Actress Rajitha Mother: టాలీవుడ్ నటి రజితకు మాతృవియోగం - ప్రముఖుల సంతాపం
Actress Rajitha: టాలీవుడ్ ప్రముఖ నటి రజిత తల్లి విజయలక్ష్మి గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tollywood Actress Rajitha Mother Vijaya Lakshmi Passed Away: టాలీవుడ్ ప్రముఖ నటి రజిత (Rajitha) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మాతృమూర్తి విజయలక్ష్మి (Vijaya Lakshmi) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. విజయలక్ష్మి మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటి రజితకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విజయలక్ష్మి అంత్యక్రియలు శనివారం ఉదయం 11 గంటలకు ఫిలింనగర్‌లోని మహా ప్రస్థానంలో జరగనున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులు కృష్ణవేణి, రాగిణిలు.. విజయలక్ష్మికి చెల్లెళ్లు. రజిత తల్లితోనే కలిసి ఉంటున్నారు.
నటి రజిత వెండితెరపై సహాయ నటిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 18 ఏళ్ల వయసులోనే వెండితెరపై అరంగేట్రం చేశారు. ఫస్ట్ మూవీ 'బ్రహ్మరుద్రులు'లో అక్కినేని నాగేశ్వరరావు కూతురిగా నటించారు. తెలుగులోనే కాక తమిళం, కన్నడ, మలయాళం, ఒరియా భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించారు. 1998లో వచ్చిన పెళ్లికానుక సినిమాలో ఉత్తమ హాస్య నటిగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. కూలీ నెం.1, ప్రేమ ఖైదీ, పెళ్లి సందడి, జులాయి, వర్షం, మల్లీశ్వరి, సరైనోడు, పండుగ చేస్కో, పిల్లా నువ్వు లేని జీవితం, వీరసింహారెడ్డి వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. తమిళంలో కుసేలన్, లింగా, విశ్వాసం, అన్నాత్తై, చంద్రముఖి 2 చిత్రాల్లో నటించారు. రజిత తల్లిదండ్రులు మల్లెల రామారావు, విజయలక్ష్మి. వీరి స్వస్థలం తూ.గో జిల్లా కొల్ల. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

