RCB vs GT Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 8వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam
ఈ సీజన్ లో ఓటమి లేకుండా ఆడిన రెండు మ్యాచ్ లు గెలిచి టాప్ లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు తొలి ఓటమి ఎదురైంది. కింగ్స్ వర్సెస్ ప్రిన్స్ అన్నట్లు హైప్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీని 8 వికెట్ల తేడాతో హోం గ్రౌండ్ లోనే మట్టికరిపించింది గుజరాత్ టైటాన్స్. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. సిరాజ్ మియా..తూ క్యా కియా
నిన్న మొన్నటి దాకా అదే ఆర్సీబీతో ఉన్న సిరాజ్ మియా పటిదార్ సేనకు ఊహించని షాక్ ఇచ్చాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న గుజరాత్ నిర్ణయం సరైనదని పించేలా సీమ్ బౌలింగ్ తో ఆర్సీబీకి చుక్కలు చూపించాడు మహ్మద్ సిరాజ్. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 19 పరుగులు మాత్రమే ఇఛ్చి 3 వికెట్లు తీశాడు మియా. వాటిలో సాల్ట్, పడిక్కల్ వికెట్లు అయితే క్లీన్ బౌల్డ్. హాఫ్ సెంచరీ కొట్టి ప్రమాదకరంగా మారిన లివింగ్ స్టోన్ వికెట్ కూడా తనే తీసి గుజరాత్ టార్గెట్ ఎక్కువగా లేకుండా ఉండేలా చేశాడు సిరాజ్.
2. లివింగ్ స్టన్ షో
అసలు 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ 170 పరుగులు టార్గెట్ ఇస్తుందని ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా అనుకుని ఉండరు. కానీ అద్భుతంగా ఫైట్ బ్యాక్ చేశాడు లియాం లివింగ్ స్టోన్. 40 బాల్స్ లో ఓ ఫోరు, ఐదు సిక్సర్లతో 54పరుగులు చేశాడు లియాం లివింగ్ స్టన్. ప్రధానంగా గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను ఫుల్ గా టార్గెట్ చేసి ఆడాడు లివింగ్ స్టోన్. కొట్టిన ఐదు సిక్సర్లు రషీద్ ఖాన్ బౌలింగ్ లోనే కావటం విశేషం
3. జితేశ్, టిమ్ డేవిడ్ ఫైటింగ్
హాఫ్ సెంచరీ కొట్టి ఆర్సీబీ ని ఆదుకున్న లివింగ్ స్టోన్ తో కలిసి జితేశ్ శర్మ తన జోరు చూపించాడు. 21 బాల్స్ లోనే ఐదు ఫోర్లు ఓ సిక్సర్ తో 33 పరుగులు చేసి మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు జితేశ్ శర్మ. ఇక జితేశ్, లివింగ్ స్టోన్ అయిపోయాక మ్యాచ్ ఆఖరి ఓవర్లలో టిమ్ డేవిడ్ మంచి మజా తెప్పించాడు. 18 బాల్స్ లో మూడు ఫోర్లు 2 భారీ సిక్సర్లతో 32 పరుగులు చేసి ఆర్సీబీకి గౌరవప్రదంగా 169 పరుగులు అందించి జీటీకి 170 టార్గెట్ పెట్టేలా చేశాడు టిమ్ డేవిడ్.
4. జీటీలో జోష్ నింపిన జోస్ బట్లర్
ఆర్సీబీ విసిరిన 170 పరుగుల టార్గెట్ ను జీటీ సునాయాసంగా ఛేదించినట్లు కనిపించింది అంటే రీజన్ జోస్ బట్లర్. కెప్టెన్ శుభ్ మన్ గిల్ త్వరగానే అవుట్ అయిపోవటంతో వచ్చిన జోస్ బట్లర్ ఆర్సీబీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ముందు కొంచెం టైమ్ తీసుకున్నట్లు కనిపించినా..తర్వాత తర్వాత జోరు చూపించాడు. మొత్తంగా 39 బాల్స్ లో 5 ఫోర్లు 6 భారీ సిక్సర్లతో 73 పరుగులు చేసి గుజరాత్ విక్టరీలో కీలకమయ్యాడు జోస్ బట్లర్
5. ముందు సుదర్శన్ చివర్లో రూథర్ ఫోర్డ్
గుజరాత్ కు గిల్ తో కలిసి ఓపెనర్ గా వచ్చిన సాయి సుదర్శన్ మరోసారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బట్లర్ కి స్టైక్ రొటేట్ చేస్తూ అడపాదడపా బౌండరీలు బాదుతునే ఉన్నాడు. 36 బంతుల్లో 7 ఫోర్లు ఓ సిక్సర్ తో 49 పరుగులు చేసి హేజిల్ వుడ్ బౌలింగ్ లో అవుటైపోయి జస్ట్ లో హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు పాపం. సుదర్శన్ అయ్యాక బట్లర్ కి జత కలిసిన షెర్ఫీన్ రూథర్ పోర్డ్ హార్డ్ హిట్టింగ్ తో దుమ్ము రేపాడు. 18 బంతుల్లోనే ఓ ఫోర్ 3 సిక్సర్లతో 30 పరుగులు చేసి మ్యాచ్ ను త్వరగా ఫినిష్ చేయటమే కాకుండా గుజరాత్ టైటాన్స్ కి 8 వికెట్లతేడాతో భారీ విజయాన్ని అందించాడు.
ఇది ఆర్సీబీ కి తొలి ఓటమి కాగా...గుజరాత్ టైటాన్స్ కు రెండో విజయం.





















