Pushpa 3: 'పుష్ప 3'లో విలన్ మారతాడా? సుకుమార్ అంత మాట అనేశాడేంటి?
Pushpa 3 Villain: పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ సినిమాలలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ చేశారు. మూడో పార్ట్ వచ్చేసరికి అతను మారవచ్చని పుకార్లు వినబడుతున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు తీసుకు వచ్చిన క్యారెక్టర్ పుష్పరాజ్. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఆయన నటించిన 'పుష్ప ది రైజ్', 'పుష్ప 2: ది రూల్' సినిమాలు బాక్సాఫీస్ బరిలో భారీ విజయాలు సాధించాయి. ఆ రెండిటిలోనూ మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) విలన్ రోల్ చేశారు. మూడో పార్ట్ వచ్చేసరికి ఆయన మారవచ్చనే పుకార్లు కొన్ని రోజులుగా ఫిలింనగర్ వర్గాలలో షికారులు చేస్తున్నాయి. ఓ అవార్డుల వేడుకలో సుకుమార్ చెప్పిన సమాధానం కూడా అందుకు బలం చేకూర్చేలా ఉంది.
వచ్చే ఏడాది తెలుస్తుంది...
క్రియేటివ్ జీనియస్ ఇప్పుడే చెప్పలేరట!
'పుష్ప 2: ది రూల్' క్లైమాక్స్ గుర్తు ఉందా? ఒక బాంబు బ్లాస్ట్ జరిగినట్టు చూపించారు. అలాగే ఎండింగ్ వచ్చేసరికి ఫహాద్ ఫాజిల్ ఫేస్ మాత్రం చూపించలేదు. దాంతో భన్వర్ సింగ్ షెకావత్ బతికి ఉన్నాడా? లేదా? అనే క్లారిటీ రాకుండా పోయింది. పతాక సన్నివేశాలలో ఒక ముసుగు మనిషిని చూపించడంతో 'పుష్ప 3'కి కొత్త విలన్ వస్తాడని ప్రచారం మొదలైంది.
'పుష్ప 3: ది ర్యాంపేజ్'లో కొత్త విలన్ వస్తాడా? లేదా? అనేది పక్కన పెడితే కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ చేసిన ఒక ట్వీట్ కూడా వైరల్ అయింది. అందులో 'ది ర్యాంపేజ్' అనే రౌడీ హీరో పేర్కొన్నాడు. దాంతో ఆ ముసుగు మనిషి క్యారెక్టర్ విజయ్ దేవరకొండ చేసే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. మరి కొంత మంది మరో అడుగు ముందుకు వేసి నేచురల్ స్టార్ నాని వస్తాడని కథనాలు సృష్టించారు.
తమిళనాట ఒక అవార్డు వేడుకకు వెళ్ళిన సుకుమార్ ముందు 'పుష్ప 3' ప్రశ్న ఉంచారు. విజయ్ దేవరకొండ, నాని పేర్లు వినిపిస్తున్నాయని ప్రశ్నించగా... ''2025లో సుకుమార్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేడని, 2026లో సుకుమార్ (Sukumar On Pushpa 3)కు ఆ సంగతి తెలుస్తుందని సమాధానం ఇచ్చారు క్రియేటివ్ జీనియస్. అంతే గాని భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుందని మాత్రం చెప్పలేదు. దాంతో 'పుష్ప 3'లో ఫహాద్ ఫాజిల్ చేయకపోవచ్చు అని అర్థమవుతోంది.
Also Read: మధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా బావుందా? లేదా?
Director Sukumar about the lead role in Pushpa 3. #Pushpa2TheRule #Pushpa3 #AlluArjun #VijayDeverakonda pic.twitter.com/lkS2Tja3BJ
— Telugu Chitraalu (@TeluguChitraalu) April 2, 2025
మలయాళంలో ఫహాద్ ఫ్యాన్స్ నిరాశ!
'పుష్ప 3'లో భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ చూపించిన తీరు పట్ల కేరళలో ఫహాద్ ఫాజిల్ ఫాన్స్ డిజప్పాయింట్ అయ్యారని మాలీవుడ్ సినీ వర్గాల గుసగుస. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ సీన్ వాళ్లను హర్ట్ చేసిందట. దానికి తోడు కేరళలో జరిగిన 'పుష్ప 3' ఈవెంట్ ఫహాద్ ఫాజిల్ లేకుండా జరగడం కూడా పుకార్లకు ఊతం ఇచ్చింది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి మరి.
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా చేయబోయే సినిమా స్క్రిప్ట్ మీద సుకుమార్ దృష్టి పెట్టారు. అది పూర్తి అయిన తరువాత పుష్ప మూడో భాగం సెట్స్ మీదకు వెళుతుంది. మరోవైపు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీతో సినిమాలు అంగీకరించారు అల్లు అర్జున్. ఆ రెండు పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆ తర్వాత 'పుష్ప 3' సంగతి చూస్తారు.
Also Read: 'దిల్' రాజు సినిమాకూ టైమ్ ఇవ్వలేదు... హిందీ కోసం సౌత్ వదిలేసింది... ఇప్పుడు కామెంట్స్ ఏంటమ్మా?





















