Posani Bail: సీఐడీ కేసులోనూ పోసానికి బెయిల్ - ఈ సారైనా బయటకు వస్తారా?
Andhra Pradesh: పోసాని కృష్ణమురళికి సీఐడీ కేసులోనూ బెయిల్ మంజూరు అయింది. ఇతర కేసుల్లో బెయిల్ ఇప్పటికే రావడంతో విడుదలయ్యే అవకాశం ఉంది.

Posani granted bail in CID case: పోసాని కృష్ణమురళికి సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆయనను ఓ రోజు కస్టడీకి తీసుకుని విచారించారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్ఫింగ్ ఫోటోలు చూపించి చంద్రబాబు,లోకేష్, పవన్ లను దూషించిన వ్యవహరంపై ఆయనపై ఓ టీడీపీ నాయకుడు కేసు పెట్టారు. సమాజంలో వర్గాల మధ్య ద్వేషాన్ని పెంచి అల్లర్లు చెలరేగే కుట్ర చేశాడన్న కారణంగా ఆయనను అరెస్టు చేశారు. ఇప్పటికే ఆయనపై ఇతర కేసులు చాలా ఉన్నాయి. వాటిలో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఇక కర్నూలు జైలు నుంచి విడుదల అవుతారు అనుకున్న సమయంలో సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ పై అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్న పోసాని
సీఐడీ కోర్టులో హాజరుర పరిచినప్పుడు 70 ఏళ్ల వయసులో తనను అనేక ప్రాంతాల్లో తిప్పుతున్నారని... అసలు ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పడంలేదని వాపోయారు. అన్యాయంగా వాదనలు వినిపిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు తనకు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని ఇప్పటికే రెండుసార్లు స్టంట్లు వేశారని గొంతు చికిత్స కూడా జరిగిందని ఆరోగ్యం సహకరించడం లేదని పోసాని న్యాయమూర్తికి చెప్పుకున్నారు. తాను తప్పు చేసినట్టు తేలితే నరికేయాలని కోరారు. రెండు రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాన్నారు.
పోసానిపై ఇంకా చాలా స్టేషన్లలో కేసులు
పోసానిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 30కిపైగా ఫిర్యాదులు వచ్చాయి. అందులో 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26న అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసులో ఆయన అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లకు తిరుగుతూనే ఉన్నారు. ఇంకా పోసానిపై ఇంకా అనేక చోట్ల కేసులు నమోద అయి ఉన్నందున ఆయనను ఏ జిల్లా నుంచి అయినా పోలీసులు వచ్చి పీటీ వారెంట్‌తో అదుపులోకి తీసుకుంటారా లేకపోతే విడుదలవుతారా అన్న ఉత్కంఠ ఏర్పడింది. ఏ పోలీస్ స్టేషన్ నుంచీ ఎవరూ పీటీ వారంట్ తో రాకపోతే శనివారం ఉదయం పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది.
పీటీ వారెంట్లు లేకపోతే శనివారం విడుదల
పోసాని కృష్ణమురళి వైసీపీలో అత్యంత అసభ్యంగా మాట్లాడే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఆయనపై కోర్టులు కూడా కేసులు పెట్టాలని ఆదేశించాయి. నారా లోకేష్ మంగళగిరి కోర్టులో ప్రైవేటు పిటిషన్ కూడా దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన అదే భాషను కొనసాగించారు. అయితే పలు చోట్ల కేసులు నమోదు కావడంతో తూచ్ అన్నారు. తనకు ఇక రాజకీయాలతో సంబంధం లేదని ప్రకటించారు . ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కానీ పోలీసులు మాత్రం ఆయనను వదిలి పెట్టలేదు. ఇంకా ఆయన చుట్టూకేసుల వలయం ఉందని భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

