Gadhi Tatha Chettu OTT Streaming: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కుమార్తె మూవీ - 'గాందీ తాత చెట్టు' స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా..?
Gandhi Tatha Chettu OTT Platform: స్టార్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'గాంధీ తాత చెట్టు'. ఈ మూవీ సడెన్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

Sukumar's Daughter Sukriti Veni Gandhi Tatha Chettu OTT Streaming On Amazon Prime Video: స్టార్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి (Sukriti Veni) ప్రధాన పాత్రలో నటించిన ఫస్ట్, లేటెస్ట్ మూవీ 'గాందీ తాత చెట్టు'. తొలి సినిమాలోనే తనదైన నటనతో మెప్పించారు సుకృతి. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి సుకుమార్ భర్య బబితనే ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పలు అవార్డులు అందుకోగా.. తొలి సినిమాకు ఉత్తమ బాలనటిగా సుకృతికి పురస్కారాలు వచ్చాయి.
సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ
ఈ మూవీకి పద్మావతి మల్లాది దర్శకత్వం వహించగా జనవరి 24న థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోగా.. రిలీజ్ అయినంత వేగంగానే వచ్చి వెళ్లిపోయింది. ఇప్పుడు సడన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో అందుబాటులో ఉంది.
A young girl's non-violent campaign to protect her grandfather's beloved tree from demolition, inspired by Gandhi's philosophy of peaceful resistance.
— Cinema World (@cinema_worldx) March 21, 2025
Telugu Film #GandhiTathaChettu Now Streaming On @PrimeVideoIN pic.twitter.com/EUUE5ZKNb1
Also Read: 'రాబిన్ హుడ్' సాంగ్ స్టెప్పుల కాంట్రవర్సీ - స్పందించిన హీరో నితిన్.. ట్రోల్స్‌పై ఏమన్నారంటే..?
అసలు స్టోరీ ఏంటంటే..?
నిజామాబాద్ జిల్లాలోని అడ్లూరులో రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) తన మనవరాలితో (సుకృతివేణి) కలిసి ఉంటాడు. ఆయన గాంధేయవాది. గాంధీపై అభిమానంతో తన మనవరాలికి గాంధీ అని పేరు పెడతారు. నలుగురిని నవ్వుతూ పలకరించడం, తనకున్న 15 ఎకరాల భూమిలో వేప చెట్టు కింద కూర్చుని పుస్తకాలు చదవడం రామచంద్రయ్య వ్యాపకం. నలుగురి మంచి కోరుకునే తాత లక్షణమే మనవరాలు కూడా వస్తుంది.
అడ్లూరులో రైతులంతా చెరకు సాగు చేస్తారు. అయితే... చెరుకు ఫ్యాక్టరీ మూత పడడంతో నష్టాలపాలవుతారు. అదే సమయంలో ఊరిలో కెమికల్ ఫ్యాక్టరీ పెట్టి అందరికీ ఉపాధి కల్పిస్తామని వ్యాపారవేత్త సతీష్ (రాగ్ మయూర్) వస్తారు. డబ్బుకు ఆశ పడిన గ్రామస్తులు తమ పొలాలు అమ్మేస్తారు. అయితే తన 15 ఎకరాల భూమిని అమ్మడానికి రామచంద్రయ్య నిరాకరిస్తాడు. దాంతో కొడుకు కోప్పడతాడు. అప్పుడు తాతయ్యకు మద్దతుగా గాంధీ ఏం చేసింది?. పొలాలు అమ్మేసిన ప్రజల్లో ఎలాంటి మార్పు తీసుకు వచ్చింది? గాంధీ చేసిన కృషి వల్ల గ్రామంలో జరిగిన మార్పేంటి.? అహింసా మార్గంలో నడవడం వల్ల ఎటువంటి మార్పు చోటు చేసుకుంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

