Crime News: యూపీలో మరో దారుణం, పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య
నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ హత్య తరహాలోనే యూపీలో మరో దారుణం జరిగింది. పెళ్లయిన 15 రోజులకే భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేపించడం కలకలం రేపుతోంది.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి హత్య ఘటన మరువక ముందే మరో దారుణం జరిగింది. యూపీలోని Auraiya జిల్లాలో వివాహం జరిగిన కేవలం 15 రోజులకే భార్య, ఆమె లవర్ కలిసి ఓ అమాయకుడ్ని హత్య చేశాడు. కాంట్రాక్ట్ కిల్లర్ కు సుపారీ ఇచ్చి మరీ కొత్త పెళ్లికొడుకును అతడి భార్యే చంపించడం సంచలనంగా మారింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించి, మూడు రోజుల వ్యవధిలో వారిని అరెస్టు చేశారు.
ఘనంగా వివాహం, అంతలోనే భర్త హత్య
ఔరయ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 25 ఏళ్ల ఏళ్ల యువకుడికి 15 రోజుల కిందట 22 ఏళ్ల ప్రగతి యాదవ్ తో పెద్దలు ఘనంగా వివాహం జరిపించారు. కానీ తాను ఎప్పటినుంచో అనురాగ్ అలియాస్ మనోజ్ తో కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. దాంతో తన రిలేషన్ షిప్ కోసం భర్తను హత్య చేయాలని ప్రియుడితో కలిసి ప్రగతి యాదవ్ ప్లాన్ చేసింది. రామ్‌జీ చౌదరి అనే కాంట్రాక్ట్ కిల్లర్ కు హతయ చేయడానికి సుపారీ సైతం ఇచ్చారు.
మార్చి 19న ప్లాన్ చేసి మరీ ముగ్గురు కలిసి ప్రగతి యాదవ్ భర్తపై తీవ్రంగా దాడి చేశారు. కాంట్రాక్ట్ కిల్లర్ రామ్ చౌదరి బాధితుడ్ని కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన వ్యక్తి సమాచారం అందగా పోలీసులు అక్కడికి చేరుకుని అతడ్ని బిధునాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్పించామని సహార్ ఎస్‌హెచ్‌ఓ పంకజ్ మిశ్రా పీటీఐకి తెలిపారు. పరిస్థితి విషమించడంతో తరువాత సైఫాయి ఆసుపత్రికి, అటు నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు తరలించారు. చివరకు ఆగ్రాకు తరలించినా ప్రయోజనం లేకపోయింది.
చివరకు మార్చి 20న ఔరయ్యలోని ఆసుపత్రిలో చేర్పించగా అక్కడే చికిత్స పొందుతూ మార్చి 21న రాత్రి బాధితుడు మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి మూడు రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. అతడి భార్యనే హత్యకు కుట్ర చేసినట్లు వెల్లడించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటాడని భావించి తన ప్రియుడితో మాట్లాడగా, సుపారీ ఇచ్చి హత్య చేపించినట్లు తెలిపారు.
మీరట్ మర్చంట్ నేవీ అధికారి హత్య
ఇటీవల యూపీలోని మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కలకలం రేపింది. అధికారి భార్య ముస్కాన్ రస్తోగి, తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి సౌరభ్ రాజ్‌పుత్ ను దారుణంగా హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ప్లా్స్టిక్ డ్రమ్‌లో పెట్టి, సిమెంట్‌తో కప్పి ఉంచడాన్ని పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తరువాత అతడి మొండెంపై భార్య కూర్చుంది. మృతదేహాన్ని ముక్కలు చేసిన తరువాత తన లవర్ సాహిల్ శుక్లాతో కలిసి ముస్కాన్ హిమాచల్ ప్రదేశ్‌కు టూర్ సైతం వెళ్లింది. బాధితుడి సెల్ ఫోన్ నుంచి మెస్సేజ్ చేస్తూ అతడి కుటుంబాన్ని పక్కదారి పట్టించారు.
టూర్ నుంచి తిరిగొచ్చాక డెడ్ బాడీని ఎవరికీ తెలియకుండా మాయం చేయాలనుకున్నారు. కానీ మార్చి 18న నాటకీయంగా క్రైమ్ కథ వెలుగు చూసింది. టూర్ నుంచి వచ్చిన ముస్కాన్, శుక్లాలు డ్రమ్ ను ఇంటి నుంచి బయటకు తరలించడానికి కూలీలను పురమాయించగా వాళ్లు ఎంత ప్రయత్నించినా ఆ బరువు మోయలేకపోయారు. మరోవైపు దుర్వాసన రావడంతో కూలీలు అనుమానం వచ్చి తిరిగి వెళ్లిపోయారు. తల్లితండ్రులు పదేపదే నిలదీయగా ముస్కాన్ తాను చేసిన దారుణాన్ని బయటపెట్టింది. వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముస్కాన్, ఆమె లవర్ సాహిల్ శుక్లాను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.






















