Hyderabad Crime News:ప్రియుడిపై మోజుతో చిన్నారులను చంపిన తల్లి- అమీన్‌పూర్ కేసులో షాకింగ్ నిజాలు
Hyderabad Crime News:ప్రియుడిపై మోజుతో భర్తలను చంపిన మహిళలను చూశారు. హైదరాబాద్‌లో మాత్రం ముగ్గురు కన్నపిల్లలను చంపిందో తల్లి.

Hyderabad Crime News: హైదరాబాద్‌లో గత వారంలో జరిగిన ఓ ఘటనలో అసలు వాస్తవాలను పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రియుడి మోజులో పడి చిన్నారులను తల్లే హత్య చేసినట్టు నిర్దారించారు. దీంతో ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు.
అమీన్‌పూర్‌లో ముగ్గురు చిన్నారులు చనిపోయారనే విషయం చాలా సంచలనంగా మారింది. తల్లి కూడా కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరడంతో అంతా ఫుడ్ పాయిజన్ అనుకున్నారు. అయితే అదే ఫుడ్ తిన్న ఆమె భర్త ఆరోగ్యం బాగానే ఉంది. అతను ఉద్యోగానికి కూడా వెళ్లాడు. దీంతో తల్లి రజితపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో రజితను ప్రశ్నించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 20 ఏళ్లు పెద్దవాడైన చెన్నైతో రజితకు వివాహమైంది. పెద్దలను ఎదురించలేక అప్పట్లో తలవొంచి తాళి కట్టించుకుంది. అనంతరం వాళ్లకు ముగ్గురు పిల్లలు జన్మించారు. ఆయన డ్రైవర్‌గా, ఆమె ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పని చేస్తోంది.
ఈ మధ్య రజిత టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ గెట్‌టుగెదర్ అవుదామని అనుకున్నారు. ఈ క్రమంలోనే చిన్ననాటి స్నేహితుడు శివ పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి రజిత పూర్తిగా మారిపోయింది. శివతో నిత్యం ఫోన్‌లో మాట్లాడుతూ చాటింగ్ చేస్తూ ఉండేది.
శివ, రజిత స్నేహం వివాహేతర సంబంధానికి దారి తీసింది. చాలా క్లోజ్ అయిపోయారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోయారు. పిల్లలు లేకుండా ఉంటే పెళ్లి చేసుకునే వాడిని అంటూ శివ చెప్పిన మాటలను సీరియస్‌గా తీసుకుంది.
శివతో లైఫ్ ఆనందంగా ఉంటుందని భావించింది రజిత. అందుకే పిల్లల అడ్డు తప్పించుకుంటే శివను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చని అపోహలోకి వెళ్లిపోయింది. అందుకే పిల్లలను తొలగించుకునేందుకు ప్లాన్ చేసింది. పిల్లల్ని చంపేస్తున్నట్టు మార్చి 27న శివకు చెప్పింది.
అనుకున్నట్టుగానే ఆ రోజు అందరికీ భోజనం పెట్టింది. తిన్న తర్వాత భర్త ట్యాంకర్ డ్రైవింగ్ పనికి వెళ్లిపోయాడు. భర్త అలా వెళ్లిన వెంటనే ముగ్గురు పిల్లలను గొంతునులిమి చంపేసింది. ఏం తెలియనట్టు పడుకుంది. అర్థరాత్రి దాటిన తర్వాత తనకు కడుపులో నొప్పి వస్తుందని డ్రామా ఆడింది. భర్త వచ్చిన తర్వాత ఆసుపత్రిలో చేరింది.
పిల్లల్ని చూస్తే విగతజీవులై పడి ఉన్నారు. స్థానికు సహాయంతో ఆసుపత్రికి తరలించేసరికి వారు చనిపోయారని వైద్యులు చెప్పారు. ఫుడ్ పాయిజన్ అయిందేమో అని అంతా అనుకున్నారు. పోస్టుమార్టంలో గొంతు నులిమి చంపినట్టు ఆనవాళ్లు ఉండటం, తల్లి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు తమ స్టైల్‌లో విచారించి అసలు విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. రజితను, ఆమెకు సహకరించిన శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.





















