అన్వేషించండి

Andhra Pradesh CM Chandra Babu: ఏపీలో రూ. 2లకే యూనిట్ విద్యుత్; ఏఐ, డీప్ టెక్నాలజీకి కేంద్రంగా రాష్ట్రం: చంద్రబాబు

Andhra Pradesh CM Chandra Babu: ఏఐ, డీప్ టెక్నాలజీకి కేంద్రంగా ఏపీ మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ తీసుకొస్తున్న పాలసీలు దేశానికే ఆదర్శంగా ఉంటున్నాయని అన్నారు.

Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్ సహకరాంతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 1995 ప్రాంతంలో హైదరాబాద్ హైటెక్ సిటీని స్థాపించిన విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ, డీప్ టెక్నాలజీకి కేంద్ర బిందువుగా మారుస్తాని నాయుడు అన్నారు. ప్రస్తుతం భారతదేశంలో 65 శాతం మంది ఏఐ వినియోగిస్తున్నారని, ఇది ప్రపంచ సగటు 30 శాతం కన్నా అధికమన్నారాయన. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతికతలో విద్యార్థులు ముందుండాలని సూచించారు. చెన్నైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్‌లో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-(AIRSS) 2025కు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడి విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. 

ప్రపంచం చూసేది ఇండియా వైపే : చంద్రబాబు
" 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. చైనా ఆర్థిక సంస్కరణలతో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. బ్రిటిష్ పాలకులు మనం దేశం నుంచి వెళ్తూవెళ్తూ ఇంగ్లీష్ భాషను మనకు వదిలేసి పోయారు. ఏపీలోని కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకెళ్లారు. టెలికాం రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు బీఎస్ఎన్ఎల్, వీఎస్ఎన్ఎల్ ఆధిపత్యం ఉండేది. సంస్కరణలు రావడంతో ప్రైవేట్ సంస్థలు కూడా టెలికాం రంగంలోకి వచ్చాయి. ఇదొక గేమ్ ఛేంజర్ అయింది. ప్రస్తుతం ప్రపంచం చూపు భారతదేశం వైపు మళ్లింది. రాబోయే రోజులంతా భారతదేశానివే. ఐఐటీ మద్రాస్ చాలా విషయాల్లో మొదటి స్థానంలో ఉంది. వివిధ రకాల ఆన్లైన్ కోర్సులు కూడా అందిస్తోంది. ఐఐటీ మద్రాస్ కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్ అగ్నికుల్ కోస్మోస్, మైండ్‌గ్రో టెక్నాలజీస్ వంటి స్టార్టప్‌ల్లో నూతన పరిశోధనలు భారతదేశాన్ని అంతరిక్షం, సెమీ కండక్టర్ రంగాల్లో ముందుండేలా చేస్తున్నాయి. ఇక్కడి స్టార్టప్‌లు దాదాపు 80 శాతం సక్సెస్ అయ్యాయి. ఈ ఐఐటీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 40 శాతం వరకూ ఉన్నారు.’ అని సీఎం చంద్రబాబు నాయుడుఅన్నారు.  

త్వరలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : ఏపీ సీఎం
"‘1995లో ముఖ్యమంత్రి అయ్యాక తర్వాత బిల్ గేట్స్‌ను కలవాలని అడిగినప్పుడు రాజకీయ నేతలతో సంబంధాలు లేవని, కలవడం కుదరదని అన్నారు. అయినప్పటికీ ఆయనతో సమావేశం కావాలని ఒప్పించి దాదాపు 45 నిమిషాలు మాట్లాడాను. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ స్థాపించాలని బిల్‌గేట్స్‌ను కోరాను. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కు తెలుగువాడైన సత్య నాదెళ్ల సీఈఓగా ఉన్నారు. 2014లో భారత్ పదో ఆర్ధిక వ్యవస్ధగా ఉండేది. ఇప్పుడు ఐదో స్థానానికి ఎగబాకింది. మనమంతా మరింత కృషి చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుంది" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

అమెరికాలోని ధనిక ప్రాంతాల్లో తెలుగు, తమిళులే ఎక్కువ : చంద్రబాబు

" ఇండియాకి జనాభా గొప్పవరం లాంటిది. మన దేశానికి ఇంకో 40 ఏళ్ల దాకా జనాభా సమస్య ఉండదు. దక్షిణ భారతదేశంలో కూడా జనాభాను పెంచాల్సి ఉంది. అమెరికా దేశంలో అత్యధిక తలసరి ఆదాయం మన దేశీయులదే. అక్కడి ధనిక ప్రాంతాల్లోకి వెళ్లి చూస్తే తెలుగు, తమిళం వారే ఎక్కువ మంది ఉంటారు. భారతీయులు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంటారు. సిలికాన్ వ్యాలీ, నాసా, వాల్ స్ట్రీట్‌లలో భారతీయుల ఆధిపత్యాన్ని సాధిస్తున్నారు " అన్న చంద్రబాబు ఈ ఆధిపత్యం మరి కొంతకాలం కొనసాగాలంటే సాంకేతికత అందిపుచ్చుకోవాలన్నారు.

ఎనర్జీ రంగంలో ఏపీనే ముందు ఉంది : ముఖ్యమంత్రి
" గ్రీన్ ఎనర్జీ రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందుంది. భవిష్యత్తులో ఏపీ రూ.2 రూపాయలకే యూనిట్ విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. భారతదేశం మొత్తం 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం ఉంటే, ఇందులో 160 గిగావాట్లు ఒక్క ఏపీలోనే ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాం. ఎనర్జీలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి 7.5 లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ యూనిట్ స్థాపిస్తోంది. రిలయన్స్ బయోఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతోంది. రాబోయే రెండేళ్లలో 20 లక్షల ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేస్తున్నాం" అన్నారు చంద్రబాబు

"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ విధానం దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. ఏఐ వినియోగాన్ని మరింత ప్రోత్సహిస్తాం. భారతదేశం డేటా సేకరణలో ముందుంది. నేను చేతి వేలుకు పెట్టుకున్న రింగ్ నా ఆరోగ్యం ఎలా ఉందో ట్రాక్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్‌కు కేంద్రంగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ అవకాశాలను కల్పిస్తాం. భారతదేశ ఆధునిక టెక్నాలజీ, సరైన నాయకత్వంతో అభివృద్ధి చెందుతుంది.’ అని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Embed widget