అన్వేషించండి

Royal Enfield Classic 350ని కేవలం 4600 EMIతో పొందండి... పూర్తి లెక్కలు చూశారా

Classic 350 on EMI: మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఫైనాన్సింగ్ లేదా EMIల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. రూ.10 వేలు డౌన్ పేమెంట్ చెల్లించాలి.

భారత ఆటో మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఒకటి. ముఖ్యంగా యువతలో ఈ బైకులపై ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఎవరైనా రోజూ ఆఫీసుకి వెళ్లి రావడానికి ఒక స్టైలిష్ బైక్ కొనాలనుకుంటే, క్లాసిక్ 350 ఒక మంచి  ఆప్షన్ అని చెప్పవచ్చు. 350cc సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో ఇది ఒకటి. ఈ బైకుకు డిమాండ్ క్రమంగా పెరుగుతూనే ఉంది. 

ఒకవేళ మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌ను కొనాలనుకుంటే, పూర్తి పేమెంట్ చెల్లించి కొనాల్సిన అవసరం లేదు. ఈ బైక్‌ను ఫైనాన్స్ లేదా EMI ద్వారా కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. తద్వారా మీరు ప్రతి నెలా నిర్ణీత EMIని చెల్లించాలి. భారత మార్కెట్లో ఇందులో 5 రకాల వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్లాసిక్ 350 బైక్‌లో అతి తక్కువ ధర కలిగిన వేరియంట్ రెడ్డిచ్ (Redditch). హైదరాబాద్‌లో దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ. 2,34,203 (2 లక్షల 34 వేలు) వరకు ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో పన్నులు, ఇతర ఛార్జీల కారణంగా దీని ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి?

ఒకవేళ మీరు ఈ బైక్‌ను కొనుగోలు చేయడానికి రూ. 10 వేలు డౌన్ పేమెంట్ రూపంలో చెల్లిస్తే, సుమారు 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో మీకు బైక్ లోన్ లభిస్తుంది. దీనితో పాటు, ఎవరైనా కస్టమర్ 3 సంవత్సరాల కాలపరిమితితో లోన్ తీసుకుంటే, వారు ప్రతి నెలా సుమారు రూ.7,130 EMI చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 2 సంవత్సరాల కాలపరిమితితో బైక్ లోన్ తీసుకుంటే నెలవారీ EMI సుమారు రూ. 10,243 వరకు ఉంటుంది.

మీరు ఈ లోన్‌ను 4 ఏళ్ల కాలపరిమితికి తీసుకుంటే ప్రతి నెలా రూ. 5,579 చెల్లించాలి. 5 ఏళ్ల కాలపరిమితికి లోన్ తీసుకుంటే EMI సుమారు రూ. 4,654 వరకు ఉండవచ్చు. అయితే, వేర్వేరు బ్యాంకుల వడ్డీ రేట్లు, లోన్ నిబంధనల కారణంగా EMIలో హెచ్చుతగ్గులు ఉంటాయని తెలిసిందే. అందుకే లోన్ తీసుకునే ముందు బ్యాంక్ రూల్స్, అన్ని డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చదవడం ముఖ్యం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?
E20 Petrol Dispute: E20 పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం.. ఎక్కువ ఇథనాల్‌ కలుపుతున్నారని, రిపేర్లు పెరిగాయని ఆరోపణ
E20 పెట్రోల్‌లో 31.2% వరకు ఇథనాల్? అనుమతించినదాని కంటే ఎక్కువే! అసలు వివాదం ఏమిటి?
204cc ఇంజిన్‌, 26hp పవర్‌తో Yamaha R2.. యూత్‌ స్పీడ్‌కు తగ్గ యాక్సిలరేషన్‌, బ్రేకింగ్‌ ఉన్నట్లేనా?
Yamaha R2పెర్ఫార్మెన్స్‌ టెస్ట్‌: 9 సెకన్లలోనే 0-100kph స్పీడ్‌, R15 కంటే బెటరేనా?
Driving Licence Rules: LLR ఉంది కదాని నేరుగా డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లలేరు.. లైసెన్స్‌ పొందాలంటే కొత్త నిబంధనలు ఇవే!
డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? ఈ ఆరు వీడియోలు చూడకపోతే మీకు DL రాదు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
Misuse of RTI Act: మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Embed widget