాల్లో తీవ్రవడగాలులు, 103 మండలాల్లో వడగాలుల వీచాయన్నారు.
ప్రజలు బయట వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మే నెల రాకముందే ఎండలు మండిపోతున్న తరుణంలో ప్రజలు బయటకు వెళ్లేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
* తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలలి.గొడుగు ఉపయోగించాలి
* చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి.
* గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.





















