pastor praveen kumar Case: విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన
Pastor Praveen Kumar Case:పాస్టర్ ప్రవీణ్ హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని ప్రభుత్వానికి భార్య జెస్సికా రిక్వస్ట్ చేశారు. విధ్వేషపూర్తి ప్రకటనలు వద్దని మద్దతుదారులకు అభ్యర్థించారు.

Pastor Praveen Kumar Case: గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు మరో మలుపు తిరిగింది. ఆయన మృతి దర్యాప్తు సరైన మార్గంలో వెళ్తోందని ప్రవీణ్ భార్య జెస్సికా ఓ వీడియో విడుదల చేశారు. దీనిపై ఇప్పటి వరకు తనకు అండగా ఉన్న వాళ్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న చర్యలపై నమ్మకం ఉంచుందామని పిలుపునిచ్చారు.
ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోలో ఏమన్నారంటే..." క్రిస్టియన్ సమాజం నుంచి వచ్చిన మద్దతకు చాలా ధన్యవాదాలు. ప్రవీణ్‌ను ఇది మరింత ఉన్నతంగా మార్చింది. ఆయన భర్తగా, తండ్రిగా నాకు మా పిల్లకు చాలా ప్రేమను అందించారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఈ టైంలో మీరు పడుతున్న బాధ మాకు అర్థమైంది. కానీ ఇప్పుడు శాంతిని, నా కుటుంబం కోలుకునేందుకు కాస్త టైం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రేమను, శాంతిని, వ్యాప్తి చేయాలని కోరుకుంటున్నాను. యేసు క్షమించినట్టు మనం కూడా క్షమించేద్దాం. యేసు ప్రేమించినట్టు మనం ప్రేమిద్దాం. బైబిల్ చెప్పినట్టు భారాన్ని అధికారులకు వదిలేద్దాం. ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం.
సమాజాన్ని విడగొట్టేలా చర్యలు చేయడం కంటే మనుషులు కలిపేలా ప్రవర్తిద్దామని జెస్సికా పిలుపునిచ్చారు. "విధ్వంసం వైపు ఆలోచించడం కంటే జీవితాలను నిలబెట్టేలా చూద్దాం. ఆకలిగా ఉన్న వాళ్లకు ఆహారం. అనాథులకు రక్షణగా, పేదలకు మద్దతు ఇద్దాం. నెగిటివిటీని విస్తరించడం కంటే ప్రేమ, నిజాన్ని వ్యాప్తి చేయడంలో మనం దృష్టి పెడదాం. జీసస్ మరణించి మన జీవితాలను నిలబెట్టారు. ఈ ఉదాహరణమే మనం ఫాలో అవుదాం. క్షమించే స్వభావం, ప్రేమతో, మంచితనంతో జీవితాలను నిలబెట్టేందుకే మన జీవితాలను డెడికేట్ చేద్దాం. ధ్వేషంతో ఏం చేయలేం." అన్నారు.
ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రవీణ్ మృతిపై త్వరగా నిజాలు నిగ్గుతేల్చేలా సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించాలని రిక్వస్ట్ చేశారు. "ఈ విషయంపై త్వరగా విచారణ చేసి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. ప్రభుత్వం విచారణపై మాకు నమ్మకం ఉంది. మతసామరస్యాన్ని దెబ్బతీసేలా చర్యలు చేపట్టొద్దని అభ్యర్థిస్తున్నాను. నా భర్త ప్రవీణ్ ఎప్పుడూ సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించలేదు. " అని చెప్పుకొచ్చారు.





















