UPI Services Down Again: మళ్లీ స్థంభించిన యూపీఐ సేవలు.. రెండ్రోజుల్లో ఇది రెండోసారి.. సోషల్ మీడియాలో కస్టమర్ల ఫైర్
మొబైల్ ద్వారా చెల్లింపులు చేయడం మెజారిటీ జనానికి అలవాటయ్యింది. దాదాపుగా 9 ఏళ్లలో ఆన్ లైన్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. అయితే యూపీఐ వ్యవస్థ స్థంభించడంతో కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారు.

Latest Telugu News: యూపీఐ లావాదేవీలు చేస్తున్న కస్టమర్లు మరోసారి ఇబ్బంది పడ్డారు. మంగళవారం చాలా చోట్ల యూపీఐ యాప్స్ పని చేయకపోవడంతో చాలా చోట్ల లావాదేవీలు నిలిచిపోయి, గందరగోళ పరిస్థితి నెలకొంది. రెండ్రోజుల కిందట ఇదే పరిస్థితి నెలకొనగా, తాజాగా మళ్లీ ఇప్పుడు అలాగే జరగడంపై వినియోగదారులు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా యూపీఏ లావాదేవీల్లో కీలకపాత్ర పోషించే ఫోన్ పే, గూగుల్ పే, ఇతర ఎస్బీఐ యాప్ లకు కూడా మొరాయించాయి. ఇక డీమానిటైజన్ తర్వాత ఆన్ లైన్ పేమెంట్ వ్యవస్థ విపరీతంగా పేరిగింది. నెలలో కొన్ని లక్షల కోట్ల లావాదేవీలు యూపీఐ, ఇతర కార్డుల ద్వారా జరుగుతున్నాయి. అయితే వీటికి అలవాటు పడిన ప్రజలు తమ దగ్గర నగదు ఉంచుకోవం లేదు. టీ, కాఫీలాంటివి తాగినా, మొబైల్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. ఈక్రమంలో ఇలా రెండ్రోజుల వ్యవధిలో యూపీఐ వ్యవస్థ స్థంభించడంతో వినియోగదారులు అవాక్కవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్, ఫేసుబుక్, ఇన్ స్టాలు ఈ పోస్టులతో హీటెక్కిపోయాయి.
Today due to financial year closing, some of the banks are facing intermittent transaction declines. UPI system is working fine, and we are working with the concerned banks for necessary redressal.
— NPCI (@NPCI_NPCI) April 1, 2025
ఇంతకముందు కూడా..
ఇక ఇంతకుముందు కూడా యూపీఐ డౌన్ కావడంతో వినియోగ దారులు ఇబ్బందులు పడ్డారు. అయితే దీనిపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వివరణ ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం చివరి, తొలి రోజులు కావడంతో చాలా బ్యాంకుల ట్రాన్సక్షన్లు డిక్లైన్ అయ్యాయని, తర్వాత సమస్య పరిష్కరమైందని పేర్కొంది. ఇక యూపీఏకి సంబంధించి ట్రాన్సక్షన్ల లో ఆసల్యమైంది కానీ, ఎలాంటి అంతరాయం కలుగలేదని తెలిపింది. ఏదేమైనా రోజు కోట్లాది ప్రజలు ఉపయోగించే యూపీఐ లావాదేవీలలో అంతరాయం కలగడం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు.
There were some intermittent declines in UPI due to fluctuations in the success rates in some banks. These fluctuations increased the latency in UPI network. NPCI has been working closely with them and UPI has been stable.
— NPCI (@NPCI_NPCI) April 2, 2025
పాతిక లక్షల మార్కుకు..
ప్రతి నెలా యూపీఏ లావాదేవీలు రాకెట్ లా దూసుకెళుతున్నాయి. మార్చినెలలో యూపీఏ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మార్చి నెల చివరినాటికి రూ.24.77 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని ఎన్‌పీసీఐ తెలిపింది. అంతక్రితం నెలతో పోలిస్తే 12.7 శాతం పెరిగాయని వెల్లడించింది.. ఫిబ్రవరిలో రూ.21.96 లక్షల కోట్లు లావాదేవీలు జరగగా.. క్రితం ఏడాది ఇదే నెలలో రూ.19.78 లక్షల కోట్లు నమోదయ్యాయి.. విలువ పరంగా చూస్తే 25 శాతం అధికమయ్యాయని విశ్లేషకులు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

