ఈ షాకింగ్ విషయాలు మీకే

వాష్​ రూమ్​లో స్మోక్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే

Published by: Geddam Vijaya Madhuri

ఆ అలవాటు వద్దు

బాత్రూమ్​కి వెళ్లినప్పుడు స్మోక్ చేసేవాళ్లు ఉంటారు. అయితే ఈ అలవాటు ఆరోగ్య ఇబ్బందులతో పాటు పలు సమస్యలకు కారణమవుతుందంటున్నారు నిపుణులు.

ఆస్తమ సమస్యలు

వాష్​రూమ్​ క్లోజ్డ్​గా ఉంటుంది. ఆ ప్లేస్​లో స్మోక్ చేస్తే ఆ గాలి బయటకు పోదు. పదే పదే ఆ స్మోకింగ్​ని పీలిస్తే ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

బ్యాక్టీరియా

బాత్​రూమ్​లో స్మోక్ చేస్తే బ్యాక్టీరియా, జర్మ్స్ పెరుగుతాయి. ఇవి శరీరంలోకి వెళ్లి వివిధ సమస్యలకు కారణమవుతాయి. హైజీన్​గా లేకుంటే అవి ఇతరులకు కూడా ఇబ్బంది కలిగిస్తాయి.

నికోటిన్

ఆరోగ్యానికి నికోటిన్ మంచిది కాదు. క్లోజ్డ్ ప్లేస్​లో స్మోక్ చేసినప్పుడు సిగరెట్ పొగ ద్వారా నికోటిన్​ను శరీరం పీల్చుకుంటుంది. ఇది పలు స్కిన్ సమస్యలకు కారణవుతుంది.

గుండె సమస్యలు

నికోటిన్ గుండె సమస్యలను పెంచుతుంది. అధికరక్తపోటు సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఈ సమస్యను తగ్గించుకోవాలనుకుంటే స్మోక్ చేయకపోవడమే మంచిది.

వాసన..

సిగరెట్ వాసన రూమ్​ అంతా వ్యాపిస్తుంది. ఇది చెడు వాసన మీకు శ్వాస సమస్యలను తీసుకువస్తుంది.

కుటుంబానికి..

మీరు ఉపయోగించిన తర్వాత మీ ఫ్యామిలీ అదే వాష్​రూమ్​ని ఉపయోగిస్తే వారికి కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్, కిడ్స్​కి ఇది హానికలిగిస్తుంది.

ఎయిర్ ఫ్లో..

వాష్​ రూమ్​లో స్మోక్ చేస్తే ఎయిర్ ఫ్లో బాగుండదు. వెంటిలేషన్​ ఉండదు. దీనివల్ల ఫ్రెష్ ఎయిర్ లోపలికి రాదు. వాష్ రూమ్ అంతా చెడ్డ వాసన వస్తుంది. పైగా ఈ పొగ శరీరంలో టాక్సిన్స్​ను పెంచుతుంది.

అక్కడ వద్దు

స్మోక్ చేయడం మొత్తానికి మానేస్తే మంచిది. అలా కాదు కచ్చితంగా స్మోక్ చేయాలనుకుంటే క్లోజ్ చేసిన ప్లేస్​లలో కాకుండా.. ఓపెన్ ఏరియాలో చేస్తే మీకు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇతరులకు ఇబ్బంది ఉండదు.