Betting Apps Promotion: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహారం - బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై ఫిర్యాదు!
Hyderabad News: బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారని.. టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ, రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరో గోపీచంద్‌లపై తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది.

Complaint Against Balakrishna Prabhas Gopichand Over Betting App Promotions: తెలంగాణలో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పలువురు స్టార్ హీరోలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
టాప్ హీరోలపై ఫిర్యాదు..
ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణతో (Balakrishna) పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), స్టార్ హీరో గోపీచంద్‌పై (Gopichand) తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది. రామారావు అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. స్టార్ హీరోలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయడంతో లక్షలాది మంది డబ్బులు పోగొట్టుకున్నారని.. మ్యూల్ అకౌంట్స్ ద్వారా చైనీయులకు ఈ నగదు చేరిందని ఆయన ఆరోపించారు. మరి దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Also Read: 'డివోర్స్ టైంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా' - రోజుకో బాటిల్ తాగేసివాడినన్న ఆమిర్ ఖాన్
పలువురి నటులపై ఫిర్యాదు
ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేశారంటూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు నుంచి స్టార్ హీరోల వరకూ నోటీసులు అందుకున్నారు. వీరిపై అందిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సినీ ప్రముఖులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటే అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభాశెట్టి, నయని పావని, అమృత చౌదరి, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత ఉన్నారు. ప్రమోద్ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.
అయితే, దీనిపై విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ స్పందించారు. స్కిల్ బేస్డ్ గేమ్ యాప్‌నకు మాత్రమే రానా బ్రాండ్ అంబాసిడర్‌గా చేసినట్లు ఆయన టీం తెలిపింది. ఒప్పందాలు చేసుకునే ముందు రానా లీగల్ టీం అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని.. చట్టపరమైన సమీక్ష తర్వాత, చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉండేలా ప్లాట్ ఫాంను అంగీకరించినట్లు స్పష్టత ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తోన్న ఏ సంస్థకు ఆయన ప్రచారం చేయలేదని వివరణ ఇచ్చారు. మరోవైపు.. ప్రకాష్ రాజ్ సైతం దీనిపై వివరణ ఇచ్చారు. యాడ్ తన వద్దకు వస్తే చేశానని.. అది తప్పని కొద్ది నెలల్లోనే తెలుసుకున్నట్లు వెల్లడించారు. అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత దాన్ని ఆపమని చెప్పలేకపోయానని అన్నారు. ఆ తర్వాత దాన్ని పొడిగించాలని కోరినా తిరస్కరించినట్లు వివరించారు. అప్పటి నుంచీ ఏ గేమింగ్ యాప్‌నకు ప్రచారం చెయ్యలేదని స్పష్టం చేశారు. దేవరకొండ టీం సైతం దీనిపై వివరణ ఇచ్చారు.
ఇప్పటికే ఈ వ్యవహారంలో యాంకర్ శ్యామల హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెను విచారించుకోవచ్చని అరెస్ట్ చెయ్యొద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. అటు.. యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రీతూచౌదరిలను సైతం పంజాగుట్ట పోలీసులు ఇటీవల సుదీర్ఘంగా విచారించారు. నోటీసులు ఇచ్చిన మరికొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లను సైతం విచారిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

