అన్వేషించండి

YS Jagan: పులివెందులలో నందీశ్వర ఆలయంలో హోమం - కల్తీ నెయ్యి వివాదం సమయంలో జగన్ ప్రత్యేక పూజలు

Pulivendula: పులివెందుల పర్యటనలో నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో జగన్ పాల్గొన్నారు. హోమం చేశారు.

Jagan participated in the Nandeeshwara temple program :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రెండు రోజుల పులివెందుల పర్యటనలో భాగంగా బుధవారం వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలోని నూతనంగా నిర్మించిన  నందీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. జగన్ రాకతో నందిపల్లి పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.   

ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న శాస్త్రోక్త కార్యక్రమాల్లో భాగంగా జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించిన  హోమంలో ఆయన పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. నందీశ్వరుడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువును దగ్గరుండి వీక్షించిన ఆయన, ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు.   మొత్తం రూ. 6 కోట్ల  వ్యయంతో ఈ ఆలయం రూపుదిద్దుకుంది.   

ఆలయ పర్యటన అనంతరం అర్చకులు జగన్ కు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు జగన్‌ను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆయన స్థానిక ప్రజలతో మమేకమయ్యారు.  

నందిపల్లి కార్యక్రమం ముగిసిన అనంతరం జగన్ తిరిగి పులివెందులకు చేరుకున్నారు. అక్కడ భాకరాపురం క్యాంపు కార్యాలయంలో  ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు.  నియోజకవర్గంలోని వివిధ గ్రామాలనుంచి వచ్చిన బాధితులు, నాయకులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రికి పులివెందుల నివాసంలోనే బస చేసి గురువారం బెంగళూరు వెళ్తారు.   

టాప్ హెడ్ లైన్స్

AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Pulivendula High Tension: పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ బాహాబాహీ.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!
పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ బాహాబాహీ.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు!
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget