అన్వేషించండి

Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం

Quantum Valley in Amaravati: భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటు కానుంది. దీనికోసం ఏపీ IIT మద్రాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో క్వాంటమ్ టవర్‌ను నిర్మించనున్నారు.

Quantum Valley in Amaravati: టెక్ Savvy చంద్రబాబు మరో పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోని తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీని  అమరావతిలో ఏర్పాటు చేయిస్తున్నారు. ఐకె దిగ్గజం ఐఐటీ మద్రాస్ ఇందులో భాగస్వామ్యం వహిస్తోంది. ఇవాళ దీనికి సంబంధించిన అవగాహన కుదురింది. ఐఐటీ మద్రాస్‌లో ఓ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. భారత్ 2023లో 6వేల కోట్లతో ప్రకటించిన నేషనల్ క్వాంటమ్ మిషన్ కు అనుగునంగా ఇది ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా అమరావతిలో భారీ క్వాంటమ్ టవర్‌ను నిర్మిస్తారు.

క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అంటే ఏమిటి?

క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అనేది క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధన- అభివృద్ధికి  కేంద్రంగా ఏర్పడే హబ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ITకి  సిలికాన్ వ్యాలీ  ఏవిధంగా కేంద్రమో… క్వాంటెక్నాలజీకి ఇది కూడా ముఖ్యకేంద్రంగా ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటర్లు క్విబిట్స్ (qubits) అనే ప్రత్యేకమైన డేటా యూనిట్లను ఉపయోగించి సాధారణ కంప్యూటర్ల కంటే వేగంగా సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలుగుతాయి.. ఇది డ్రగ్ డిస్కవరీ, క్లైమేట్ మోడలింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావచ్చు.

ఏపీ లీడింగ్

టెక్నాలజీలను ఒడిచిపట్టుకోవడంలో చంద్రబాబు తీరే వేరు. ఆయన నేతృత్వంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ౩౦ఏళ్ల కిందటే ఐటీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఐటీ తర్వాత వచ్చిన బయో టెక్నాలజీని కూడా చంద్రబాబు ప్రోత్సహించారు. అప్పుడే జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేయించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఫిన్‌టెక్ వచ్చాయి. మూడోసారి సీఎం అయినప్పుడు వాటికి ప్రాథాన్యత ఇచ్చారు.  ఆ తర్వాత ఆయన ఓడిపోయారు. ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్‌డ్ క్వాంటమ్ టెక్నాలజీపై దృష్టి సారించారు. క్వాంటమ్‌ వ్యాలీని అమరావతి కేంద్రంగానే ఏర్పాటు చేయనున్నారు.

నేషనల్ క్వాంటమ్ మిషన్‌తో అనుసంధానం

ఈ ప్రాజెక్ట్ భారతదేశపు నేషనల్ క్వాంటమ్ మిషన్‌తో అనుసంధానంగా ఉంది, దీని కోసం 2023లో ₹6,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ మిషన్ లో 50 నుండి 1,000 ఫిజికల్ క్విబిట్స్ కలిగిన మధ్యస్థాయి క్వాంటమ్ కంప్యూటర్ల అభివృద్ధి, దేశీయంగా  అంతర్జాతీయంగా 2,000 కిలోమీటర్ల దూరంలో శాటిలైట్ ఆధారిత భద్రతా కమ్యూనికేషన్ వ్యవస్థలు స్థాపన వంటి లక్ష్యాలున్నాయి.

భారీ భాగస్వామ్యాలు మరియు పెట్టుబడులు

ఈ ప్రాజెక్ట్‌లో IIT Madras భాగస్వామ్యం ఉంది. అంతేకాకుండా, టీసీఎస్ (TCS), IBM వంటి ప్రముఖ టెక్ కంపెనీలు కూడా ఇందులో భాగస్వామ్యమవుతాయని తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీసీఎస్, IBM సంస్థలతో చర్చలు జరిపింది. "క్వాంటమ్ టెక్నాలజీ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తెస్తుంది. 1990లలో ఐటీ రంగంలో ముందుండినట్లుగా, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీలో నాయకత్వం వహించాలి" అని చంద్రబాబు ఐఐటీ మద్రాస్ కార్యక్రమంలో అన్నారు.  ఇప్పటి వరకూ కెనడాలోని  Waterloo  , జర్మనీలోని Munich లో Quantum Vally లు ఉన్నాయి. అమరావతి కేంద్రాన్ని కూడా అదే రీతిలో అభివృద్ధి చేయాలన్నది ఆలోచన. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 18న ఓ టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రత్యేక ప్రథాన కార్యదర్శి కన్వీనర్‌గా క్వాంటమ్ కంప్యూటింగ్‌లోని నిపుణులతో ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడం, భాగస్వామ్యాలు నెలకొల్పడం ఈ టాస్క్ ఫోర్స్ ప్రధాన ఉద్దేశ్యం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
2026లో మూడో ప్రపంచం యుద్ధం తప్పదన్న బాబా వాంగ! దాన్ని నిజం చేసేలా ఉన్న ట్రంప్?
2026లో మూడో ప్రపంచం యుద్ధం తప్పదన్న బాబా వాంగ! దాన్ని నిజం చేసేలా ఉన్న ట్రంప్?
Hindu Killed in Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
Telugu TV Movies Today: ఆదివారం టీవీల్లో అదిరిపోయే సినిమాలున్నాయ్.. పూర్తి లిస్ట్ ఇదే..
ఆదివారం టీవీల్లో అదిరిపోయే సినిమాలున్నాయ్.. పూర్తి లిస్ట్ ఇదే..

వీడియోలు

Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
2026లో మూడో ప్రపంచం యుద్ధం తప్పదన్న బాబా వాంగ! దాన్ని నిజం చేసేలా ఉన్న ట్రంప్?
2026లో మూడో ప్రపంచం యుద్ధం తప్పదన్న బాబా వాంగ! దాన్ని నిజం చేసేలా ఉన్న ట్రంప్?
Hindu Killed in Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
Telugu TV Movies Today: ఆదివారం టీవీల్లో అదిరిపోయే సినిమాలున్నాయ్.. పూర్తి లిస్ట్ ఇదే..
ఆదివారం టీవీల్లో అదిరిపోయే సినిమాలున్నాయ్.. పూర్తి లిస్ట్ ఇదే..
Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
జనవరి 14 భోగి రోజు మూడు శుభ యోగాలలో షట్తిలా ఏకాదశి వ్రతం, 23 సంవత్సరాల తర్వాత అద్భుతమైన కలయిక!
జనవరి 14 భోగి రోజు మూడు శుభ యోగాలలో షట్తిలా ఏకాదశి వ్రతం, 23 సంవత్సరాల తర్వాత అద్భుతమైన కలయిక!
iPhone Fold Phone: మడతపెట్టే ఐఫోన్.. భారతదేశంలో ధర ఎంత ? ఎప్పుడు లాంచ్ అవుతుంది
మడతపెట్టే ఐఫోన్.. భారతదేశంలో ధర ఎంత ? ఎప్పుడు లాంచ్ అవుతుంది
AP Weather Updates: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణ ప్రజలకు చలి నుంచి రిలీఫ్
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణ ప్రజలకు చలి నుంచి రిలీఫ్
Embed widget