Nithiin: 'రాబిన్ హుడ్' సాంగ్ స్టెప్పుల కాంట్రవర్సీ - స్పందించిన హీరో నితిన్.. ట్రోల్స్‌పై ఏమన్నారంటే..?
Robin Hood Song: 'రాబిన్ హుడ్' మూవీలో 'అది దా సర్‌ప్రైజు' స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులపై విమర్శలు రాగా తాజాగా హీరో నితిన్ స్పందించారు. ఆ సాంగ్ షూట్‌లో తాను లేనని అన్నారు.

Nithiin Response On Robin Hood Song Steps Controversy: నితిన్ (Nithiin), వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' (Robin Hood). ఈ మూవీలో 'అది దా సర్‌ప్రైజు' (Adhi Dha Surprisu Song) మూవీ స్టెప్పుల వివాదం రేగిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా పాటలో హుక్ స్టెప్పుపై విమర్శలు రాగా.. హీరో నితిన్ ఈ అంశంపై తాజాగా స్పందించారు.
'ఆ పాట్ షూట్‌లో నేను లేను'
ఆ పాట షూటింగ్ సమయంలో తాను లేనని నితిన్ చెప్పారు. 'పాట విడుదల అయ్యాక చాలామంది ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రియాక్షన్స్ వచ్చాయి. స్టెప్పుల విషయంలో కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. మేము అందరి అభిప్రాయాలను కూడా గౌరవిస్తాం. ఇది ఎక్కడ ముగుస్తుందో నాకు తెలియదు. అంతా మంచే జరగాలని నేను కోరుకుంటున్నా. ఆ షూట్‌లో నేను లేను. సినిమా చూశాను. మూవీ బాగా వచ్చిందనే ఆనందంలో అలా చూస్తూ ఉన్నాను. సాంగ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ట్రోల్స్ చూసిన తర్వాతే నాక్కూడా ఆ పాటలోని స్టెప్పు గురించి అర్థమైంది.' అని నితిన్ తెలిపారు.
Also Read: మెగాస్టార్ లండన్ పర్యటనలో గోల్‌మాల్ - తనను కలిసేందుకు డబ్బులు వసూలు చేయడంపై చిరు ఆగ్రహం
రష్మిక ప్రాజెక్ట్ వదులుకోవడంపై..
ఈ మూవీలో తొలుత రష్మికను హీరోయిన్‌గా అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. దీనిపై నితిన్ స్పందించారు. డేట్స్ సర్దుబాటు విషయంలో సమస్యలు తలెత్తడం వల్లే రష్మిక ఈ ప్రాజెక్ట్ వదులుకున్నారని చెప్పారు.
శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీపై నెటిజన్ల విమర్శలు
'రాబిన్ హుడ్' మూవీ ప్రమోషన్లలో భాగంగా.. 'అది దా సర్‌ప్రైజు' స్పెషల్ సాంగ్‌లో నటి కేతికాశర్మ భాగమయ్యారు. ఇందులో నుంచి ఓ లిరికల్ వీడియో రిలీజ్ చేయగా.. కొన్ని స్టెప్పులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని తప్పుబడుతూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సైతం ఆమెలానే ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేయడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇలాంటి స్టెప్పులను ఎంకరేజ్ చేయడం ఏంటంటూ నెట్టింట విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.
ఆ పాటలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్
అయితే.. ఇటీవల కొన్ని పాటల మూమెంట్స్‌పై తెలంగాణ మహిళా కమిషన్ సైతం సీరియస్ అయింది. బాలకృష్ణ నటించిన 'ఢాకు మహారాజ్' సినిమాలోని 'దబిడి దిబిడి' పాటలో స్టెప్పులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకరమైన పాటలు, లిరిక్స్ వల్ల యువత తప్పుదారి పట్టే ఛాన్స్ ఉందని.. మహిళలను గ్లామర్ కోణంలో చూపించడం సరికాదని కమిషన్ అభిప్రాయపడింది. మరోవైపు, పుష్ప 2, మిస్టర్ బచ్చన్ మూవీలోని పాటల స్టెప్పులపై కూడా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
భీష్మ' వంటి హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) నుంచి వస్తోన్న మూవీ 'రాబిన్ హుడ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో నితిన్ సరసన శ్రీలీల నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అతిథి పాత్రలో క్రికెటర్ వార్నర్ కనిపించనున్నారు. అలాగే, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 28న మూవీ థియేటర్లలోకి రానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

