అన్వేషించండి

Viveka Murder Case: వివేకా హత్య కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ! వాట్సాప్‌ కాల్‌ గుట్టు విప్పే పనిలో దర్యాప్తు సంస్థ!

Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు మళ్లీ విచారణ మొదలు పెట్టారు. ఇప్పటికే నిందితులుగా ఉన్న వారి బంధువులను ప్రశ్నిస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సుప్రీంకోర్టు ఆదేశాలతో వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరం.
  • కేసులో నిందితులైన వారి సోదరులకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.
  • హత్య జరిగిన అర్ధరాత్రి వాట్సాప్ కాల్ వివరాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.
  • హైదరాబాద్‌లో విచారణ తర్వాత పులివెందులలో సీబీఐ లోతుగా విచారిస్తోంది.

Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత, ఈ కేసు కొత్త టర్న్ తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు, మళ్లీ విచారణ స్పీడ్ పెంచనున్నారు. శుక్రవారం కడ జిల్లా పులివెందుల పోలీస్ స్టేషన్‌ కేంద్రంగా జరిగిన పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 

రెండేళ్ల తర్వాత సీబీఐ యాక్టివ్‌

వివేకా హత్య జరిగిన చాలా కాలం గడిచినా, ఈ కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసు విచారణపై కొన్ని కీలక సూచనలు చేసింది. దీంతో సీబీఐ అధికాలు మళ్లీ తమ పనిని మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం పులివెందుల పోలీస్ స్టేషన్‌లో అధికారులు విచారణ చేపట్టారు. రెండేళ్ల తర్వాత అధికారులు ఇంత వేగంగా కదలడం చూస్తుంటే కేసులో కీలకమైన ఆధారాలు లభించాయేమో అన్న అనుమానం కలుగుతుంది. 

నిందితుల బంధువులకు నోటీసులు

ఈ కేసులో గతంలో కొందరు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల వైపు సీబీఐ దృష్టి పెట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న వారి సోదరులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్, భరత్‌ కుమార్ యాదవ్ సోదరుడు మహేంద్ర యాదవ్‌కు నోటీసులు ఇచ్చారు. వీరిద్దరి విచారణ రావాలని ఆదేశించగా శుక్రవారం ఉదయమే మహేంద్ర యాదవ్ పులివెందుల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మరోవైపు కిరణ్‌ యాదవ్ కూడా అధికారుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఆ అర్ధరాత్రి వాట్సాప్ కాల్ మిస్టరీ ఏంటీ?

ఈ విచారణలో అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఒక వాట్సాప్ కాల్. వివేకా హత్య జరిగిన తెల్లవారుజామున 1.42 గంటల సమయంలో కిరణ్ యాదవ్‌ ఫోన్ నుంచి ఒక కాల్ వెళ్లినట్టు సీబీఐ గుర్తించింది. అర్జున్ రెడ్డి అనే వ్యక్తికి ఒక వాట్సాప్ కాల్ చేసారు. సాధారణంగా అందరూ నిద్రపోయే ఆ సమయంలో అది కూడా హత్య జరిగిన రోజే ఇంత అర్థరాత్రి కాల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. వారిద్ధరి మధ్య ఏం చర్చ జరిగింది, అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది కేవలం సాధారణ కాల్‌ మాత్రమేనా లేక దీని వెనుక ఏదైనా ప్లాన్ ఉందా అని లోతుగా విచారిస్తున్నారు. 

హైదరాబాద్‌ నుంచి పులివెందుల వరకు... 

నిజానికి వీరిద్దరిని సీబీఐ అధికారులు ఈ నెల 20న హైదరాబాద్‌లో ప్రాథమికంగా విచారించారు. అక్కడ వచ్చిన సమాచారం అధారంగా, మరిన్ని వివరాలు సేకరించేందుకు ఇప్పుడు నేరుగా పులివెందులలలో విచారణ జరుపుతున్నారు. గతంలో దొరికిన కాల్ డేటాను ఇప్పుడు వీరు చెబుతున్న సమాచారాన్ని అధికారులు సరిపోల్చి చూస్తున్నారు. వైఎస్‌ వివేక హత్య కేసు మళ్లీ మొదటికి వచ్చిందా లేదా క్లైమాక్స్‌కు చేరుకుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. 

Frequently Asked Questions

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ఎందుకు వేగవంతమైంది?

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు ఈ కేసు విచారణను మళ్లీ ప్రారంభించారు. రెండేళ్ల విరామం తర్వాత, అధికారులు ఇప్పుడు వేగంగా కదులుతున్నారు.

సీబీఐ అధికారులు ఎవరికి నోటీసులు ఇచ్చారు?

కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న వారి కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా సునీల్ యాదవ్, భరత్ కుమార్ యాదవ్ సోదరులకు నోటీసులు జారీ చేశారు.

విచారణలో ముఖ్యమైన అంశం ఏమిటి?

వివేకా హత్య జరిగిన తెల్లవారుజామున కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి అర్జున్ రెడ్డికి వెళ్లిన ఒక వాట్సాప్ కాల్ చాలా ముఖ్యమైనది. ఆ సమయంలో ఆ కాల్ ఎందుకు వెళ్లింది, వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది అని అధికారులు ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్‌లో ప్రాథమిక విచారణ తర్వాత సీబీఐ ఇప్పుడు ఎక్కడ విచారణ చేస్తోంది?

హైదరాబాద్‌లో ప్రాథమిక విచారణ అనంతరం, మరిన్ని వివరాలు సేకరించేందుకు సీబీఐ అధికారులు ఇప్పుడు నేరుగా పులివెందులలో విచారణ జరుపుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget