అన్వేషించండి

TVS Orbiter V1 Electric Scooter: బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు: టీవీఎస్ ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలు

TVS Orbiter V1 Electric Scooter: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను కోరుకునే వారి కోసం టీవీఎస్ కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. కేవలం ₹49,999 ప్రారంభ ధరతో లభించే ఈ స్కూటర్, రేంజ్ టెక్నాలజీ ఏంటోో చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • TVS Orbiter V1 ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి విడుదలైంది.
  • బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) తో ధర రూ.49,999 కి లభిస్తుంది.
  • 86 కి.మీ రేంజ్, 2.20 గంటల్లో 80% ఛార్జింగ్ సౌకర్యం ఉంది.
  • బ్లూటూత్, నావిగేషన్, రైడింగ్ మోడ్స్, 34లీ. స్టోరేజ్ ఉన్నాయి.

TVS Orbiter V1 Electric Scooter: అద్భుతమైన ఫీచర్లతో తాజాగా టీవీఎస్ సంస్థ ఒక ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ని మార్కెట్లోకి తీసుకువ‌చ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో తనదైన ముద్ర వేస్తున్న టీవీఎస్  తాజాగా 'ఆర్బిటర్ V1' పేరుతో సరికొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సాధారణంగా తక్కువ ధర ఉండే స్కూటర్లలో ఫీచర్లు తక్కువగా ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ, టీవీఎస్ ఈ అపోహను చెరిపివేస్తూ, సరసమైన ధరకే అత్యాధునిక సాంకేతికతను ఈ స్కూటర్ ద్వారా అందిస్తోంది. ఇందులో అదిరి పోయే ఫీచ‌ర్లు ఉన్నాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

ధర ,బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS)

సాధార‌ణంగా ఈవీ కొనుగోలు దారుల‌కు బ్యాట‌రీ ఖ‌ర్చే అధికంగా ఉంటుంది. దీంతో వాహనం ధ‌ర భారీగా పెరుగుతుంది.  ఇక‌, ఈ స్కూటర్ సాధారణ ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,500 గా ఉంది. అయితే, టీవీఎస్ ప్రవేశపెట్టిన 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (BaaS) ప్రోగ్రాం ద్వారా దీని ధర భారీగా తగ్గింది. ఈ పద్ధతిలో కేవలం రూ. 49,999 కే స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. కాకపోతే, బ్యాటరీ కోసం నెలకు రూ. 862 చొప్పున 60 నెలల పాటు సబ్‌స్క్రిప్షన్ చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కొనుగోలు సమయంలో వినియోగదారుడిపై ఆర్థిక భారం తగ్గుతుంది. అంతేకాకుండా, 3 ఏళ్లు లేదా 30,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారంటీ కూడా లభిస్తుంది.

బ్యాటరీ , ఛార్జింగ్:

ఆర్బిటర్ V1 లో 1.8kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐడిసి (IDC) ప్రకారం 86 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ముఖ్యంగా దీని ఛార్జింగ్ వేగం చాలా బాగుంది. కేవలం 2 గంటల 20 నిమిషాల్లోనే సున్నా నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీంతో వేగవంతంగా చార్జింగ్ స‌దుపాయం అందిన‌ట్లు అవుతుంది. 

టెక్నాలజీ ,డిస్ప్లే:

ఇందులో 5.5 అంగుళాల కలర్ ఎల్‌సీడీ (LCD) ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇందులో వేగం, బ్యాటరీ స్థాయి, సమయం ,ఎంత దూరం వెళ్లవచ్చు (Range) వంటి వివరాలు కనిపిస్తాయి. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా కాల్/ఎస్ఎంఎస్ అలర్ట్‌లు మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్లను కూడా పొందవచ్చని కంపెనీ పేర్కొంది.

రైడింగ్ మోడ్స్ ,భద్రత:

నగర ప్రయాణాల కోసం 'సిటీ' మోడ్, ఎక్కువ మైలేజీ కోసం 'ఎకో' మోడ్ (టాప్ స్పీడ్ 45kmph) ఇందులో ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో ప్రయాణించడానికి 'హిల్ హోల్డ్ అసిస్ట్', సుదీర్ఘ ప్రయాణాల కోసం 'క్రూయిజ్ కంట్రోల్' వెనక్కి వెళ్లడానికి 'పార్కింగ్ అసిస్ట్' వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత పరంగా చూస్తే.. స్కూటర్ కింద పడినా (Fall), ఎవరైనా దొంగిలించడానికి ప్రయత్నించినా, లేదా టోయింగ్ చేసినా వెంటనే స్మార్ట్‌ఫోన్ యాప్‌కు అలర్ట్‌లు అందుతాయి. దీంతో సెక్యూరిటీ ప‌రంగా డోకా లేద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. 

స్టోరేజ్ సామర్థ్యం:

ఈ స్కూటర్ మరో ప్రధాన ఆకర్షణ దీని కింద ఉండే 34 లీటర్ల స్టోరేజ్ స్పేస్. ఇందులో రెండు హెల్మెట్లు లేదా నిత్యావసర వస్తువులను సులభంగా సర్దుకోవచ్చు. మొత్తానికి, తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు కావాలనుకునే వారికి టీవీఎస్ ఆర్బిటర్ V1 ఒక అద్భుతమైన ఎంపికని చెప్ప‌వ‌చ్చు. ధ‌ర ప‌రంగాను సామాన్యుల‌కు అందుబాటులో ఉంది. 

 

Frequently Asked Questions

TVS Orbiter V1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంత?

TVS Orbiter V1 ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,500. అయితే, బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) ప్రోగ్రాంతో రూ. 49,999 కే పొందవచ్చు.

TVS Orbiter V1 బ్యాటరీ రేంజ్ ఎంత?

ఈ స్కూటర్ 1.8kWh బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే IDC ప్రకారం 86 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

TVS Orbiter V1 ఛార్జింగ్ సమయం ఎంత?

కేవలం 2 గంటల 20 నిమిషాల్లో సున్నా నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇది వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయాన్ని అందిస్తుంది.

TVS Orbiter V1లో ఉన్న ప్రీమియం ఫీచర్లు ఏమిటి?

సిటీ, ఎకో రైడింగ్ మోడ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, మరియు పార్కింగ్ అసిస్ట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

TVS Orbiter V1లో స్టోరేజ్ సామర్థ్యం ఎంత?

ఈ స్కూటర్ కింద 34 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇందులో రెండు హెల్మెట్లు లేదా ఇతర వస్తువులను ఉంచుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

టెక్టన్‌ కంటే పెద్ద కారు త్వరలోనే రాబోతోంది.. నిస్సాన్‌ కొత్త 7 సీటర్‌ SUV ఫొటోలు లీక్‌!
కొత్త 7 సీటర్‌ కారును సీక్రెట్‌గా టెస్ట్‌ చేస్తున్న నిస్సాన్‌.. ఫొటోలు లీక్‌!
కైలాక్‌ నుంచి కొడియాక్‌ వరకు బాదుడు.. స్కోడా కార్ల ధరలు రూ.20,000 వరకు పెంపు
కొత్త కారు కొనేవాళ్లకు షాక్‌.. మరో రూ.20,000 వరకు జేబుకు చిల్లు పెట్టిన స్కోడా!
Best Bikes Under Rs 1 Lakh: తక్కువ బడ్జెట్ అయితే ఈ బైక్‌లు కొనండి.. ఇంజిన్‌లో పవర్‌ఫుల్, మైలేజ్‌లో బెస్ట్
తక్కువ బడ్జెట్ అయితే ఈ బైక్‌లు కొనండి.. ఇంజిన్‌లో పవర్‌ఫుల్, మైలేజ్‌లో బెస్ట్
Renault Triber 7-సీటర్‌ ఫ్యామిలీ కారు.. రూ.1.16 లక్షల డౌన్‌పేమెంట్‌ చాలు, మిగిలింది EMIల్లో చూసుకోవచ్చు
ఏడు సీట్ల కారు ఇంత చౌకగానా? నెలకు కేవలం రూ.8,300 కడితే Renault Triber మీ సొంతం!

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
KTR Arrogance Allegations: కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
Shubman Gill Double Century: గిల్ ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ రికార్డు .. రోహిత్ సెంచ‌రీ.. ఇండియా రికార్డు ఛేజింగ్.. 406 ర‌న్స్ టార్గెట్ ఉఫ్ మ‌ని ఊదేసిన భార‌త్.. సిరీస్ సొంతం
గిల్ ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ రికార్డు .. రోహిత్ సెంచ‌రీ.. ఇండియా రికార్డు ఛేజింగ్.. 406 ర‌న్స్ టార్గెట్ ఉఫ్ మ‌ని ఊదేసిన భార‌త్.. సిరీస్ సొంతం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో అధికారుల సంచలన వాంగ్మూలాలు.. జగన్ A1గా మారతారా? వాంగ్మూలాలు నిలుస్తాయా?
ఏపీ లిక్కర్ స్కాంలో అధికారుల సంచలన వాంగ్మూలాలు.. జగన్ A1గా మారతారా? వాంగ్మూలాలు నిలుస్తాయా?
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ED దూకుడు - రూ. 40 కోట్ల సుపారీ గుట్టు విప్పేందుకేనా? సీబీఐ వదిలిన లింక్ పట్టేసుకుందా?
వైఎస్ వివేకా హత్య కేసులో ED దూకుడు - రూ. 40 కోట్ల సుపారీ గుట్టు విప్పేందుకేనా? సీబీఐ వదిలిన లింక్ పట్టేసుకుందా?
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
Embed widget