అన్వేషించండి
Chandra Babu Visits Polavaram Project: 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - కీలక ప్రకటన చేసిన చంద్రబాబు
Chandra Babu Visits Polavaram Project: పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పోలవరం సందర్శించి నిర్వాసితులతో మాట్లాడారు.

2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - కీలక ప్రకటన చేసిన చంద్రబాబు
1/10

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ(27 మార్చి 2025) పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.
2/10

ప్రాజెక్టు వద్దకు చేరుకోగానే ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు.
3/10

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు చంద్రబాబు.
4/10

పనులు జరుగుతున్న తీరుపై ప్రాజెక్టు వద్దే అధికారులతో సమీక్ష జరిపారు.
5/10

పోలవరం నిర్వాసితులతో కూడా చంద్రబాబు మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు.
6/10

నిర్వాసితులకు రూ.829 కోట్లు నేరుగా అందజేశామని మరికొంత నిధులు అందజేస్తామని వెల్లడించారు.
7/10

పోలవరంలో నీళ్లు పారడానికి ముందే అంటే 2027 నవంబర్ నాటికి నిర్వాసితులకు పునరావాసం పూర్తి చేస్తామనని హామీ ఇచ్చారు.
8/10

గత ప్రభుత్వ హయాంలో పనులు జరగలేదని మండిపడ్డారు.
9/10

నిర్వాసితులకు భారీగా హామీలు ఇచ్చిన జగన్ వాటిని కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు.
10/10

ఇప్పుడు అలాంటి భయం లేదని నిర్వాసితులకు భరోసా ఇచ్చారు చంద్రబాబు
Published at : 27 Mar 2025 06:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion