అన్వేషించండి

SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!

SLBC Tunnel Collapse | శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ ప్రమాదంలో లోపల చిక్కుకున్న వారిలో రెండో మృతదేహం ఆనవాళ్లను గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లి పరిశీలిస్తున్నారు.

SLBC Tunnel Rescue operation | అమ్రాబాద్‌: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ (SLBC) రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి లభించింది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లోపల రెస్క్యూ టీమ్ మరో మృతదేహం ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఫిబ్రవరి 22న ప్రమాదం జరిగింది. ఇప్పటివరకూ టన్నెల్ బోరింగ్ మేషిన్ ఆపరేటర్ మృతదేహం మాత్రమే లభ్యమైంది. తాజాగా మరో మృతదేహం ఆనవాళ్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్ లోపల మొత్తం 8 మంది చిక్కుకుపోగా, రెండు వారాల తరువాత టీబీఎం ఆపరేటర్ డెడ్ బాడీ లభ్యమైంది. మరో 3 వారాల తరువాత రెండో మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ గుర్తించింది. 

లోకో ట్రాక్‌ వద్ద దుర్వాసన వస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. అక్కడ తవ్వకాలు చేపట్టగా రెండో మృతదేహం ఆనవాళ్లు లభించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అనుమానిత ప్రాంతాలు డీ1, డీ2లలో తవ్వకాలు చేపట్టిన రెస్క్యూ టీమ్, మరోచోట తవ్వకాలు జరుపుతుండగా మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. అధికారులు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మృతదేహం ఆనవాళ్లు సమాచాంతో అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లి పరిశీలిస్తున్నారు. 

సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను సోమవారం నాడు ఆదేశించారు. కార్మికుల మృతదేహాలను వీలైనంత త్వరగా టన్నెల్ నుంచి వెలికితీయాలని సూచించారు. తాత్కాలిక సహాయక చర్యలతో పాటు భవిష్యత్తులో ఏ ప్రమాదం జరగకుండా శాశ్వత చర్యలపైనా దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైతే ఎస్‌ఎల్‌బీసీ ఎన్‌జీఆర్‌ఐ (NGRI), జీఎస్‌ఐతో అధ్యయనం చేయించాలని అధికారులకు రేవంత్‌ రెడ్డి చెప్పారు.

బాధితుల కుటుంబాలకు పరిహారం
కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం బాధితుల కుటుంబాలకు పరిహారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని సమాచారం. 
సొరంగం నుంచి కార్మికుల మృతదేహాలను వెలికితీసే ప్రక్రియలో భాగంగా డ్రిల్‌ అండ్‌ బ్లాస్ట్‌ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉన్నత స్థాయి కమిటీ సూచనల మేరకు చర్యలు తీసుకోనున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
SLBC Tunnel పనుల్లో కీలక పరిణామం.. ప్రమాదకరమైన షియర్‌జోన్‌‌ దాటుకుని తవ్వకాలు: మంత్రి ఉత్తమ్
SLBC Tunnel పనుల్లో కీలక పరిణామం.. ప్రమాదకరమైన షియర్‌జోన్‌‌ దాటుకుని తవ్వకాలు: మంత్రి ఉత్తమ్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Embed widget