అన్వేషించండి

HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం

HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూమిలో ఉన్న అటవీ ప్రాంతాన్ని చదును చేసే పనులు ఏప్రిల్ 3వ తేదీ వరకు  నిలిపివేయాలని  తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూమిలో ఉన్న అటవీ ప్రాంతాన్ని చదును చేసే పనులు ఏప్రిల్ 3వ తేదీ వరకు నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంచిగచ్చిబౌలి భూముల విషయంలో హెదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, వారితోపాటు వట ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై ఇవాళ(బుధవారం, 2 ఏప్రిల్‌ 2025) తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. కంచి గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యాన వనంగా ప్రకటించాలని ఈ వాజ్యంలో వట ఫౌండేషన్, హెచ్ సీయూ విద్యార్థులు వాజ్యంలో పేర్కొన్నారు. దీనిపై వాజ్యదారుల వాదనలను, అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదనలను విన్న న్యాయస్థానం ఏప్రిల్ 3వ తేదీ వరకు పనులు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది జూన్‌లో జీవో నెంబర్ 54 జారీ చేసింది. దీని ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీ.జీ. ఐ. సీ. సీ కి అప్పగిస్తున్నట్లు జీవో నెంబర్ 54లో తెలంగాణ సర్కార్ పేర్కొంది. దీంతో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం భారీ యంత్రాలతో చదును చేస్తోంది.

వట ఫౌండేషన్, హెచ్ సీయూ తరపున న్యాయవాది వాదనలు ఇలా..
వట ఫౌండేషన్, హెచ్. సీ. యూ తరపున న్యాయవాది ఎల్. రవి శంకర్ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. 
1.  జీవో 54 ప్రకారం 400 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అయినా అందులో ఉన్న చెట్లను, అటవీ ప్రాంతాన్ని చదును చేయాలంటే గతంలో ఇచ్చిన సుప్రింకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పని చేయాలి.
2. సుప్రింకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని చదును చేసి వేరే పనులకు వాడాలంటే అందుకు నిపుణుల కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన సిఫారసు మేరకు ప్రభుత్వాలు పని చేయాలి.
3. అటవీ ప్రాంతంతోపాటు అక్కడ వన్య ప్రాణులు ఉంటే నిపుణుల కమిటీ నెల రోజుల పాటు ఆ ప్రాంతంలో పర్యటించి వన్య ప్రాణుల సమచారం అంతా క్రోడీకరించాలి. వాటిపై ఉండే ప్రభావాన్ని అంచనా వేసి చెప్పాలి.
4. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ చదును చేస్తున్న ప్రాంతంలో 3 సరస్సులు ఉన్నాయి. పెద్ద పెద్ద రాక్స్ ఉన్నాయి.  అరుదైన జీవ జాలం ఉంది. వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. దీనిపై ఎలాంటి అధ్యయం జరకుండా సుప్రింకోర్టు గైడ్ లైన్స్ పాటించకుండా పనులు చేపట్టారు.

తెలంగాణ సర్కార్ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు ఇలా...
1. గచ్చిబౌలి భూముల్లో అటవీ ప్రాంతం లేదు. ప్రభుత్వం అటవీ ప్రాంతంగా ఈ స్థలాన్నినోటి ఫై చేయలేదు. ఈ భూమి నిజాం కాలం నుంచి బీడు భూమిగా రికార్డుల్లో ఉంది. ఇది పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమి మాత్రమే.
2. 2004లో ఈ భూమిని ప్రభుత్వం ఐఎంజీ అకాడమీకి అప్పగించడం జరిగింది. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ప్రకారం ఐ.ఎంజీ ఈ భూములను ఉపయోగించకపోవడంతో అప్పటి సర్కార్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇది పారిశ్రామిక అవసరాల కోసమే తప్ప అటవీ ప్రాంతం కాదు.
3. పిటిషనర్ల వాదనలను పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో వన్యప్రాణులు ఉన్నాయి. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడని పరిస్థితి ఉంటుంది.

 హైకోర్టు ప్రశ్నలు, ఆదేశాలు ఇవే...

ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయస్థానం ఈ 400 ఎకరాల భూమి పారిశ్రామిక అవసరాల కోసమే అని ప్రభుత్వ రికార్డుల్లో ఉందా అని ఏజీని ప్రశ్నించింది. అందుకు ఏజీ, గతం నుంచీ సర్వే నెంబర్‌లోని భూములను ఆయా అవసరాల కోసం ప్రభుత్వాలు కేటాయిస్తూ వస్తున్నాయని చెప్పారు. ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు ఏప్రిల్ 3 వరకు ఎలాంటి పనులు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తునే తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

LB Nagar Police Constable Suicide: ఎల్బీ నగర్ పీఎస్‌లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
ఎల్బీ నగర్ పీఎస్‌లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget