Alekhyaa Chitti Pickles : అలేఖ్య చిట్టి పికిల్స్‌పై సోషల్ మీడియాలో రచ్చ.. పాపం అంటూనే గట్టిగా వేసుకుంటోన్న నెటిజన్స్
Alekhyaa Chitti Pickles News : పచ్చడి ధర అంత ఉంది ఏంటి అన్నందుకు ఓ అబ్బాయిని అమ్మాయి ఇష్టమొచ్చినట్టు తిట్టింది. అబ్బాయికి సపోర్ట్ చేస్తూ మీమ్ పేజ్‌లు రచ్చ చేస్తున్నాయి. ఇంతకీ మేటర్ ఏంటంటే..

Alekhyaa Chitti Pickles Viral Audio : సోషల్ మీడియాను బిజినెస్ కోసం ఉపయోగిస్తూ ఎంతో మంది సక్సెస్ అవుతున్నారు. ఇన్‌స్టాలో పేజ్‌లు క్రియేట్ చేసి.. బిజినెస్ రన్ చేస్తున్న వారు చాలామందే ఉన్నారు. అలాంటివారిలో అలేఖ్య చిట్టి పికిల్స్ పేజ్ కూడా ఒకటి. ముగ్గురు అక్కాచెళ్లెల్లు కలిసి నాన్‌వెజ్ పికిల్స్ అమ్ముతూ క్రియేట్ చేసిన పేజ్ ఇది. తెలుగు రాష్ట్రాల్లో యువతకు అలేఖ్య చిట్టి పచ్చళ్ల రుచి తెలియకపోయినా.. ఈ అక్కా చెళ్లెల్లు మాత్రం కచ్చితంగా తెలిసే ఉంటారు. ఎందుకంటే పచ్చళ్లకంటే వారే ఎక్కువ ఫేమస్ కాబట్టి.
రమ్య మోక్ష కంచర్ల, సుమ కంచర్ల, అలేఖ్య కంచర్ల .. ముగ్గురు సిస్టర్స్. వీరు ఇన్‌స్టాలో అలేఖ్య చిట్టి పేరుతో నాన్‌వెజ్ పచ్చళ్లు అమ్ముతుంటారు. శుభ్రత, హైజీన్ పేరుతో వీరు అమ్మే పచ్చళ్లకు ఎక్కువ ధర ఉంటుంది. ఇప్పుడు ఈ అలేఖ్య చిట్టి పికిల్స్‌పై సోషలో మీడియాలో తెగ రచ్చ జరుగుతుంది. ఎందుకంటే.. పచ్చళ్ల కాస్ట్ ఇంత ఉందేంటని ఓ కస్టమర్ అడగ్గా.. రాయలేని భాషలో బూతులు తిట్టారు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.
అసలేం జరిగిందంటే..
సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ కోసం ఆర్డర్ చేయాల్సిన నెంబర్ అంటూ ఇచ్చిన 7305607487 నెంబర్‌కు ఓ అబ్బాయి మెసేజ్ చేశాడు. పచ్చళ్ల గురించి ఎంక్వైరీ చేయడంతో వారు పచ్చళ్ల ధరలు పంపించారు. అది చూసి షాకైన వ్యక్తి.. వారు చెప్పిన రేట్లకు దండం సింబల్ పెట్టి.. Y so expensive this pickles i didnt understand అంటూ మెసేజ్ పెట్టాడు. దానితో అలేఖ్య చిట్టి పికిల్స్ నెంబర్ నుంచి ఓ ఆడియో వచ్చింది. దానిలో అతనిని చెప్పలేని భాషలో బూతులు తిడుతూ రికార్డ్ పంపారు అంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది.
ఇంతకీ పచ్చళ్ల ధర ఎంతంటే..
చికెన్ విత్ బోన్స్ అరకిలో పచ్చడి 530 రూపాయలు. అదే బోన్ లెస్ చికెన్ అయితే 750రూ. చికెన్ తొక్కు పచ్చడి అరకిలో 1000 రూపాయలు. గోంగూర చికెన్ రూ.900. మ్యాంగో చికెన్ అయితే 950 రూపాయలు. రొయ్యల పచ్చడి అరకిలో వెయ్యి రూపాయలు. గోంగూర రొయ్యల పచ్చడి అరకిలో 1200. మామిడికాయ రొయ్యల పచ్చడి అరకిలో 1250 రూపాయలు. చేపలు అరకిలో (బోన్ లెస్) 1300. మటన్ బోన్స్‌తో అయితే అరకిలో 1200. బోన్ లెస్ మటన్ అరకిలో 1420 రూపాయలు. గోంగూర మటన్ 1560 అరకిలో. మ్యాంగో మటన్ 1660 అరకిలో.
అరకిలో పచ్చళ్లు ఇంత ధర అంటే ఎవరైనా షాక్ అవుతారు. అయినా ఆ అబ్బాయి నార్మల్‌గా అడిగితే బూతులు తిడుతూ ఆడియో పంపించారంటూ సోషల్ మీడియాలో ఆడియోను వైరల్ చేస్తున్నారు. మీమ్స్ వేస్తున్నారు. హైజీన్ పేరుతో కాస్ట్ పెంచినా.. వారి పచ్చళ్లు వరస్ట్‌గా ఉంటాయంటూ కామెంట్లు, రివ్యూలు ఇస్తున్నారు.
View this post on Instagram
ఫాలోయింగ్ ఎక్కువే..
రమ్య మోక్షకు ఇన్‌స్టాలో ఓ పేజ్‌లో 567 కె ఫాలోవర్లు ఉన్నారు. ఆమెకున్న మరో పేజ్‌లో 261 కె ఫాలోవర్లు ఉన్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ పేజ్‌లో కూడా 73.9 కె ఫాలోవర్లు ఉన్నారు. సుమ కంచర్లకు కూడా 61.3 కె ఫాలోవర్లు ఉన్నారు. వీరిలో రమ్య మోక్షకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ కూడా అవుతాయి.
వల్గర్ కామెంట్లకు..
ఈ ముగ్గురు సిస్టర్స్ వీడియోలు కాస్త ఘాటుగానే చేస్తారు. దానికి ఎవరైనా వల్గర్‌గా కామెంట్లు పెడితే.. వారు కూడా అదే రేంజ్లో రిప్లై ఇస్తుంటారు. అయితే ఇప్పుడు పచ్చళ్ల కోసం ఓ వ్యక్తి పెట్టిన మెసేజ్‌కు ఆడియో రూపంలో రిప్లై ఇవ్వడంతో వారి పికిల్స్ బాన్ చేయాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

