WhatsApp Accounts Banned: దేశంలో 97 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్- కారణాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు
WhatsApp Accounts Banned: భారతదేశంలో వాట్సాప్ 97 లక్షల అకౌంట్లను మెటా నిషేధించింది. ఫిబ్రవరి 2025 భద్రతా నివేదిక ప్రకారం ఈ చర్యలు తీసుకుంది.

WhatsApp Accounts Banned: తప్పుడు పనులకు వినియోగిస్తున్న లక్షల ఖాతాలను భారత్‌లో వాట్సాప్ నిషేధించింది. ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం, వాట్సాప్ మంగళవారం, ఏప్రిల్ 1, 2025న, ఫిబ్రవరి 2025లో భారతదేశంలో 9.7 మిలియన్ ఖాతాలను నిషేధించిందని తెలిపింది. కంపెనీ ఈ నిర్ణయానికి కారణాన్ని వివరిస్తూ, వాట్సాప్‌ను ఉపయోగించే నిబంధనలను ఉల్లంఘించిన ఖాతాలపై చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది.
వాట్సాప్ ఎందుకు ఖాతాలను నిషేధించింది?
వాట్సాప్ ఫిబ్రవరి 2025 భద్రతా నివేదిక ప్రకారం, కంపెనీ 1.4 మిలియన్లకుపైగా ఖాతాలను ఎవరి నుంచి ఫిర్యాదులు అందకుండానే నిషేధించింది. వీటి గురించి ఏ వినియోగదారుడు కూాడా ఫిర్యాదు చేయలేదు. వాట్సాప్‌కు భారతదేశంలో 500 మిలియన్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. కంపెనీ భారతదేశంలో ఈ 9.7 మిలియన్ ఖాతాలను AI-డ్రైవ్ మోడరేషన్ , లేటెస్ట్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారానే నిషేధించినట్టు తెలిపింది.
వాట్సాప్ తరపున ఒక ప్రతినిధి మాట్లాడుతూ... అనేక సంవత్సరాలుగా వాట్సాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌పై నిరంతరం వర్క్ చేస్తోంది. వినియోగదారులకు పూర్తి భద్రతను అందించడానికి నిరంతరం మా సిబ్బంది ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రమాదం తీసుకొచ్చే వాటిని నిరోధించడానికి వాట్సాప్ ఈ చర్యను తీసుకుంది.
వాట్సాప్ బిగ్ మూవ్
వాట్సాప్ తరపున మరింత వివరిస్తూ... ఐటి నిబంధనలు 2021 ప్రకారం, వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇంత నిర్ణయం తీసుకుందని తెలిపింది. వాట్సాప్‌కు అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించే ఆటోమేటెడ్ డిటెక్షన్ సిస్టమ్ ఉందని కూడా తెలిపింది.
వాట్సాప్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం స్పామింగ్, థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌తో ముడిపడి ఉన్నాయి. వారి అనుమతి లేకుండానే అనేక స్పామ్ గ్రూపుల్లో చేరుస్తున్నారని కొన్ని కేసులు వచ్చాయి. వాట్సాప్ ఈ ఫిర్యాదులను పరిశీలించి, అలాంటి తప్పుడు పనులను చేసే ఖాతాలను నిషేధించింది.
వినియోగదారులకు ఏం చెబుతోంది
వాట్సాప్ వినియోగదారులు ఈ ప్లాట్‌ఫామ్‌ను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచిస్తోంది. ఎలాంటి అక్రమాలకు వాడుకోవద్దని హితవుపలుకుతుంది. ఎవరినైనా గ్రూప్‌లో చేర్చుకునే ముందు కచ్చితంగా వారి అనుమతి తీసుకోవాలని చెబుతోంది. అలా కాకుండా చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. గ్రూపులకు సంబంధం లేని సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దని చెబుతోంది. ఆధారాలు లేని ఎలాంటి సమాచారాన్ని కూాడా ఫార్వర్డ్ చేయొద్దని మరో హెచ్చరిక చేస్తోంది. ఇలాంటి చర్యలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తే మాత్రం కఠిన చర్యలు తెప్పవని వార్నింగ్ ఇస్తోంది. పొరపాటున ఇలాంటి తప్పుడు పనులు చేయకుండానే ఖాతా నిషేధానికి గురైతే తమకు ఫిర్యాదు చేయాలని వాట్సాప్ పేర్కొంది.





















