Rishabh Pant Trolls: స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ.27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ డకౌట్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
Funny Memes on Pant | లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ జర్నీ డకౌట్ తో మొదలైంది. ఖరీదైన ఆటగాడి నుంచి గోయెంకా ఏం ఆశించారు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

IPL 2025 Rishabh Pant Duck Out | విశాఖపట్నంలోని ఏసీఏ, వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో ఓపెనర్ మిషెల్ మార్ష్ (36 బంతుల్లో 72, 6 ఫోర్లు, 6 సిక్సర్లు), నికోలస్ పూరన్ (30 బంతుల్లో 75, 6 ఫోర్లు, 7 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసింది. మరో 3 బంతులు మిగిలుండగానే లక్నో ఇచ్చిన టార్గెట్ ఢిల్లీ ఛేదించి సంచలనం సృష్టించింది. అశుతోష్ శర్మ (31 బంతుల్లో 66, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ హాఫ్ సెంచరీ, విప్రజ్ నిగమ్ (15 బంతుల్లో 39, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఢిల్లీ 19.3 ఓవర్లలో 9 వికెట్లకు 211 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ లోనే అత్యంత ఖరీదైన ఆటగాడిన నిలిచిన రిషబ్ పంత్ డకౌట్ కావడంతో సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురుస్తోంది. లక్నో తరఫున రిషబ్ పంత్ అరంగేట్రం మర్చిపోకుండా చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ 6 బంతులాడి డకౌట్ అయ్యాడు. నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ పరుగుల వరద పారించిన చోట, ఓ ఓవర్ బంతులాడి డకౌట్ అయిన పంత్‌పై ట్రోలింగ్ మొదలైంది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో డుప్లెసిస్ కు క్యాచిచ్చి వెనుదిరిగాడు. పంత్ ఆరు బంతుల్లో పది పరుగులు రాబడితే ఫలితం మరోలా ఉండేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
6 ball Duck from 27cr player Rishabh Pant🔥🔥 pic.twitter.com/k02pyJuB20
— TukTuk Academy (@TukTuk_Academy) March 24, 2025
లక్నో మేనేజ్మెంట్ రూ. 27 కోట్లు ఇచ్చి మరీ పంత్ ను ఏరికోరి వేలంలో దక్కించుకుంది ఇందుకేనా అంటూ ట్రోల్ చేస్తున్నారు. అందులోనూ తోటి బ్యాటర్లు ఓవర్ కు దాదాపు 11 పరుగుల చొప్పున పరుగులు చేసిన చోట LSG కెప్టెన్ రిషబ్ పంత్ ఆరు బాల్స్ ఆడి డకౌట్ కావడంతో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఖరీదైన ఆటగాడు ఆరు విలువైన బంతులు వృథాచేసి మరీ డకౌట్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Blind slogger sympathy merchant Rishabh Pant gone for 6 balls duck.
— Rajiv (@Rajiv1841) March 24, 2025
He had created a ecosystem which presented him as a big match winner and a great clutch player, media people & commentators even hyped him in T2OIs & ODIs.
Can't believe Goenka paid 27 crores for him & shame on… pic.twitter.com/PJMzI07FzF
మిచెల్ మార్ష్ లాంటి బ్యాటర్ ముందుండీ మిచెల్ స్టార్క్ లాంటి బౌలర్ ను ఎదుర్కొని పరుగులు రాబట్టాడు. కానీ రిషబ్ పంత్ మాత్రం తనకేమీ పట్టనట్లుగా ఆరు బాల్స్ ఆడి మరీ డకౌట్ కావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పూరన్, మార్ష్, మిల్లర్ లాంటి విధ్వంసకారుల కంటే పంత్‌కు ఎక్కువ చెల్లించడం అనవసరం అని అభిప్రాయపడుతున్నారు.
27 Crore Rishabh Pant Out For 6 Ball Duck In A Match Where LSG Is Scoring At 12 Runs Per Over and batsman like Mitchell Marsh is smashing starc for fun 😂😂🤣 pic.twitter.com/V8wbQMX4b0
— Kevin (@imkevin149) March 24, 2025
పంత్ కీపింగ్ కూడా సరిగ్గా చేయలేదని, అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్ లో నిరాశ పరిచాడని ట్రోలింగ్ జరుగుతోంది.
#RishabhPant 😥😥😥#TATAIPL2025 #DCvLSG pic.twitter.com/c7ijjBoeIn
— Pratik Singh (@Pratikbihar) March 25, 2025
#RishabhPant : If you love Rishabh Pant's from your heart then do not skip this tweet without ♥️ liking it
— Niranjan Meena (@NiranjanMeena25) March 24, 2025
Watch Rishabh Pant's over acting in IPL2025, Delhi owner's heartbeat will increase after seeing such antics! #DCvsLSG #IPL2025 #KLRahul pic.twitter.com/e1DO73Ocyq
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

