మీరు సెన్స్‌బుల్ పర్సన్ అయితే సోషల్ మీడియాలో ఇవి పోస్ట్ చేయకండి
మీకుండే అలవాట్లు లేదా వ్యసనాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడమే మంచిది. లేదంటే వాటిని ఎవరైనా ట్రిగర్ చేసే అవకాశముంటుంది.
మీకుండే ఆరోగ్య సమస్యలు లేదా లైంగిక సమస్యలను గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. మీ బాధను చూసి సింపతీ ఇచ్చేవారితో పాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కూడా ఉంటారు.
ఆర్థిక సమస్యలుంటే వాటిని ఇన్‌స్టా లేదా ఫేస్‌బుక్‌లలో షేర్ చేస్తారు. వీటిని అడ్వాంటేజ్‌గా తీసుకుని.. ఎవరో ఒకరు మీకు డబ్బు ఆశ చూపి తమ పనులు చేసుకునేందుకు మిమ్మల్ని వాడుకోవచ్చు.
మీ రిలేషన్స్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడమే మంచిది. మీ పార్టనర్‌తో జరిగిన గొడవలు, ఇబ్బందులను పోస్ట్ చేయకపోవడమే మంచిదంటున్నారు.
పొలిటికల్‌గా కానీ.. ఇతరులను కించపరిచే విధంగా పోస్ట్‌లు చేయద్దు. అవి ఈరోజు కాకున్నా రేపైనా మీకు ఇబ్బందిని కలిగిస్తాయి.
ఎక్స్ పోజ్ చేస్తూ.. కాస్త వల్గర్‌గా అనిపించే ఫోటోలను షేర్ చేయకండి. వీటిని వేరేవాళ్లు మార్ఫ్ చేసి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయవచ్చు.
క్షణికావేశంలో కొన్నిసార్లు కామెంట్లు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని కంట్రోల్ చేసుకోండి. లేదంటే అవి ఫ్యూచర్లో ఇబ్బందులు కలిగిస్తాయి.
ఫేక్ న్యూస్, అర్థం లేని ఇన్ఫర్మేషన్ను సోషల్ మీడియాలో షేర్ చేయకండి. అది మీతో పాటు ఇతరులను కూడా ఇబ్బందులకు గురిచేస్తుంది.
మీ అడ్రస్, ఫోన్ నంబర్స్‌ను సోషల్ మీడియాలో ఉంచకండి. ఫ్రాడ్ చేసేవారికి ఇవి దొరికితే మీకు ఇబ్బంది కలుగుతుంది.
ట్రావెల్ చేస్తున్నా.. లేదా మీ రియల్ టైమ్ లోకేషన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయకండి.
మీ పోస్ట్‌లు ఇతరులకు కాకపోయినా మీకైనా పాజిటివ్ ఫీలింగ్ కలిగించాలి. అప్పుడే మీరు సోషల్ మీడియాలో ప్రశాంతంగా ఉంటారు. లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాలి.