Samantha: 'సినిమా హిట్ ఉన్నా లేకున్నా మీ ప్రేమ తగ్గలేదు' - ఆడియన్స్ లేకుండా తాను లేనంటూ సమంత ఎమోషనల్
Samantha About Audience: అభిమానుల ప్రేమకు తానెప్పుడూ రుణపడి ఉంటానని.. వారు లేకుంటే తాను లేనని ప్రముఖ నటి సమంత అన్నారు. ఆమెను కె.బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సత్కరించారు.

Samantha Emotional Words About Fans: అభిమానులు తనపై చూపిస్తోన్న ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని ప్రముఖ నటి సమంత (Samantha) అన్నారు. చెన్నై వేదికగా ఇటీవల జరిగిన బిహైండ్‌వుడ్స్ అవార్డుల వేడుకలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. 2010 నుంచి స్ఫూర్తిదాయక పాత్రలతో ఆడియన్స్‌ను అలరిస్తున్నందుకు ఆమెను కె.బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న తర్వాత ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
హిట్ ఉన్నా.. లేకున్నా..
ఈ అవార్డు అందుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని.. కె.బాలచందర్ సర్ పేరుతో అవార్డు అందుకోవడం తనకెంతో ప్రత్యేకమని సమంత అన్నారు. 'బాలచందర్ సర్ ఎన్నో అద్భుతమైన పాత్రలను మనకు పరిచయం చేశారు. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో స్త్రీ పాత్రలు ఎంతో సహజంగా ఉంటాయి. ఆయన సినిమాల నుంచి నేనెంతో స్ఫూర్తి పొందాను. ఈ రోజు నా జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తోంది. ఈ అవార్డుకు ఎంపిక చేసిన వారందరికీ ధన్యవాదాలు.
సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే మనల్ని అభిమానించే వారు ఉంటారు. నేను రెండేళ్లుగా ఒక్క తమిళ సినిమా కూడా చేయలేదు. ఈ మధ్యకాలంలో సరైన హిట్ కూడా అందుకోలేదు. అయినా.. నాపై మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఈ ప్రేమను చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు. ఇంతటి ప్రేమను పొందేందుకు నేనేం చేశానో కూడా నాకు తెలియదు. మీరు లేకుండా నేను కూడా లేను.' అని సమంత ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ డ్యాన్స్ చేయాలని ఆమెను కోరగా.. తాను ఇప్పుడే యాక్షన్ సీక్వెన్స్ చేసి వచ్చానని.. డ్యాన్స్ చేయలేనని చెప్పారు.
Also Read: మహేష్ తనయుడి నటనకు అభిమానులు ఫిదా... గౌతమ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా, హాలీవుడ్ ఎంట్రీ ప్లాన్?
ఓటీటీ ఉత్తమ నటిగా..
మరోవైపు.. సమంత, వరుణ్ ధావన్ నటించిన 'సిటడెల్: హనీ - బన్నీ' సిరీస్‌లో ఉత్తమ నటనకు సమంతకు ఓ మీడియా సంస్థ ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు అందజేసింది. ఈ అవార్డు తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు సమంత చెప్పారు. నిజానికి ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ సిరీస్ పూర్తి చేసినట్లు తెలిపారు.
'ఏమాయ చేశావే' చిత్రంతో..
చెన్నైకు చెందిన సమంత 'ఏమాయ చేశావే' మూవీతో నటిగా తెరంగేట్రం చేశారు. ఆ సినిమా మంచి సక్సెస్ కావడంతో వరుసగా అటు తెలుగు, ఇటు తమిళంలోనూ వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతకాలంగా ఆమె సినిమాల్లోనే కాకుండా పలు సిరీస్‌ల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు. 2022లో విడుదలైన 'కాతు వక్కుల రెందు కాదుల్' తర్వాత ఆమె తమిళంలో ఏ మూవీలోనూ యాక్ట్ చేయలేదు. ఇటీవలే ఆమె 'సిటడెల్ హన్ బన్నీ'తో ఆడియన్స్‌ను అలరించారు. ప్రస్తుతం ఆమె 'రక్త్ బ్రహ్మాండ్', 'మా ఇంటి బంగారం' చిత్రాలు ఉన్నాయి.
సమంత నిర్మాతగా 'శుభం'
త్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన సమంత.. చిత్ర నిర్మాణ సంస్థలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌పై వచ్చిన ఫస్ట్ మూవీ 'శుభం' (చచ్చినా చూడాల్సిందే అనేది ఉప శీర్షిక) షూటింగ్ ఇటీవలే పూర్తి కాగా.. త్వరలోనే థియేటర్‌లోకి భారీగా విడుదల కానుంది. ఈ చిత్రానికి 'సినిమా బండి' ఫేం ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) దర్శకత్వం వహించారు. మూవీలో సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

